
పద్మావతి (ఫైల్)
సాక్షి, మహబూబ్‌నగర్: కోయిలకొండ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పద్మావతి (40), జాయింట్ మెర్సి, పద్మప్రియ, లక్ష్మీమానస, సయబాసుల్తానా విధులు ముగించుకుని ఆటోలో మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా, పారుపల్లి స్టేజీ వద్ద పంది అడ్డురావడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో పద్మావతి మృతి చెందగా, నలుగురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
ఇవి చదవండి: పండుగ సెలవుల సరదాలో.. విషాదం! ఇయర్‌ఫోన్స్ ఆధారంగా..