
దీవెన (ఫైల్)
తూర్పుగోదావరి: రామచంద్రపురం మండలంలోని ఏరుపల్లి శివారు రామారావుపేటకు చెందిన 6వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలిక సింగం దీవెన గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. ద్రాక్షారామ ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాలిక తమ ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుంది. ఇది చూసిన ఆమె తమ్ముడు, అక్కలు విషయం తండ్రికి చెబుతామని తెలపడంతో ఆమె భయపడి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేంద్ర తెలిపారు.
ఇవి చదవండి: అనకాపల్లి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య