
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : హోటల్‌లో ఓ యువకుడు అనుమానస్పద రీతిలో మృతిచెందిన ఘటన ఢిల్లీలో చేటుచేసుకుంది. దేశ రాజధానిలోని తాజ్ అంబాసిడర్ హోటల్‌లో జరిగిన ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం. కరణ్ చంద్ర(23) అనే యువకుడు తన తండ్రితో కలిసి సౌత్ ఢిల్లీలోని మల్వియా నగర్‌లో నివసిస్తున్నాడు. తల్లి కూతురుతో కలిసి వేరుగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచి కరణ్ తాజ్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకుని ఉంటున్నాడు. ఈనెల 20 తను ఓ విదేశి కంపెనీతో పనిచేస్తున్నానని తనను ఇబ్బంది పెట్టవద్దని హోటల్ సిబ్బందికి తెలిపాడు. అలాగే రూమ్ బయట డోంట్ డిస్ట్రబ్ బోర్డును తగిలించాడు. అయితే శుక్రవారం కరణ్ రూమ్ ఖాళీ చేసే రోజు అవ్వడంతో హోటల్ సిబ్బంది ఆయన్ను సంప్రదించగా లోపలి నుంచి లాక్‌చేసి ఉన్నట్లు గ్రహించారు. దీంతో తమ వద్ద ఉన్న మాస్టర్ లాక్‌తో రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ మంచం మీద పడి ఉన్న కరణ్‌ను చూసి ఆశ్చర్యానికి గరై పరిశీలించగా అప్పటికే కరణ్ నిపోయినట్లు తేలడంతో వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
హోటల్‌కు చేరుకున్న పోలీసులు సంఘటన స్థలంలో నిద్ర మాత్రలు, ఆల్కహాల్ బాటిల్‌తో పాటు సుసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా తండ్రి, సోదరిల ఫోన్ నెంబర్లు రాసి పెట్టాను. వాళ్లకు తెలియజేయండి. అని రాసుంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవని నిర్దారణకు వచ్చారు. నిద్ర మాత్రలు, ఆల్కహాల్ అధిక మొత్తంలో తీసుకోవడం వల్లే కరణ్ మరణించినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సెక్షన్ 174 కింద న్యాయ విచారణ జరుగుతోందని డీసీపీతెలిపారు. కాగా ఈ సంఘటన గురించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, వారితో మాట్లాడిన అనంతరం పూర్తి స్పష్టత వస్తుందని డీసీపీ తెలిపారు.