బోయ మహాలక్ష్మి (ఫైల్)
కర్నూలు: నగరంలోని కొత్తపేటలోని రామాలయం దగ్గర నివాసముంటున్న బోయ మహాలక్ష్మి (19) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జూపాడుబంగ్లా మండలం తంగడంచె గ్రామానికి చెందిన ఈమె.. తల్లిదండ్రులు చనిపోవడంతో సాయిబాబా సంజీవ నగర్‌లో ఉంటున్న అవ్వ భవానమ్మ వద్ద పెరిగింది. కొత్తపేటకు చెందిన అబ్దుల్ గనిని ప్రేమించి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరికి 8 నెలల కూతురు ఉంది. భర్త చికెన్ పకోడి బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
కుటుంబ కలహాల కారణంగా వీరు నాలుగు నెలల క్రితం వేరు కాపురం పెట్టారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో మహాలక్ష్మి మనస్తాపం చెందింది. బుధవారం తెల్లవారుజామున పాపను తీసుకెళ్లి పాలు తీసుకురమ్మని పంపి తిరిగి వచ్చేలోగా ఇంట్లో కొక్కికి చీరతో ఉరి వేసుకుంది. భర్త వచ్చి గమనించి ఉరి నుంచి కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందింది. అవ్వ భవానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment