కాబూల్: కంధర్ ప్రావిన్స్‌లోని జెరాయ్ జిల్లాలో అఫ్గానిస్థాన్ ప్రభుత్వ రక్షణ దళాలు జరిపిన వైమానిక దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. గత 24 గంటల్లో అనేక ప్రధాన నగరాల్లో జరిగిన ఈ ఘటనల్లో కనీసం 250 మంది తిరుగుబాటుదారులు మరణించగా, దాదాపు 100 మంది గాయపడినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. కాగా తాబిబన్లు ఆప్ఘనిస్తాన్‌లో ఆక్రమించుకున్న గ్రామీణ భూభాగంలో ప్రాంతాలను వారు స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాకుండా కీలక సరిహద్దు క్రాసింగ్‌లను స్వాధీనం చేసున్నారు. ఆ తరువాత తాలిబన్లు ఉండే ప్రావిన్షియల్ రాజధానులను ముట్టడించారు. ఇక శనివారం రాత్రి తాలిబన్లు కంధర్‌లోని విమానాశ్రయంపై మూడు రాకెట్లను ప్రయోగించారు. దీంతో రన్‌వే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయంపై దాడి, లాజిస్టికల్, ఎయిర్ హెల్ప్ కోసం చాలా ముఖ్యమైన ఈ ప్రాంతాన్ని తాలిబన్ల బారి నుంచి కాపాడుకోవాలనుకున్నారు. ప్రస్తుతం హెల్మాండ్ ప్రావిన్స్‌లోని లష్కర్ గాహ్ దగ్గరగా రెండు వేర్వేరు ప్రావిన్షియల్ రాజధానులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక అఫ్గానిస్థాన్ అధికారులు వేసవి కాలంలో తాలిబన్ల ఉనికిని పదేపదే తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.
#Taliban terrorists hideouts were targeted by #AAF in Zherai district of #Kandahar province yesterday. Tens of #terrorists were killed and wounded as result of the #airstrike. pic.twitter.com/mM1uVyeXMu
— Ministry of Defense, Afghanistan (@MoDAfghanistan) August 1, 2021
11 #Taliban terrorists were killed and another was wounded in operations conducted by #ANDSF with support from #AAF in Panjwae district & at the outskirts of #Kandahar provincial center, yesterday.
— Ministry of Defense, Afghanistan (@MoDAfghanistan) August 1, 2021
Also, 7 weapons and some amount of their weapons & amos were destroyed. pic.twitter.com/nsDbdUyiBo
Comments
Please login to add a commentAdd a comment