
క్రికెట్ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి
క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మరో వైపు స్టేడియం సమీపంలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 9మంది మృతిచెందగా, దాదాపు 40 మందికి గాయాలయ్యాయి.
సాక్షి, కాబుల్ : ఓ వైపు టీ-20 క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మరో పక్క స్టేడియం సమీపంలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు సెక్యురిటీ సిబ్బంది మృతిచెందారు. అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సమీపంలోని ఓ చెక్‌పాయింట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
క్రికెట్ ఆటగాళ్లు క్షేమంగా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.