కాబూల్ : అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ అంతర్జాతీయ సంస్థకు చెందిన వాహనాల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడిలో నలుగురు ఆఫ్ఘన్‌లు మరణించగా, మరో నలుగురు అమెరికాసైనికులు గాయపడ్డారు. కాబూల్ నగరంలోని ఖాలా ఏ వజీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, గురువారం మిలటరీ ట్రైయినింగ్ అకాడమీ బయట ఐసిస్ తీవ్రవవాదులు జరిపిన బాంబు దాడిలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment