convoy attacked
-
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
జమ్మూ: జమ్మూకశీ్మర్‌లోని పూంఛ్ జిల్లాలో భారత వాయుసేన జవాన్ల వాహనశ్రేణిపై ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. బలగాలు సనాయ్‌టోప్‌లోని శిబిరానికి తిరిగొస్తుండగా సురాన్‌కోటె పరిధిలోని షాసితార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.15 గంటలకు ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఒక వాహనం విండ్్రస్కీన్పై డజనుకుపైగా బుల్లెట్ల దాడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఏకే రకం రైఫిళ్లతో దాడి చేసిన ఉగ్రవాదులు తర్వాత సమీప అడవిలోకి పారిపోయారు. గాయపడిన జవాన్లకు ఉధమ్‌పూర్‌లోని కమాండ్ ఆస్పత్రిలో చికిత్సచేస్తున్నారు. దాడి విషయం తెల్సి అప్రమత్తమైన సైన్యం, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రా్రïÙ్టయ రైఫిల్స్ బృందాలు అణువణువునా గాలిస్తున్నాయి. కాన్వాయ్ సురక్షితంగా ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని వాయుసేన ‘ఎక్స్’లో పోస్ట్చేసింది. గత ఏడాది డిసెంబర్ 21న ఇక్కడి దగ్గర్లోని బఫ్లియాజ్లో సైన్యంపై మెరుపుదాడి చేసి నలుగురిని పొట్టనబెట్టుకున్న ఉగ్రముఠాయే ఈ దాడికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఫూంచ్‌లో గత రెండేళ్లుగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. -
ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోంది : ఈటెల రాజేందర్
-
మునుగోడు లో రణరంగం
-
బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ నాయకులు దాడి
-
ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై గ్రామస్తుల దాడి
ఇబ్రహీంపట్నం/కోరుట్ల/జగిత్యాల: వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై ఎర్దండి గ్రామస్తులు దాడి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టునుంచి నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిని ఆ వరద చుట్టుముట్టింది. బాధితులను పరామర్శించి, గోదావరి వరదపై సమీక్షించేందుకు ఎంపీ అర్వింద్ శుక్రవారం ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ‘ఎంపీ అర్వింద్ డౌన్ డౌన్.. గో బ్యాక్’అని నినాదా లు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఓ గ్రామస్తుడు ఎంపీకి చెప్పుల దండ వేసేందుకు య త్నించాడు. పోలీసులు అడ్డుకుని అతడిని పక్క కు పంపించారు. తమ గ్రామంలో భూ సమస్యను పరిష్కరించకుండా ఎందుకు వచ్చారని గ్రామస్తులు ఆయనను నిలదీశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకుని పంపించారు. దీంతో ఎంపీ గోదావరి నది వద్దకు వెళ్లి వరద పరిస్థితి సమీక్షించి వెనుదిరిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మరోసారి ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కొందరు ఆగ్రహంతో ఎంపీ కారుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎంపీ కారు వెనుకాల అద్దం పగిలిపోయింది. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు బందోబస్తు మధ్య ఎంపీని అక్కడినుంచి పంపించివేశారు. కారుపై దాడి చేసిన ఓ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. గోదావరి వరద ముంపు కారణంగా 1996లో ఎర్దండి గ్రామంలోని 200 మందికి సమీపంలోని బర్ధీపూర్‌లో భూములు కేటాయించారు. అయితే గతంలోనే బర్ధీపూర్లోని మరికొందరికి కూడా ఆ భూములు కేటాయించారు. ఒకే సర్వేనంబర్‌లోని భూములు కావడంతో అది వివాదంగా మారింది. ఏడాది కిందట విజ్ఞప్తి చేసినా తమ సమస్య పరిష్కరించలేదని ఎర్దండి వాసులు ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంత్రి, ఎమ్మెల్యేల కుట్ర: అర్వింద్ తమ భూ దందాలు బయట పడతా యన్న భయంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తనపై దాడి చేయించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. శుక్రవారం కోరుట్లలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్మల్ ప్రాంతానికి చెందిన ఎస్సారెస్పీ ముంపు బా«ధితులకు ఎర్దండిలో రోడ్డు వెంట కేటాయించిన భూమిని ఆక్రమించాలన్న లక్ష్యంతో కుట్ర లు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ గూండాలను ఉసిగొలిపి తన కారు అద్దాలు ధ్వంసం చేయడం సిగ్గుచేటన్నారు. చదవండి: వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు అర్వింద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై జరిగిన దాడిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. దాడి జరిగిందనే సమాచారం తెలియగానే అమిత్ షా అర్వింద్‌కు ఫోన్‌చేసి ఘటనపై ఆరా తీశారు. పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందని, అమిత్ షాకు అర్వింద్ వివరించా రు. నియోజకవర్గం పరిధిలో తాను ఎక్కడ పర్యటించినా దాడులు చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచించిందని ఆయన అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లా రు. దాడి వెనుక కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు హస్తం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, ఆర్వింద్‌పై దాడి ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. -
మమతా బెనర్జీ మేనల్లుడి కాన్వాయ్‌పై దాడి
అగర్తల: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. అది కూడా వేరే రాష్ట్రంలో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. డైమండ్ హర్బర్ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సోమవారం త్రిపుర అగర్తలలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. బీజేపీ నేతలే కావాలని తనపై దాడి చేయించారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఈ మేరకు అభిషేక్ బెనర్జీ ట్విటర్లో ‘‘బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది. విప్లవ్ దేవ్ మీరు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.. మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అంటూ తన కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోని ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిలో అభిషేక్ బెనర్జీ ప్రయాణిస్తున్న రోడ్డు పక్కన.. కొందరు వ్యక్తులు నిలుచుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వీడియోలో చూడవచ్చు. వీరిలో కొందరి చేతిలో బీజేపీ జెండా ఉంది. కాన్వాయ్ అలా ముందుకు వెళ్తుండగా.. ఓ వ్యక్తి కర్రతో అభిషేక్ బెనర్జీ ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశాడు. వేరే రాష్ట్రంలో పర్యటిస్తున్న తమ ఎంపీ కాన్వాయ్‌పై దాడి చేయడాన్ని టీఎంసీ నాయకులు ఖండించారు. ఈ క్రమంలో టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండించడమేకాక ఈ విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అభిషేక్ బెనర్జీ త్రిపురలో పర్యటిస్తుండటంతో.. అగర్తలలో బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ పోస్టర్లను చించేశారని టీఎంసీ నాయకులు ఆరోపించారు. -
నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి
డైమండ్ హార్బర్: పశ్చిమ బెంగాల్లో రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్లో పట్టు పెంచుకోవడం కోసం నడ్డా రాష్ట్రానికి వచ్చారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి గురువారం ఉదయం డైమండ్ హార్బర్‌కి వెళుతుండగా మార్గం మధ్యలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న కొందరు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. ఈ దాడిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్గీయ, ముకుల్ రాయ్ మరికొందరు నేతలు గాయపడ్డారు. ఇక కైలాస్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ నడ్డాకి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తృణమూల్ పాలనలో బెంగాల్ లో అరాచకత్వం రాజ్య మేలుతోం దన్నారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరో వైపు ముఖ్యమంత్రి మమత ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకమని ఆరోపించారు. బీజేపీ శ్రేణులు తమపై తామే దాడులు చేసుకొని తృణమూల్ కాంగ్రెస్‌పై నేరాన్ని నెట్టేస్తున్నారని అన్నారు. సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లు చుట్టూ ఉండగా వారికెందుకు భయమని ప్రశ్నించారు. దుర్గమ్మ ఆశీస్సులున్నాయి: నడ్డా తన కాన్వాయ్‌పై జరిగిన దాడిని నడ్డా తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువ య్యాయని, గూండారాజ్ చేతుల్లోకి రాష్ట్రం వెళ్లి పోయిందని ధ్వజమెత్తారు. ఆ దుర్గమ్మ దయవల్లే తనకేమీ కాలేదని వ్యాఖ్యానించారు. ‘‘కాన్వాయ్‌పై జరిగిన దాడితో దిగ్భ్రాంతికి లోనయ్యాం. రాను రాను పశ్చిమ బెంగాల్లో అసహనం పెరిగిపోతోం ది. గూండాలు రాజ్యమేలుతున్నారు. భద్రత కల్పిం చడంలో అధికార యంత్రాంగం విఫలమైంది’’ అని కార్యకర్తల సమావేశంలో దుయ్యబట్టారు. గాయపడిన విజయ వర్గీయ, ఆయన కారు డ్రైవర్ దాడిలో పగిలిన కారు అద్దం -
‘నడ్డాను చంపాలని చూశారు’
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై జరిగిన దాడిని కేంద్ర మంత్రులు తీవ్రంగా ఖండించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నేతల ఆధ్వర్యంలోనే దాడి జరిగిందని కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్ ఆరోపించారు. టీఎంసీ నేతలు జేపీ నడ్డాను చంపాలని ప్రయత్నించారని, బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది కాబట్టే ఆయన బతికి బయట పడ్డారన్నారు.ఈ ఘటనపై దర్యాప్తు జరిపించి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. (చదవండి : బెంగాల్లో నడ్డా కాన్వాయ్‌పై దాడి) కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్ననడ్డా, కైలాష్ విజయవర్గియా గురువారం డైమండ్ హర్బర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సమయంలో టీఎంసీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని బీజేపీ వ్యతిరేక నినాదాలు చేయడమే కాక రోడ్డు బ్లాక్ చేయడానికి ప్రయత్నించారు. అంతటితో ఊరుకోక నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా : బండి సంజయ్ జేపీ నడ్డాపై దాడిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షు, కేంద్రంలో అధికారంలో పార్టీకి సారధి అయిన నడ్డా కాన్వాయిపై రాళ్లు రువ్వడం పశ్చిం బెంగాల్లో శాంతిభద్రతు ఎంత అధ్వాన్నంగా ఉన్నయో రుజువు చేస్తోందని విమర్శించారు. బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టు కలిసి బీజేపీ పైన ఇటువంటి దాడులు నిర్వహించి కార్యకర్తలను చిత్రహింసకు గురిచేయడం, హత్య చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు బీజేపీ కార్యకర్తలు బయపడరని పేర్కొన్నారు. -
నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి
కోల్‌కతా: రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురయ్యింది. టీఎంసీ కార్యకర్తలు నడ్డా కాన్వాయ్‌పై దాడి చేశారు.. రాళ్లు రువ్వారు. వివరాలు.. నడ్డా, కైలాష్ విజయవర్గియా గురువారం డైమండ్ హర్బర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో టీఎంసీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని బీజేపీ వ్యతిరేక నినాదాలు చేయడమే కాక రోడ్డు బ్లాక్ చేయడానికి ప్రయత్నించారు. అంతటితో ఊరుకోక నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగి.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. నడ్డా వాహనం అక్కడ నుంచి వెళ్లే వరకు పహారా కాశారు. ఇందుకు సంబంధించిన వీడియోని కైలాష్ విజయవర్గియా ట్వీట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలువుతోంది. నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్ అద్దాలు పగలడం.. నిరసనకారులు విసిరిన రాళ్లు వాహనం లోపల పడటం వంటివి వీడియోలో చూడవచ్చు. (చదవండి: ‘ఆమె పేరే అసహనానికి పర్యాయపదం’) ఈ ఘటనపై బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. ‘డైమండ్ హర్బర్‌కు వెళ్తుండగా.. టీఎంసీ కార్యకర్తలు నడ్డాజీ కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. టీఎంసీ నిజ స్వరూపం ఏంటో దీంతో బట్టబయలు అవుతోంది’ అన్నారు. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ నాయకులు ఖండించారు. బీజేపీ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. వారు బయటి వ్యక్తులను రాష్ట్రంలోకి అనుమతించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అని మండిపడ్డారు. -
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి : నలుగురు మృతి
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ అంతర్జాతీయ సంస్థకు చెందిన వాహనాల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడిలో నలుగురు ఆఫ్ఘన్లు మరణించగా, మరో నలుగురు అమెరికాసైనికులు గాయపడ్డారు. కాబూల్ నగరంలోని ఖాలా ఏ వజీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, గురువారం మిలటరీ ట్రైయినింగ్ అకాడమీ బయట ఐసిస్ తీవ్రవవాదులు జరిపిన బాంబు దాడిలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. -
పంజా విసిరిన మృత్యువు
మంచాల: కారు రూపంలో మృత్యువు పంజా విసిరింది. ఆకుకూరలు విక్రయించేందుకు మార్కెట్ కు వెళ్తుండగా ఐదుగురి ప్రాణాలు హరించింది. అమితవేగంతో దూసుకొచ్చిన కారు ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్ సహా నలుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న వారు మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి మహేందర్‌రెడ్డి కాన్వాయ్‌పై బాధిత కుటుంబీకులు, స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మార్కెట్‌కు వెళుతుండగా.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని చెన్నారెడ్డిగూడకు చెందిన చీమల సుజాత(44), చీమల మమత(35), ఆంబోత్ మారు(50), ఆంబోత్ హంస్లీ(56)తోపాటు కాట్రోత్ అచ్చాలి, కాట్రోత్ కమిలి, కాట్రోత్ కైలాబ్, సంకటి లక్ష్మమ్మ, ఆంబోత్ సోన, చీమల పద్మజ, ఆంబోత్ రజిత గ్రామంలోనే ఆకుకూరలు సాగు చేస్తున్నారు. వీరంతా సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు అదే గ్రామానికి చెందిన వంగలి శ్రీనివాస్(20) ఆటో(టీఎస్ 05యూవో 2614)లో ఆకుకూరల మూటలు పెట్టుకుని ఇబ్రహీంపట్నం మార్కెట్లో విక్రయించేందుకు బయలుదేరారు. లింగంపల్లి గేట్ సమీపంలోకి చేరుకున్న వీరి ఆటోను ఎదురుగా అతివేగంతో దూసుకొచ్చిన కారు(ఏపీ 9ఏక్యూ 5395) ఢీకొట్టింది. ప్రమాదంలో చీమల సుజాత, చీమల మమత, ఆంబోత్ మారు, ఆంబోత్ హస్లీ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్‌తోపాటు మిగతా వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని అమ్మ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే శ్రీనివాస్ కన్నుమూశాడు. లక్ష్మమ్మ కోమాలోకి వెళ్లగా.. మిగతా వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదానికి కారణమైన కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారు స్వల్పంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం నగరంలోని కామినేని ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. బంధువులు, స్థానికుల ఆందోళన మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రే షియా ప్రకటించాలని, జిల్లా మంత్రి ఘటనా స్థలానికి రావాలని డిమాండ్ చేస్తూ బంధువులు, స్థానికు లు రోడ్డుపై బైఠాయించారు. వారికి సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు పలికారు. ఘటనాస్థలికి చేరుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల ఆర్థిక సాయంతోపాటు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని, ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా హామీ ఇవ్వాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. మంత్రి సర్దిచెప్పినా ఫలితం లేకపోవడంతో ఆయన తిరుగు పయనమయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. రాళ్లు రువ్విన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలకు ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పది నిమిషాల్లో మార్కెట్‌కు వెళతామనగా.. వీఎంఆర్ కన్వెన్షన్ నుంచి కారులో మంచాల రావడానికి అరగంట పడుతుంది. ఘటనాస్థలం నుంచి మంచాల 3 కిలోమీటర్లు.. ఇబ్రహీంపట్నం మార్కెట్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో పది నిమిషాల్లో ఆటోలో మార్కెట్‌కు చేరుకునేవారు. అంతలోనే వారిని మృత్యువు కబళించింది. కాగా, ఆపద్బంధు పథకం కింద ఆర్డీవో మధుకర్‌రెడ్డి, తహసీల్దార్ సుచరిత మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కారులో మద్యం సీసాలు.. ప్రమాదానికి కారణమైన కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మంచాల గ్రామానికి చెందిన కొందరు హైదరాబాద్ సమీపంలోని వీఎంఆర్ కన్వెన్షన్‌లో ఆదివారం రాత్రి ఓ వివాహ విందులో పాల్గొన్నారు. తిరిగి తెల్లవారుజామున 4 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారేవరకు వేడుకల్లో పాల్గొనడం.. నిద్రలేకపోవడం, మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో లాఠీచార్జి చేస్తున్న పోలీసులు -
మంత్రి కాన్వాయ్‌పై బాధిత కుటుంబాల దాడి
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని మంచాల మండలం లింగంపల్లి వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో యువకులు కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆగ్రహాం వ్యక్తం చేసిన బాధితుల బంధువులు మృతదేహాలతో మంచాల రహదారిపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. భాదిత కుటుంబాలను పరామర్శించేందుకు ఘటనాస్థలానికి వచ్చిన మంత్రి మహేందర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌పై ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. మృతులు కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రి బాధిత కుటుంబాలతో చర్చలు జరుపుతున్నారు. ఇది చిత్రీకరిస్తున్న మీడియాపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. కాగా, చెన్నారెడ్డిగూడెంకు చెందిన పదిమంది మహిళలు ప్రతిరోజు కూరగాయలను ఆటోలో వేసుకొని హైదరాబాద్ నగరానికి తీసుకువస్తారు. రోజు వారి మాదిరిగానే సోమవారం కూడా దాదాపు పది మంది మహిళలు అదే గ్రామానికి చెందిన శీను ఆటోలో కూరగాయలు వేసుకొని నగరానికి బయలుదేరారు. మంచాల మండలం లింగంపల్లి వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు ముందు భాగంలో కూర్చున్న మహిళలు అక్కడిక్కడే తుది శ్వాస విడిచారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ఆటో డ్రైవర్ శీను, సుజాత, మాధవి, మారు, అఫిలీగా గుర్తించారు. -
రాహుల్ కారుపై రాళ్ల దాడి
-
రాహుల్ కారుపై రాళ్ల దాడి
► పగిలిన కారు అద్దాలు.. రాహుల్ క్షేమం ► గుజరాత్ వరద ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ఘటన ► ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా నినాదాలు ► దాడి బీజేపీ కార్యకర్తల పనేనని కాంగ్రెస్ విమర్శ ధనేరా/న్యూఢిల్లీ: గుజరాత్లో వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వాహనంపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో రాహుల్ కారు అద్దాలు పగిలిపోయాయి. ప్రత్యేక భద్రత దళం(ఎస్పీజీ) వెంటనే అప్రమత్తమవటంతో ఆయన ఎలాంటి గాయాల్లేకుండానే క్షేమంగా బయటపడ్డారు. పిరికిపందల చర్యలకు తాను భయపడనని రాహుల్ అన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఘటనలపై మండిపడింది. బీజేపీ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని విమర్శించింది. కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ అవకాశవాద రాజకీయాలకు విసిగి ప్రజలే దాyì చేశారని పేర్కొంది. అసలేం జరిగింది?.. తాజా వరదలకు అతలాకుతలమైన రాజస్తాన్, ఉత్తర గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో సహాయక చర్యలను రాహుల్ గాంధీ పరిశీలించారు. రాజస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం గుజరాత్‌లోని బనాస్కాంత జిల్లాలో రాహుల్ పర్యటించారు. ఈ జిల్లాలోని పలు గ్రామాల్లో బాధితులతో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత రైతులతో మాట్లాడేందుకు ధనేరాలోని మార్కెటింగ్ యార్డుకు రాహుల్ చేరుకున్నారు. లాల్‌చౌక్ ప్రాంతంలో స్థానికులను, రైతులనుద్దేశించి ఆయన మాట్లాడేందుకు సిద్ధమవగానే స్థానికులు నల్లజెండాలతో నిరసన తెలపటంతోపాటు మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి ప్రజలను చెదరగొట్టారు. ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన రాహుల్ అక్కడినుంచి వెళ్లిపోతున్న సమయంలో ప్రజలు వాటర్ ప్యాకెట్లను కాన్వాయ్‌పైకి విసిరారు. కాన్వాయ్ ధనేరా హెలిప్యాడ్ సమీపంలోకి రాగానే.. కొందరు నిరసనకారులు రాహుల్ వాహనంపైకి రాళ్లురువ్వారు. దీంతో రాహుల్ ప్రయాణిస్తున్న కారు ఒకవైపు అద్దాలు పగిలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన ఎస్పీజీ దళం రాహుల్‌ను వాహనం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎస్పీజీ దళ సభ్యుడికి స్వల్ప గాయాలయ్యాయి. రాయి విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధనేరా ఎమ్మెల్యే జోయ్తాభాయ్ పటేల్ (కాంగ్రెస్) ప్రస్తుతం బెంగళూరు ఈగల్టన్ రిసార్టులోని క్యాంపులో ఉన్నారు. కాగా, తనపై దాడి చేస్తే భయపడేది లేదని రాహుల్ స్పష్టం చేశారు. ‘ఇలాంటి పిరికిపంద చర్యలకు, మోదీ మోదీ అంటూ చేసే నినాదాలకు నేను భయపడను. మీ బాధలను విని, అర్థం చేసుకునేందుకు వచ్చాను. వీలైనంత సాయం చేద్దామనుకున్నాను. సత్యాన్ని చూడాలనుకోని, అర్థం చేసుకోలేని వారే భయపడతారు. నేను కాదు’ అని దాడి అనంతరం రాహుల్ ట్వీట్ చేశారు. ఘటన జరిగిన సమయంలో కాంగ్రెస్ నేత, రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తదితరులున్నారు. బీజేపీ గూండాలపనే: కాంగ్రెస్ రాహుల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తే బీజేపీ గూండాలు సిమెంటు ఇటుకలతో దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలని బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావు లేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. రాహుల్‌వి ‘ఫొటో’ రాజకీయాలు: బీజేపీ గుజరాత్, రాజస్తాన్‌లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన ఫొటో రాజకీయం చేసేందుకేనని బీజేపీ విమర్శించింది. ‘ప్రజలను గూండాలు, రౌడీలని అనొద్దు. వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు రిసార్టులో ఎంజాయ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ఆయన పార్టీ చేస్తున్న రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు. అందుకే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలను గౌరవించాలి’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు. -
శివపాల్ కాన్వాయ్‌పై దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాబాయ్, ఎస్పీ సీనియర్ నేత శివపాల్ యాదవ్ కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. ఆదివారం ఎతావా జిల్లా జస్వంత్ నగర్లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ఓటేసిన ప్రముఖులు: ఈ రోజు జరుగుతున్న యూపీ మూడో దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన భార్య, ఎంపీ డింపుల్ యాదవ్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి మాయావతి, బీజేపీ సీనియర్ నేత రీటా బహుగుణ జోషి తదితరులు ఓటు వేశారు. ఈ రోజు యూపీలో 12 జిల్లాల్లో 69 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 826 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.41 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై దాడి
సరుపతార్(అస్సాం): నాగాలాండ్-అస్సాం సరిహద్దులలో అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ వాహనశ్రేణి(కాన్వాయ్)పై నిరసనకారులు దాడి చేశారు. తరుణ్ గొగోయ్ ఈరోజు నాగాలాండ్ సరిహద్దులలోని గోల్ఘాట్ జిల్లాలోని యురియంఘాట్ సందర్శనకు వెళ్లారు. సీఎం వాహనశ్రేణిపై నిరసనకారులు దాడి చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అల్లరిమూకలు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారని, రెండు వాహనాలు దెబ్బతిన్నాయని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఏపి రూట్ చెప్పారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాలిలోకి కాల్పులు జరిపారు.