సరుపతార్(అస్సాం): నాగాలాండ్-అస్సాం సరిహద్దులలో అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ వాహనశ్రేణి(కాన్వాయ్)పై నిరసనకారులు దాడి చేశారు. తరుణ్ గొగోయ్ ఈరోజు నాగాలాండ్ సరిహద్దులలోని గోల్ఘాట్ జిల్లాలోని యురియంఘాట్ సందర్శనకు వెళ్లారు. సీఎం వాహనశ్రేణిపై నిరసనకారులు దాడి చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అల్లరిమూకలు కాన్వాయ్పై రాళ్లు రువ్వారని, రెండు వాహనాలు దెబ్బతిన్నాయని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఏపి రూట్ చెప్పారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాలిలోకి కాల్పులు జరిపారు.
ముఖ్యమంత్రి కాన్వాయ్పై దాడి
Published Mon, Aug 18 2014 4:34 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement
Advertisement