శివపాల్ కాన్వాయ్‌పై దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాబాయ్, ఎస్పీ సీనియర్ నేత శివపాల్ యాదవ్ కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. ఆదివారం ఎతావా జిల్లా జస్వంత్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.
ఓటేసిన ప్రముఖులు: ఈ రోజు జరుగుతున్న యూపీ మూడో దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన భార్య, ఎంపీ డింపుల్ యాదవ్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి మాయావతి, బీజేపీ సీనియర్ నేత రీటా బహుగుణ జోషి తదితరులు ఓటు వేశారు.
ఈ రోజు యూపీలో 12 జిల్లాల్లో 69 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 826 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.41 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.