ఐక్యరాజ్య సమితి: అఫ్గానిస్తాన్‌లో సైన్యం, తాలిబన్ల ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్త చేసింది. అఫ్గానిస్థాన్‌లో 24 గంటల్లో 40 మంది పౌరులు మృతి ఐరాస తెలిపింది. ఘర్షణల్లో మరో వందమందికి పైగా పౌరులకు గాయాలైనట్లు ఐరాస పేర్కొంది.
ఏం జరిగింది..!
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు 2001 డిసెంబర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రవేశించాయి. బగ్రామ్ ఎయిర్ బేస్‌ను 10 వేలమంది సైనికులతో తమ స్థావరంగా మార్చుకున్నాయి. అయితే ఇరవై ఏళ్ల పాటు సాగిన యుద్ధం తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంది. అమెరికా, దాని మిత్ర దేశాలకు బగ్రామ్ వైమానిక స్థావరం కీలకమైన ప్రాంతంగా ఉండేది. విదేశీ సేనలు ఇప్పుడు ఆ స్థావరాన్ని ఖాళీ చేశాయి.
ఏం జరుగుతోంది..!
విదేశీ సైన్యాలు వెళ్లిపోవడంతో తాలిబన్‌లు మళ్లీ విస్తరించే పనిని ప్రారంభించారు. అఫ్గానిస్తాన్‌లోని అనేక ప్రాంతాలను తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్‌ల అరాచకాలు పెరగడంతో ప్రజలంతా ప్రాణాలు అరచేత పట్టుకొని భయం భయంగా బతుకుతున్నారు. తాజాగా కాందహార్‌లో తాలిబన్లు మరోసారి పేట్రేగిపోయారు. కాందహార్ విమానాశ్రయంపై తాలిబన్లు రాకెట్లతో విరుచుకుపడ్డారు. మూడు రాకెట్లతో దాడి చేయగా.. ఎయిర్ పోర్టు రన్ వేను తాకి తీవ్రంగా దెబ్బ తిన్నది. దీంతో కాందహార్ ఎయిర్‌పోర్టుకు విమాన రాకపోకలను నిలిపివేసి రన్ వే మరమ్మతులు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment