15 మంది చిన్నారులను బలిగొన్న రిక్షా బాంబు | Atleast 15 Children Killed In East Afghanistan Bomb Blast | Sakshi
Sakshi News home page

15 మంది చిన్నారులను బలిగొన్న రిక్షా బాంబు

Published Sat, Dec 19 2020 8:22 AM | Last Updated on Sat, Dec 19 2020 8:23 AM

Atleast 15 Children Killed In East Afghanistan Bomb Blast - Sakshi

కాబూల్ ‌: అఫ్గానిస్తాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం అభంశుభం తెలియని చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. రిక్షాకు అమర్చిన బాంబు పేలడంతో 15 మంది బాలలు మృత్యుఒడికి చేరగా మరో 20 మంది క్షతగాత్రులయ్యారు. తాలిబన్‌ అదీనంలో ఉన్న ఘజ్ని ప్రావిన్స్‌ గిలాన్‌ జిల్లాలోని ఓ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. చిరు వ్యాపారి ఒకరు రిక్షాలో రకరకాల వస్తువులను తీసుకుని ఓ గ్రామానికి వెళ్లగా పిల్లలంతా అతడి చుట్టూ మూగారు. ఇంతలోనే, రిక్షాకు అమర్చిన బాంబు పేలి 15 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. మరో 20 మంది వరకు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ దాడికి బాధ్యులుగా ఎవరూ ప్రకటించుకోలేదు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement