talibans attack
-
వైరల్ వీడియో : బుర్ఖా ధరించని విద్యార్థులపై తాలిబన్ అధికారుల దాడి
-
Afghan Girl: అప్పుడూ ఇప్పుడూ.. ఆమే! పాపం మరోసారి..
Nat Geo Green-Eyed Girl, "Most Famous Afghanistan Refugee": పాలనా సంక్షోభం ఏర్పడితే దేశ పౌరుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంది. ఇటువంటి నిస్సహాయ పరిస్థితులను 30 ఏళ్ల క్రితం ఎదుర్కొని శరణార్థిగా మారింది అఫ్గానిస్తాన్‌కు చెందిన షర్బత్ గుల్. గత నలభై ఏళ్లలో తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్న అఫ్గానిస్తాన్ మరోసారి తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లడంతో..49 ఏళ్ల వయసులో షర్బత్ మరోసారి శరణార్థిగా మారింది. అది అఫ్గానిస్తాన్‌ను జాహీర్ షా అనే రాజు పరిపాలించే రోజులు. నలభై ఏళ్లపాటు ఒకే రాజు పరిపాలించడంతో.. విసిగిపోయిన ప్రజలు, అధికారులు.. జాహీర్ షా కుటుంబానికి చెందిన మొహమ్మద్ దావుద్ ఖాన్‌కు పట్టంగట్టారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సరికొత్త సంస్కరణలు దావూద్ అమలు చేసేవాడు. అవి నచ్చని ప్రతిపక్షం రకరకాల కుట్రలతో ప్రభుత్వాన్ని పడగొట్టి, అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ పార్టీ పాలనలో కొన్ని నిర్ణయాలు సొంత సభ్యులకే నచ్చకపోవడంతో.. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి అధికారం కోసం కుమ్ములాటలు, కుతంత్రాలతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఈ నేపథ్యంలో తలెత్తిన రాజకీయ అనిశ్చతిలో ఎంతో మంది అఫ్గాన్లు, సోవియట్ సైనికులు మరణించగా, లక్షలాదిమంది దేశం విడిచి వేరే దేశాలకు వలస వెళ్లిపోయారు. అలా వెళ్లినవారిలో షర్బత్ కూడా ఒకరు. 80వ దశకంలో పాపులర్ ఫోటో.. దేశంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు షర్బత్ కుటుంబం పాకిస్థాన్‌కు వలస వెళ్లింది. అప్పుడు షర్బత్ వయసు పన్నెండేళ్లు. అఫ్గాన్––పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఓ శరణార్థి శిబిరంలో షర్బత్‌ను స్టీవ్ మెకెర్రీ అనే అమెరికన్ ఫోటోగ్రాఫర్ 1984లో చూశాడు. ఆకుపచ్చని రంగులో మెరుస్తున్న ఆమె కళ్లు మెకెర్రీని ఆకర్షించడంతో వెంటనే ఆమె ఫోటో తీశాడు. అప్పటి భీకర యుద్ధవాతావరణ పరిస్థితులన్నీ షర్బత్ పచ్చని కళ్లలో ప్రతిబింబించాయి. దీంతో ఆ ఫోటోను నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజీన్ కవర్ పేజీపైన 1985లో ప్రచురించారు. ‘‘అఫ్ఘన్ గర్ల్’’గా షర్బత్ ప్రపంచమంతా పాపులర్ అయ్యింది. 1980 – 1990 దశకంలో బాగా పాపులర్ అయిన ఫోటోలలో అఫ్గాన్ గర్ల్ ఒకటిగా నిలిచింది. తనకు పాపులారిటి వచ్చిందని షర్బత్‌కు ఏమాత్రం తెలీదు.పెళ్లి తరువాతే తను ఎంత పాపులర్ అయ్యిందో తెలుసుకుని ఆ ఫోటోను తీసుకుంది. 2002 వరకు షర్బత్ ఎక్కడ ఉందన్న విషయం ఎవరికీ తెలీదు. మెకెర్రీ మళ్లీ షర్బత్ ఆచూకీ తెలుసుకుని..ఎఫ్‌బీఐ అనలిస్టు, ఫోరెన్సిక్ విభాగానికి ఇవ్వడంతో.. వారు షర్బత్‌గా నిర్ధారించారు. పాకిస్థాన్‌లో తలదాచుకుంటోన్న సమయంలోనే 16 ఏళ్ల వయసులో రహ్మత్ గుల్‌ను పెళ్లిచేసుకుంది. షర్బత్ దంపతులకు నలుగురు పిల్లలు. పాకిస్థాన్‌లో కుటుంబంతో జీవనం సాగిస్తోన్న షర్బత్‌కు ముఫ్పై ఏళ్ల తరువాత అక్కడ కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అది 2016 షర్బత్‌కు నలభై ఏళ్లు. “తమ దేశంలో నకిలీ గుర్తింపు పత్రాలతో అక్రమంగా నివసిస్తోందన్న ఆరోపణతో షర్బత్‌కు పాక్ ప్రభుత్వం.. పదిహేను రోజుల జైలుశిక్ష, లక్షాపదివేల రూపాయల రుసుమును కట్టించి స్వదేశానికి పంపించేసింది. ఆ సమయంలో అఫ్ఘన్ అధ్యక్షుడిగా ఉన్న అష్రఫ్ ఘనీ... షర్బత్ పరిస్థితి తెలుసుకుని, కాబూల్‌లో ఓ అపార్ట్మెంట్లో ఉండేందుకు వసతి కల్పించారు. అప్పటి నుంచి అక్కడే కుటుంబంతో నివసిస్తోంది షర్బత్. హెపటైటీస్ సీతో 2012లో షర్బత్ భర్త మరణించడం, ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్ అధికారం చేపట్టడంతో ఆమె కథ మళ్లీ మొదటికి వచ్చింది. తాలిబన్ల పాలనలో జీవించలేక, ముందుముందు జీవితం మరింత దారుణంగా మారుతుందని భావించి ఆశ్రయం ఇవ్వాలని ఇటలీ ప్రభుతాన్ని కోరింది. షర్బత్ పరిస్థితి అర్థం చేసుకున్న ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రాఘి షర్బత్‌కు ఆశ్రయం కల్పించారు. అప్పుడూ ఇప్పుడూ ఆఫ్ఘన్ అమ్మాయిలకు భద్రత లేదని, తాజాగా షర్బత్ ఎదుర్కొంటున్న పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. చదవండి: Mother Shipton Cave Facts: భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..! -
తాలిబన్ల అరాచకం.. అఫ్గన్ మాజీ ఉపాధ్యక్షుడి సోదరుడి హత్య
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. విధ్వంసకాండను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తాలిబన్లు తాము అఫ్గనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడైన అమ్రుల్లా సాలెహ్ తమ్ముడు రోహుల్లా సాలెహ్ని హత్య చేసినట్లు ప్రకటించుకున్నారు. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాలిబన్లు పంజ్‌షీర్‌లో రోహుల్లా సాలెహ్‌ను హింసించి చంపినట్లు సమాచారం. ఈ దాడిలో తాలిబన్లు కూడా పెద్ద సంఖ్యలో మరణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. రోహుల్లా సాలెహ్ మృతి అనంతరం తాలిబన్లు అతడి లైబ్రరీని ఆక్రమించారని సమాచారం. గ్రంథాలయంలోకి ప్రవేశించిన చిత్రాలను తాలిబన్లు విడుదల చేశారు. (చదవండి: కొత్త కోణం: అఫ్గాన్ సింహాలు తలవంచేనా!) మూడు రోజుల క్రితం తాలిబన్లు తాము అఫ్గనిస్తాన్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ పంజ్‌షీర్ నాయకులు తాలిబన్ల ప్రభుత్వాన్ని ఆమోదించలేదు. ఈ క్రమంలో పంజ్‌షీర్ ప్రాంత నాయకులు, మాజీ అఫ్గన్ పాలకులు ఉగ్రవాద అఫ్గన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి తొందరపడవద్దని తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌తో సహా అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. తాలిబన్లు ఏర్పాటు చేసిన కేబినెట్లో హిట్‌లిస్ట్‌లో ఉన్న ఉగ్రవాదులు ఉన్నారని తెలిపారు. (చదవండి: తిరిగి రండి.. మీకు పూర్తి రక్షణ కల్పిస్తాం: అఫ్గన్ ప్రధాని) తాలిబన్ల ఆక్రమణ ప్రాంరంభం అయిన నాటి నుంచి పంజ్‌షీర్ లోయలో అహ్మద్ మసూద్ నేతృత్వంలోని నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ దళాలకు, తాలిబన్లకు మధ్య మొదలైన భీకరపోరు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. చదవండి: పాక్ కనుసన్నల్లో... -
పంజ్‌షీర్‌పై పట్టు సాధించాం!
కాబూల్: దశాబ్దాలుగా తమకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్ ప్రావిన్సును ఎట్టకేలకు హస్తగతం చేసుకున్నామని తాలిబన్లు సోమవారం ప్రకటించారు. ఇప్పటివరకు తాలిబన్ల పాలనకు లొంగకుండా ఉన్నవారికి పంజ్‌షీర్ కేంద్రస్థానంగా నిలిచింది. కానీ తాజాగా పంజ్‌షీర్‌లోని 8 జిల్లాల్లో తాలిబన్లు వేలాదిగా ప్రవేశించి మొత్తం ప్రావిన్సును ఆక్రమించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ఫైటర్ల చేతికి పంజ్‌షీర్ చిక్కిందని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ప్రతిఘటన బృందాలను జయించామని, మిగిలినవారు పారిపోయారని చెప్పారు. అణచివేతకు గురైన పంజ్‌షీర్ ప్రజలకు విముక్తి లభించిందన్నారు. పంజ్‌షీర్ ప్రజలకు సంపూర్ణ రక్షణ ఇస్తామని, వారిపై ఎలాంటి వివక్ష చూపమని జబీహుల్లా చెప్పారు. కానీ తాలిబన్ల రాకతో భయపడిన వేలాదిమంది పర్వతాల్లోకి పారిపోయారు. తాలిబన్ బృందాలు గవర్నర్ ఆఫీసు వద్ద జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. మరోవైపు తాలిబన్ల ప్రకటనను పంజ్‌షీర్ పోరాట నేతలు తోసిపుచ్చారు. అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లాసలేహ్, పంజ్‌షీర్ నేత అహ్మద్ మసూద్ నేతృత్వంలో ఇంతవరకు పంజ్‌షీర్‌లో దళాలు తాలిబన్లను ప్రతిఘటిస్తూ వచ్చాయి. తాలిబన్లు మారణ హోమాన్ని నిలిపివేస్తే చర్చలకు తాము సిద్ధమని ఇటీవలే అహ్మద్ ప్రకటించారు. కానీ తాలిబన్లు పోరాటానికే నిశ్చయించుకొని పంజ్‌షీర్ లోయపై దాడి చేశారు. ఫహీమ్‌ని చంపేశారు పంజ్‌షీర్ పోరాట దళాల ప్రతినిధిగా బయటప్రపంచానికి ఎప్పటికప్పుడు విశేషాలు తెలియజేస్తూ వచి్చన ఫహీమ్ దష్తి గొంతు మూగబోయింది. ఈ మేరకు అఫ్గాన్ రెసిస్టెంట్ ఫ్రంట్ ఫేస్బుక్ పేజీలో ప్రకటించింది. ఫాసిస్టు గ్రూపుతో పోరాటంలో ఫహీమ్ అమరుడయ్యాడని నివాళి అరి్పంచింది. పాకిస్తాన్ జరిపిన దాడిలో ఫహీమ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించారని పంజ్ïÙర్ నేత మసూద్ ఒక ప్రకటనలో చెప్పారు. చర్చలకు సిద్ధమన్నా వినకుండా తాలిబన్లు తమపై పోరుకు వస్తున్నారని మసూద్ సోమవారం విమర్శించారు. అమ్రుల్లా సలేహ్, మసూద్ ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. సలేహ్ నివసించే ఇంటిపై ఆదివారం హెలికాప్టర్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ దాడి నుంచి సలేహ్ సురక్షితంగా తప్పించుకొని గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లిపోయారు. తాలిబన్లకు వ్యతిరేకంగా పంజ్‌షీర్ చాలా రోజులు పోరాటం చేస్తుందని నిపుణులు భావించారు. కానీ అంతర్జాతీయంగా ఎలాంటి సాయం అందకపోవడంతో చివరకు ఈ ప్రాంతం కూడా తాలిబన్లకు తలవంచాల్సి వచి్చంది. పాక్ అండతోనే: మసూద్ పంజ్‌షీర్‌పై తాలిబన్లు పట్టుసాధించడంలో పాకిస్తాన్ సాయం చేసిందని పంజ్ïÙర్ నేత అహ్మద్ మసూద్ నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ఆడియో మెసేజ్ విడుదల చేశారు. పాక్– తాలిబన్ బంధం గురించి ప్రతి దేశానికి తెలుసని, కానీ ఎవరూ నోరువిప్పడం లేదని వాపోయారు. కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి వారికి పాక్ సాయం చేస్తోందని దుయ్యబట్టారు. పాక్ సాయంతోనే తాలిబన్లు పంజ్‌షీర్‌పై దాడికి దిగారన్నారు. తాలిబన్లు మారలేదని, మరింత క్రూరంగా తయారయ్యారని విమర్శించారు. పంజ్ïÙర్ను ఆక్రమించుకున్నామన్న తాలిబన్ ప్రకటనను ఆయన సోమవారం కొట్టిపారేశారు. చివరి రక్తపు బొట్టు వరకు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. పాక్‌కు చెందిన ఒక జెట్‌ను తమ యోధులు కూలి్చవేశారని ఆయన ఒక ట్వీట్లో తెలిపారు. పాక్ పంపిన డ్రోన్లను పంజ్‌షేర్ దళాలపై దాడి చేయడానికి తాలిబన్లు వినియోగించారని, కమాండోలను పాక్ ఎయిర్‌డ్రాప్ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాక్ సహా ఇతర దేశాల జోక్యాన్ని సహించం ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్‌తో సహా ఏ దేశాన్నీ అనుమతించబోమని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పష్టంచేశారు. సోమవారం జబీహుల్లా ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధినేత లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్.. తాలిబన్ అగ్రనేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌తో కాబూల్‌లో సమావేశమయ్యారనే విషయాన్ని ఈ సందర్భంగా జబీహుల్లా ధ్రువీకరించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సాగే ఎలాంటి కార్యకలాపాలకైనా అఫ్గాన్ భూభాగాన్ని వాడుకోనివ్వబోమంటూ బరాదర్ ఈ భేటీ సందర్భంగా హామీద్‌కు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పాత్రపై మీడియా ప్రశ్నించగా.. అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్‌తో సహా ఏ ఇతర దేశమూ జోక్యం చేసుకోవడానికి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ దేశ వ్యవహారాల్లో ఇతరులు వేలు పెట్టొద్దని సూచించారు. తాలిబన్ ‘తెర’గతులు అఫ్గాన్‌లో యూనివర్సిటీ తరగతులు ప్రారంభమయ్యాయి. పలు ప్రైవేట్ కాలేజీలు తెరుచుకున్నాయి. అన్నిట్లో స్త్రీ, పురుష విద్యార్ధులను వేరు చేస్తూ అడ్డంగా కర్టెన్లు, తెరలను ఏర్పాటయ్యాయి. షరియా చట్టం ప్రకారం మహిళలకు చదువుకునే హక్కు ఉందని, అయితే మగ పిల్లలతో పాటు కలిసి చదివే వీల్లేదని తాలిబన్లు స్పష్టం చేశారు. దీంతో కాలేజీలన్నింటిలో తరగతి గదుల మధ్యలో తెరలు ప్రత్యక్షమయ్యాయి. అలాగే మహిళా విద్యార్థులకు కేవలం మహిళలు లేదా వృద్ధులైన మగవారు మాత్రమే బోధన చేయాలని తాలిబన్లు హుకుం జారీ చేశారు. అలాగే మహిళా విద్యార్ధులు తప్పనిసరిగా అబయా, నికాబ్(శరీరాన్ని పూర్తిగా కవర్ చేసే బురఖా) ధరించాలని, ఆడపిల్లలను క్లాసు అయిపోవడానికి ఐదు నిమిషాల ముందే బయటకు పంపాలని, అప్పుడే మగవిద్యార్ధులతో వారు కలవకుండా ఉంటారని తాలిబన్లు ఆర్డరేశారు. తరగతి గదుల్లో తెరలు వేలాడదీసిన ఫొటోలను అమాజ్ న్యూస్ ట్విట్టర్లో పోస్టు చేసింది. కాలేజీలో విద్యార్థినీ విద్యార్థుల సీట్ల మధ్య తెర ఏర్పాటుచేసిన దృశ్యం -
అనుకున్న సమయానికే ఉపసంహరణ
వాషింగ్టన్: ముందుగా అనుకున్నట్లే ఆగస్టు 31 నాటికి అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి చేస్తామని అమెరికా మరోమారు ప్రకటించింది. ఐసిస్–కే కారణంగా తరలింపు ప్రక్రియ ప్రమాదకరంగా మారినా, అనుకున్న సమయానికే పూర్తి చేయాలని యూఎస్ నిర్ణయించింది. ప్రస్తుతం పరిస్థితి బాగాలేదని, తమ దళాలు ప్రమాదంలో ఉన్నాయని, అయితే బలగాలు అఫ్గాన్‌లో ఉన్నంత కాలం ప్రమాదంలో ఉన్నట్లేనని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. తరలింపులో ఇది అత్యంత ప్రమాదకరమైన భాగమన్నాయి. కాబూల్ విమానాశ్రయంపై ఐసిస్–కే ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే! ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. బాంబు పేలుళ్ల నేపథ్యంలో తరలింపు వాయిదా వేయాలన్న ప్రతిపాదనేదీ రాలేదని, డెడ్‌లైన్ కల్లా ప్రక్రియ పూర్తి చేస్తామని మిలటరీ అధ్యక్షుడికి స్పష్టం చేసిందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్‌సాకీ చెప్పారు. తరలింపు ప్రక్రియ ప్రస్తుతం తిరోగామి దిశలో (రెట్రోగ్రేడ్) ఉందన్నారు. అంటే రోజులు గడిచే కొద్దీ అఫ్గాన్‌లో ఉండే బలగాలు తగ్గుతూ వస్తుంటాయని, ఉన్న వారితోనే సురక్షితంగా అఫ్గాన్‌నుంచి బయటపడే ప్రక్రియ పూర్తి చేయాలని వివరించారు. తాలిబన్లను నమ్మలేం తాలిబన్లపై తమకు నమ్మకం లేదని, కానీ ప్రస్తుతం వారితో పనిచేయడం మినహా వేరే మార్గం లేదని సాకీ అభిప్రాయపడ్డారు. అఫ్గాన్‌లో చాలా భూ భాగం తాలిబన్ల అధీనంలో ఉందని, విమానాశ్ర యం కూడా వారి స్వాధీనంలోనే ఉందని, అందువల్ల వారి సహకారంతో తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 14 నుంచి ఇప్పటివరకు సుమారు 1,09,200 మందిని అఫ్గాన్ విమానాశ్రయం నుంచి తరలించామని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం 12 గంటల వ్యవధిలో 4,200 మందిని 12 యుద్ధ విమానాల్లో దేశం దాటించామని తెలిపాయి. జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం 1,14,800 మందిని అఫ్గాన్ సరిహద్దులు దాటించామని వెల్లడించాయి. అమెరికా దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత కూడా వీసాలున్న అర్హులైన అఫ్గాన్ పౌరులను దేశం దాటించే వరకు రక్షించేందుకు అంతర్జాతీయ సహకారం తీసుకోవాలని అధ్యక్షుడు బైడెన్ ఆదేశించినట్లు సాకీ తెలిపారు. పౌరుల తరలింపు పూర్తి శనివారానికి అఫ్గాన్‌లోని తమ పౌరులను తరలించే ప్రక్రియ పూర్తి అవుతుందని బ్రిటన్ ప్రకటించింది. దీంతో కేవలం కొన్ని మిలటరీ దళాలు మాత్రమే అఫ్గాన్‌లో ఉంటాయని, అవి కూడా ఆగస్టు 31కి స్వదేశానికి చేరతాయని బ్రిటన్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ నిక్‌కార్టర్ చెప్పారు. ఎంత ప్రయత్నించినా అందరినీ దేశం దాటించడం కుదరదని, నిజానికి ఇలాంటి ముగింపును తాము ఊహించలేదని తెలిపారు. ఆగస్టు 13 నుంచి దాదాపు 14,543 మందిని బ్రిటన్ కాబూల్ నుంచి తరలించింది. ఇంకా 100–150 మంది బ్రిటిష్ పౌరులు అఫ్గాన్‌లోనే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
అబ్బాయిల వేషం కట్టి... తప్పించుకుంది
తాలిబన్లు చెప్పే మాటలు న మ్మకండి. వాళ్లు చేసే ప్రమాణాలు ఎప్పుడైనా మారిపోవచ్చు. మీరు మీ కుంటుంబాలతోపాటు స్నేహితులను అఫ్గానిస్తాన్ నుంచి తరలించండి అని హెచ్చరిస్తోంది స్పెయిన్‌లో నివసిస్తోన్న అఫ్గాన్ మహిళా కార్యకర్త, రచయిత నదియా గులామ్. ప్రస్తుతం నదియా అఫ్గాన్‌లో లేనప్పటికీ తన కుటుంబం మాత్రం ఇంకా అక్కడే ఉండడంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతోంది. ‘‘నా కుటుంబమే కాదు, అక్కడ ఉన్న వేలమంది కూడా నా కుటుంబ సభ్యులే. తాలిబన్లు తమ మాతృదేశాన్ని ఆక్రమించుకున్నప్పటి నుంచి నా కంటనీరు ఆగడం లేదు.గతంలో కంటే తాలిబన్లు ఇప్పుడు మరింత తెగబడతారు. గత ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా కనపడకుండా పోతారు’’ అని వణికిపోతోంది. నదియా ఇంతగా భయపడడానికి... గతంలో తాలిబన్ల అరాచకాల వల్ల తను అనుభవించిన నరకయాతనలే. తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను పరిపాలిస్తున్న రోజులవి. అప్పుడు నదియాకు పదకొండేళ్లు ఉంటాయి. ఒకరోజు నదియా వాళ్ల ఇంటిపై బాంబు పడింది. ఇంట్లో ఉన్న అమ్మానాన్నలు తీవ్రంగా గాయపడ్డారు. నదియా వాళ్ల అన్నయ్య ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయట పడిన నదియాకు రూపురేఖలు వికృతంగా మారిపోయాయి. ఒక బాంబు దాడి కుటుంబాన్నే నాశనం చేసింది. ఇది ఇలా ఉండగా... అదే సమయంలో ‘‘మహిళలు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, ఇల్లు విడిచి బయటకు రాకూడదు’’ అని తాలిబన్లు హుకుం జారీ చేశారు. ఒకపక్క అన్నయ్య లేడు, నాన్న ఉన్నప్పటికీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబానికి తనే ఆధారం కావాల్సి వచ్చింది. అడపిల్లలు బయటకు వెళ్లకూడదు. వెళ్లకపోతే ఇల్లు గడిచే పరిస్థితి లేదు. ఇంతటి క్లిష్టసమయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది నదియా. అమ్మాయిగా బయటకు వెళ్తే తప్పు గానీ, అబ్బాయిగా కాదు కదా! అనుకుని బయటకు వెళ్లేటప్పుడు అబ్బాయిలా బట్టలు వేసుకుని, అబ్బాయిలా తిరుగుతూ మగవాళ్లలా పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. ఇలా పదేళ్ల పాటు తన బాల్యాన్ని, గుర్తింపును కోల్పోయి బతికింది. పదేళ్ల తరవాత ఓ ఎన్జీవో సాయంతో స్పెయిన్‌కు శరణార్థిగా వెళ్లింది. స్పెయిన్ వచ్చాక మళ్లీ పుట్టినట్లు అనిపించింది తనకు. కొత్త జీవితాన్ని ప్రారంభించే క్రమంలో ముఖానికి సర్జరీ చేయించుకుని వికృతంగా ఉన్న రూపాన్ని కాస్త మార్చుకుంది. అలాగే తనలా శరణార్థులుగా వస్తోన్న నిరాశ్రయుల కోసం ‘‘పాంట్స్ పర్ లా పావ్’’ను స్థాపించి, శరణార్థులకు వివిధ రకాల భాషలు, వృత్తిపరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ వారికి బతుకుదెరువు చూపిస్తోంది. అంతేగాక చిన్నతనంలోనే అనేక కష్టాలను ప్రత్యక్షంగా అనుభవించిన నదియా అనుభవాలతో ‘‘ద సీక్రెట్ ఆఫ్ మై టర్బన్’’, టేల్స్ దట్ హీల్డ్ మీ’’, ‘‘ద ఫస్ట్ స్టార్ ఆఫ్ ది నైట్’’ పుస్తకాలను రాసి రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకుంది. తనలా ఇంకెంతమందో... ఇన్ని కష్టాలు పడిన నదియా ఇప్పటికీ ఆ చీకటిరోజులను మర్చిపోలేక పోతోంది. తాజాగా తాలిబన్లు మరోసారి పిల్లలు, అమ్మాయిలు, మహిళలపై ఎంతటిదారుణమైన చర్యలకు పాల్పడతారోనని వణికి పోతుంది. తనలాగా ఇంకెంతమంది అమ్మాయిలు తమ జీవితాలను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.‘‘ప్లీజ్ మా దేశానికి గన్స్ సరఫరా చేయకండి. నా దేశం గత యాభై ఏళ్లుగా యుద్ధంలో పోరాడుతూనే ఉంది. అఫ్గాన్‌లో 85 శాతం మంది ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. నిజంగా మీరు మాకు సాయం చేయాలంటే మానసిక ధైర్యాన్ని ఇవ్వండి. మహిళలు చదువుకునేందుకు సహకరించండి’’ అని అంతర్జాతీయ సమాజాన్ని అర్థిస్తోంది. అంతేగాదు, గత పదిరోజులుగా అఫ్గాన్ నుంచి ప్రజలను తరలించేందుకు శాయశక్తులా కృషిచేస్తోంది. నిజంగా కష్టాలు పడిన వారికే ఆ బాధ తెలుస్తుంది అనడానికి నదియా నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. నదియా గులామ్ -
చంపేస్తారేమోనని భయపడ్డాం..
షాజహాన్‌పూర్: రెండున్నరేళ్ల క్రితం అఫ్గాన్ వెళ్లిన ఓ భారతీయుడు తాలిబన్ ఆక్రమణ అనంతరం తిరిగి భారత్‌కు చేరుకోవడానికి చేసిన ప్రయత్నాలను వివరించారు. తాలిబన్ల చేతిలో దాదాపుగా మరణం ఖాయమనుకున్న పరిస్థితి నుంచి ప్రాణాలతో బయట పడిన సంఘటనలను వణుకుతూ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని చినోరె గ్రామానికి చెందిన జీత్ బహదూర్ రెండున్నరేళ్ల క్రితం అఫ్గాన్‌లోని ఓ కన్సల్టెన్సీలో సూపర్వైజర్గా చేరారు. అయితే తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించాక పరిస్థితులు మారిపోయాయి. కార్యాలయాలన్నీ మూతబడ్డాయి. దీంతో మరో మార్గం లేక భారత్‌కు తిరిగి వచ్చేందుకు జీత్ సహా అదే కంపెనీలో పని చేస్తున్న 118 మంది భారతీయులు నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న కాబూల్ విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందే తాలిబన్లు జీత్ వద్ద ఉన్న రూ. లక్ష నగదును, ఇతర వస్తువులను దోచుకున్నారు. డెన్మార్క్ ఎంబసీ వద్దకు చేరుకున్న వారిని ‘మీరు అఫ్గాన్ హిందువులా’ అని తాలిబన్లు ప్రశ్నించారు. అయితే తాము భారతీయ హిందువులమని చెప్పడంతో వారిని వదిలేశారు. నగదు దోచుకోవడం గురించి ప్రశ్నించగా, అది తాలిబన్లు చేయలేదని సమాధానమిచ్చారని చెప్పారు. తమ తాలిబన్లు అలాంటి పనులకు పాల్పడరని పేర్కొన్నారు. దీంతో చీకట్లోనే వారు నడుచుకుంటూ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వేలాది మంది పౌరులు విమానాశ్రయం వద్దే పడిగాపులు కాస్తున్నారు. అక్కడికి చేరుకున్న జీత్ బృందం దాదాపు మూడు రోజుల పాటు ఎలాంటి తిండీ తిప్పలు లేకుండా గడిపారు. ఇదిలా ఉండగా, తమకు తిండి లేక అల్లాడుతున్న సమయంలోనే తాలిబన్లు అక్కడి చేరుకొని తమను అయిదు గంటల పాటు ఆరుబయట నేల మీద కూర్చోబెట్టారని అన్నారు. అత్యాధునిక ఆయుధాలు ధరించి ఉన్న తాలిబన్లు తమను హతం చేస్తారని భావించినట్లు చెప్పారు. అయితే భారత్ నుంచి వచ్చిన ఆర్మీ విమానం తమను ఎక్కించుకొని ఈ నెల 22న ఢిల్లీ బయలుదేరిందని చెప్పారు. అప్రకటిత కర్ఫ్యూ.. అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుతం అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోందని జీత్ పేర్కొన్నారు. అన్ని కార్యాలయాలు మూతబడ్డాయని చెప్పారు. ఇంట్లో నుంచి బయటకు ఎవరూ రావడం లేదన్నారు. రోడ్ల మీద మహిళలు, పిల్లలు కనిపించడం లేదని పేర్కొన్నారు. మహిళల మీద తాలిబన్లు దాడులు చేసిన ఘటనలేమీ లేనప్పటికీ, గతాన్ని తలచుకొని చాలా మంది భయపడుతున్నారని అన్నారు. దేశం విడిచి వెళ్లవద్దని, ఎలాంటి హాని కలిగించబోమని తాలిబన్లు చెబుతున్నారని వెల్లడించారు. కాబూల్ నుంచి భారత్‌కు 75 మంది.. న్యూఢిల్లీ: తాలిబన్ పాలనలోకి వెళ్లిపోయిన అఫ్గాన్ నుంచి వలసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అఫ్గాన్ రాజధాని కాబూల్ నుంచి 75 మంది పౌరులతో పాటు, సిక్కు పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ ప్రతులను మూడింటిని భద్రంగా అఫ్గాన్ నుంచి భారత్‌కు ఐఏఎఫ్ యుద్ధ విమానం ద్వారా పంపినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 45 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులు ఉన్నట్లు తెలిపారు. మరో 200 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులు దేశం విడిచేందుకు ఎదురు చూస్తున్నారని ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ చంధోక్ తెలిపారు. గత కొద్ది రోజులుగా వీరు కాబూల్ విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల దూరంలోని గురుద్వారా కర్తే పర్వాన్‌లో ఆశ్రయం పొందినట్లు తెలిపారు. వీరిని తాలిబన్ చెక్‌పోస్టుల నుంచి తప్పిస్తూ అమెరికా బలగాలు విమానాశ్రయానికి చేర్చాయని పేర్కొన్నారు. ఈ సంస్థ భారత విదేశాంగ శాఖ, భారత వాయు సేన (ఐఏఎఫ్)లతో కలసి అఫ్గాన్ నుంచి పౌరులను తరలిస్తోంది. అఫ్గాన్ నుంచి వచ్చిన పౌరులు, గురు గ్రంథ్ సాహిబ్ గురించి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా ట్వీట్ చేశారు. మరోవైపు ఖతార్ రాజధాని దోహా నుంచి నాలుగు ప్రత్యేక విమానాల ద్వారా 146 మంది పౌరులు సోమవారం భారత్ చేరుకున్నారు. -
ఆమె అలా తప్పించుకుంది
పారిపోవాలి. బతకాలి. తాలిబన్ల చేతికి చిక్కకూడదు. లక్షల మంది ఆకాంక్ష అఫ్గానిస్తాన్‌లో ఇప్పుడు. కాని అందరికీ వీలవుతుందా? సాధ్యమవుతుందా? తుపాకీ గొట్టాన్ని తప్పించుకోగలరా? అఫ్గానిస్తాన్ వీల్చైల్ బాస్కెట్‌బాల్ కెప్టెన్ నీలోఫర్ బయత్ అక్కడి నుంచి భర్తతో సహా స్పెయిన్‌కు తప్పించుకోగలిగింది. కాని దాని వెనుక ఒక సినిమా అంత కథ ఉంది. ఏమిటి అది? ఆగస్టు 14న కాబూల్ తాలిబన్ల హస్తగతం అయ్యింది. ఆగస్టు 20న నీలోఫర్ బయత్ స్పెయిన్‌కు చేరుకోగలిగింది. ఈ మధ్యలోని 5 రోజులే ఆమె పారిపోవడానికి సంబంధించిన ఒక ఉత్కంఠ కథ. స్పెయిన్‌లోని బిల్బావ్ నగరానికి చేరుకుని ఆమె తెరిపినపడి కాఫీ తాగుతూ కూచుంది కాని ఆమె చేతులు ఇంకా ఒణుకుతున్నాయి. గుండె అదురుతూనే ఉంది. కళ్లు ఉండి ఉండి కన్నీరు కారుస్తూనే ఉన్నాయి. ఆమె తన భర్తతో పాటు తప్పించుకోగలిగింది. కాని తన బంధువులు, అయినవారు కాబుల్‌లోనే ఉన్నారు. వారి గతి ఏమిటి? భర్తతో కలిసి స్పెయిన్ విమానాశ్రయంలో ... ఆమె చేసిన పని కాబూల్ తాలిబన్ల హస్తగతం అయిన వెంటనే నీలోఫర్ బయత్ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే దేశాన్ని విడిచి పెట్టడం. ఆమె అఫ్గానిస్తాన్‌లోని వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ టీమ్ కెప్టెన్. అంతేకాదు మహిళల హక్కుల గురించి, దివ్యాంగుల అవసరాల గురించి కూడా మాట్లాడుతుంది. కాబూల్‌లో ఆమె ఒక సెలబ్రిటీ. ఆమె భర్త రమేష్ కూడా దివ్యాంగుల బాస్కెట్‌బాల్ టీమ్‌లో ఆడతాడు. ఇద్దరూ ఎన్నో కలలు కన్నారు. గత దశాబ్ద కాలంలో కాబూల్‌లో దివ్యాంగుల క్రీడల ఉన్నతికి పని చేస్తున్నారు. ఇంకా చేయాలనుకున్నారు. ఇంతలోనే తాలిబన్లు వచ్చేశారు. ‘వాళ్లు కచ్చితంగా నా కోసం వెతుకుతారని నాకు తెలుసు. అప్పటికే నాలాంటి వారి కోసం ఇల్లిల్లు వెతుకుతున్నారు’ అని నీలోఫర్ బయత్ అంది. ‘వెంటనే మనం దేశం విడిచిపెట్టాలి అని నా భర్తతో చెప్పాను’ అందామె. ఆమె అంత భయపడటానికి కారణం ఆమె చిన్నప్పుడు తాలిబన్ల మొదటి పాలనలో ఒక మిస్సైల్ ఆమె ఇంటి మీద కూలింది. ఒక సోదరుడు మరణించాడు. ఆమె వీపు కాలిపోయి వెన్నుకు గాయమైంది. దాంతో దివ్యాంగురాలైంది. అలాగే భర్త కూడా ల్యాండ్‌మైన్ పేలడంతో దివ్యాంగుడయ్యాడు. ఆ అనుభవాలు చాలు అనుకుందామె. జర్నలిస్ట్ ప్రమేయంతో... నీలోఫర్ వెంటనే చాలా ఏళ్లుగా తనకు తెలిసిన స్పానిష్ జర్నలిస్టు ఆంటోనియో పంప్లెగాతో తన బాధ మొరపెట్టుకుంది. ఆ జర్నలిస్టు ఆమె గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. స్పెయిన్ పౌరులు ఆ పోస్టుకు స్పందించారు. స్పెయిన్ ప్రభుత్వం కాబూల్ కేంద్రంగా యూరోపియన్ యూనియన్ ఇన్స్టిట్యూషన్స్లో పని చేసిన తన దేశీయులను, అఫ్గాన్ పౌరులను తరలించే కార్యక్రమాలు చేస్తోంది. ఆ విమానాల్లోనే నీలోఫర్‌ను భర్తతో పాటు తీసుకురావడానికి అంగీకరించింది. స్పెయిన్‌లో భర్తతో నీలోఫర్ బయత్ ‘అది తెలిసిన వెంటనే నేనూ నా భర్త కాబూల్ ఎయిర్పోర్ట్ వైపు కదిలాం. కాని సులభమా ఆ పని? అప్పటికే తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌ను చుట్టుముట్టారు. వాళ్ల తుపాకులు గాల్లో కాల్పులు చేస్తున్నాయి. మరోవైపు ఇతర పౌరులు కూడా వెర్రెత్తి ఎయిర్‌పోర్ట్‌లో చొరబడాలని చూస్తున్నారు. అసలు ఎయిర్‌పోర్ట్‌లో ప్రవేశించగలమా? అనుకున్నాను. ఎయిర్పోర్ట్ బయట ఏ క్షణమైనా మేము చనిపోవచ్చు. ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టడానికి బయట మేము 9 సుదీర్ఘ గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా తాలిబన్లు మా లగేజ్‌ను మాతో తీసుకెళ్లనివ్వలేదు. కట్టుబట్టలతో లోపలికి వెళ్లాం’ అందామె. వొంటి మీద బట్టలతో ఐదు రోజులు ఒంటి మీద బట్టలతో కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లోకి చేరుకున్న నీలోఫర్ ఆమె భర్త రమేశ్ తమకు విమానంలో చోటు దక్కడం కోసం దాదాపు ఐదు రోజులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారు. ‘దేశం విడిచిపెట్టడమే ఒక విషాదం. కట్టుబట్టలతో పరాయి దేశంలో దిగడం అంటే మళ్లీ జీవితాలను జీరో నుంచి మొదలెట్టడమే’ అందామె. ఎయిర్‌పోర్ట్‌లో అనుక్షణం ఆశనిరాశల భీతావహ క్షణాల తర్వాత వారికి స్పెయిన్ విమానం చోటు ఇచ్చింది. మొత్తం 105 పాసింజర్లతో అఫ్గాన్ శరణార్థుల కోసం స్పెయిన్ తన దక్షిణ భాగాన తెరిచిన మిలటరీ బేస్‌కు సురక్షితంగా చేరుకుంది. అక్కడి నుంచి ఆ దంపతులు బిల్బావ్ నగరానికి చేరుకున్నారు. ఊపిరి పోసిన ఆదరణ నీలోఫర్ బయత్ అదృష్టవంతురాలు. స్పెయిన్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ వెంటనే ఆమెకు బిల్బావ్ బాస్కెట్‌బాల్ టీమ్‌లో ఆడటానికి ఆహ్వానం పలికింది. భర్త రమేశ్‌కు కూడా పురుషుల టీమ్‌లో ఆడమని కోరింది. వారికి ఉపాధి దొరికినట్టే. కాని శరణార్థులుగా వారి జీవితం ఏం కానుంది? అఫ్గానిస్తాన్‌లో ఉండిపోయిన వాళ్ల బంధువుల జీవితాలు ఏం కానున్నాయి. ఇవన్నీ కాలమే తేల్చనుంది. మనిషి ఎంత ఆధునికుడైనా సాటి మనిషిని వేధించడంలో మృగ స్వభావం ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఆ మృగాన్ని మొదటే గుర్తించి ఆపకపోతే ఇవాళ అఫ్గానిస్తాన్ రేపు ఏదేశమో? -
హమ్మయ్య.. ఆ పాప మళ్లీ నవ్వింది..!
కాబూల్: తాలిబన్ల కబంధ హస్తాల నుంచి తమ కంటి పాపల్ని కాపాడాలంటూ ఇనుప కంచెల మీదుగా పిల్లల్ని విసిరేసిన హృదయ విదారక సన్నివేశాలు గుర్తున్నాయి కదా..! ఆ దృశ్యాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ పిల్లలు ఏమయ్యారోనంటూ తలచుకొని కుమిలిపోతూనే ఉన్నాం. కాబూల్ విమానాశ్రయంలో ఇనుప కంచెల మీదుగా అమెరికా నావికాదళ అధికారి ఒకరు అత్యంత సాహసంతో ఒంటి చేత్తో ఒక పసికందుని తీసుకున్న దృశ్యం అందరి మనసుల్ని కలిచి వేసింది. తల్లి నుంచి వేరుబడ్డ రెండు నెలల చిన్నారిని లాలిస్తున్న టర్కీ సైనికురాలు ఒమర్ హైదరి అనే మానవ హక్కుల కార్యకర్త తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ సమయంలో ఆ పాప కింద పడితే పరిస్థితి ఏంటని వీడియో చూసిన వారందరికీ గుండె గుభిలుముంటుంది. అయితే ఇప్పుడు ఆ చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ క్షేమంగా తిరిగి తండ్రి దగ్గరకి వచ్చింది. అప్పుడే పుట్టిన పసిపాపకి అనుకోని అనారోగ్యం రావడంతో ఆ పాపని స్వయంగా తండ్రే వైద్య చికిత్స కోసం సైనిక అధికారులకు అప్పగించారు. పసిపాపలను సముదాయిస్తున్న అమెరికా మహిళా సైనికులు అఫ్గానిస్తాన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో తమ బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లే దిక్కు లేక ఆ తల్లిదండ్రులు సతమతమయ్యారు. చివరికి ఆ చిన్నారి తండ్రి గుండె రాయి చేసుకొని అన్నింటికి తెగించి కాబూల్ విమానాశ్రయంలో ఉన్న అమెరికా నావికాదళ అధికారులకి తమ బిడ్డను అప్పగించారు. విమానాశ్రయంలో ఉన్న నార్వే ఫీల్డ్ ఆస్పత్రిలో ఆ పసిపాపకి చికిత్స నిర్వహించిన అనంతరం చిన్నారిని తిరిగి భద్రంగా ఆ తండ్రికి సైనికాధికారి అప్పగించారు. ‘ఆ వీడియోలో ఉన్న పసిపాపని వైద్య చికిత్స కోసం విమానాశ్రయంలో భద్రతా అధికారికి ఇచ్చారు. ఇప్పుడు ఆ పాప పూర్తి ఆరోగ్యంతో తిరిగి తండ్రి దగ్గరకి చేరుకుంది’ అని మేజర్ జిమ్ స్టెంజర్ సీబీఎస్ న్యూస్‌కి తెలిపారు. నావికాదళ అధికారుల సత్తా ఏమిటో ఇలాంటి సంఘటనలతోనే బయట ప్రపంచానికి తెలుస్తుందని ఆయన అన్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో అత్యంత త్వరగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరచడం నావికాదళ అధికారులకే సాధ్యపడుతుందని ఆ మేజర్ కొనియాడారు. ఈ విషయాన్ని అమెరికాలోని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కూడా ధ్రువీకరించారు.‘ఆ పసిపాప తిరిగి తండ్రి దగ్గరకి వెళ్లిపోయింది. వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో మాకు తెలీదు. కానీ పసిపిల్లల్ని వారి తల్లిదండ్రుల దగ్గరకి చేర్చడం అమెరికా సైన్యం తమ బాధ్యతగా భావిస్తుంది. ఈ విషయంలో అత్యుత్తమమైన పనితీరు కనబరుస్తుంది’ అని కిర్బీ కితాబునిచ్చారు. చిన్నారిని సురక్షితంగా తీసుకెళ్తున్న దృశ్యం ఆలనాపాలనా చూస్తున్న సైనికులు వివిధ దేశాల ప్రజల తరలింపు ప్రక్రియ నడుస్తున్న సమయంలో కాబూల్ విమానాశ్రయం అంతా గందరగోళంగా మారింది. ఆ జనం మధ్య కొందరు పిల్లలు తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఏడుస్తూ కనిపిస్తున్నారు. అలాంటి పిల్లల్ని విమానాశ్రయంలో ఉన్న అమెరికా, బ్రిటన్ సైనికులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ తిరిగి వారి కుటుంబాల వద్దకు చేరుస్తున్నారు. తల్లిదండ్రులు కనిపించే లోపు ఆ పిల్లల అవసరాలన్నీ వారే తీరుస్తున్నారు. పిల్లలకి జోల పాటలు పాడుతూ వారిని పడుకోబెట్టడం, పిల్లలకి మంచినీళ్లు ఇవ్వడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆ దృశ్యాలు చూసిన వాళ్లు ఇంకా మానవత్వం బతికే ఉందని గుండెల నిండా గాలి పీల్చుకుంటున్నారు. కంచె మీదుగా పాపను ఒంటిచేత్తో పట్టుకున్న అమెరికా సైనికుడు (ఫైల్) హెరాత్‌లో కోఎడ్యుకేషన్‌పై నిషేధం తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు పాత పరిపాలనను గుర్తు చేస్తూ తాలిబన్లు విధాన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్‌లోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్‌ను నిషేధిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. సమాజంలో అన్ని అనర్థాలకు కోఎడ్యుకేషనే కారణమని, అందుకే దీన్ని నిషేధిస్తున్నామని తాలిబన్లు తెలిపారు. పలువురు ప్రొఫెసర్లు, ప్రైవేటు కాలేజీల అధిపతులతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తాలిబన్ వర్గాలు వెల్లడించాయని ఖామా ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. అఫ్గాన్ స్వాధీనం చేసుకున్న అనంతరం తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదే! మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు ఉన్నత విద్యపై తాలిబన్ ప్రతినిధి ముల్లా ఫరీద్ మూడుగంటలు ఈ చర్చలు జరిపారు. కోఎడ్‌కు ప్రత్యామ్నాయం లేదని, దీన్ని నిలిపివేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా ఉపాధ్యాయులు కేవలం మహిళా విద్యార్థులకే బోధించాలని, మగ విద్యార్థులకు బోధించకూడదని ఆదేశించారు. పౌర పాలనలో అఫ్గాన్ ప్రభుత్వాలు పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు స్థాపించి కోఎడ్‌ను ప్రోత్సహించాయి. తాలిబన్ల తాజా నిర్ణయంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇబ్బందులు ఎక్కువని నిపుణులు భావిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు, 2వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు. షరియా చట్టం కింద మహిళా హక్కులు గౌరవిస్తామని ఈవారం ఆరంభంలో తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విలేకరుల సమావేశంలో అట్టహాసంగా ప్రకటించారు. అయితే గతంలో తమ విధానాలనే తాలిబన్లు కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. -
అఫ్గాన్‌లో ఇక ఆకలి కేకలే: యూఎన్
ఐక్యరాజ్య సమితి: అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంతో 1.4 కోట్ల మందికి తినడానికి తిండి కూడా దొరకదని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇప్పటికే కరోనా వైరస్‌తో కుదేలైపోయిన ఆ దేశంలో తాజాగా నెలకొన్న సంక్షోభంతో ప్రజలపై తీవ్రమైన ఆర్థిక, సామాజిక ప్రభావం కనిపిస్తుందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్స్‌కి చెందిన అఫ్గాన్ డైరెక్టర్ మేరి ఎలన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 40 శాతానికి పైగా పంటలు సరిగా పండలేదని, నిల్వ ఉన్న ఆహార ధాన్యాలు నాశనమయ్యాయని తెలిపారు. తాలిబన్ల రాకతో వేలాది మంది నిరాశ్రయులు అవుతున్నారని వారికి కడుపు నిండా అన్నం పెట్టాలన్నా కటకటగానే ఉందన్నారు. యూఎన్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆమె మే నెలలో 40 లక్షల మంది ఆకలిని తీర్చామని, వచ్చే కొద్ది నెలల్లో 90 లక్షల మంది కడుపు నింపాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునైనా ఈ ఆకలి సంక్షోభాన్ని నివారించాలంటే, 20 కోట్ల అమెరికా డాలర్లు తక్షణావసరమని మేరి వివరించారు. -
తాలిబన్ ప్రభుత్వానికి రుణాలివ్వం
వాషింగ్టన్/కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి ప్రస్తుతం ఎలాంటి రుణాలు ఇవ్వబోమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) తాజాగా తేల్చిచెప్పేసింది. ఇతర ఆర్థికపరమైన వనరులు కూడా సమకూర్చే ప్రశ్నే లేదని ఐఎంఎఫ్ స్పష్టంచేసింది. ఈ మేరకు తాజాగా ఐఎంఎఫ్ ఒక ప్రకటన జారీ చేసింది. తాలిబన్ల పట్ల అంతర్జాతీయ సమాజం వైఖరికి అనుగుణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. విదేశాల్లో రూ.66,600 కోట్లున్నాయి ప్రస్తుతం తమ దేశంలో నగదు నిల్వలు ఏవీ లేవని అఫ్గానిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజ్మల్ అహ్మదీ చెప్పారు. అయితే విదేశాల్లో మాత్రం 9 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.66,600 కోట్లు) ఉన్నాయని గవర్నర్ అజ్మల్ అహ్మదీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. 9 బిలియన్ డాలర్లలో 7 బిలియన్ డాలర్లు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బాండ్లు, బంగారం, ఇతర ఆస్తుల రూపంలో ఉన్నాయని పేర్కొన్నారు. తమ వద్ద అమెరికా డాలర్లు నిండుకున్నాయన్నారు. అఫ్గాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడంతో విదేశాల నుంచి రావాల్సిన నగదు ఆగిపోయిందన్నారు. ఇక వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదన్నారు. అమెరికా డాలర్లు తగినన్ని లేకపోతే ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని, ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని, ఫలితంగా సామాన్యులకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. అఫ్గాన్‌కు ఆయుధాల అమ్మకంపై నిషేధం తాలిబన్ల పునరాక్రమణ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి అన్ని రకాల ఆయుధాల విక్రయంపై అమెరికా సర్కారు నిషేధం విధించింది. ఈ మేరకు విదేశాంగ శాఖకు చెందిన రాజకీయ, సైనిక వ్యవహారాల బ్యూరో డిఫెన్స్ కాంట్రాక్టర్లకు నోటీసు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న లేదా ఇంకా అందజేయని ఆయుధాల విషయంలో పునఃసమీక్ష నిర్వహించాలని సూచించింది. -
మా కంటి పాపలనైనా కాపాడండి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాల నుంచి తమ పిల్లలనైనా రక్షించాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. దేశం వీడి వెళ్లిపోవడానికి వేలాదిగా కాబూల్ విమానాశ్రయానికి తరలి వస్తూ ఉండడంతో తాలిబన్లు ఎవరూ లోపలికి వెళ్లకుండా అడ్డంగా ఇనుప కంచెలు వేశారు. దీంతో ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లలేని వారంతా కనీసం తమ పిల్లలనైనా కాపాడాలంటూ విమానాశ్రయం లోపల ఉన్న యూకే, అమెరికా దళాలకి మొరపెట్టుకుంటున్నారు. కొందరైతే ఇనుప కంచెల మీదుగా పిల్లల్ని లోపలికి విసిరేస్తున్నట్టుగా స్కై న్యూస్ ఒక కథనంలో వెల్లడించింది. ‘‘కనీసం మా కంటి పాపలనైనా కాపాడండి. మీ వెంట బ్రిటన్ తీసుకువెళ్లిపోండి’’ అంటూ వారు ఆర్తిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అలా ఇనుప కంచెల మీదుగా విసిరేసే క్రమంలో కొందరు పిల్లలు వాటికి చిక్కుకొని గాయపడుతున్నారు. ఇలాంటి దృశ్యాలు చూస్తూ ఉంటే భరించలేనంత ఏడుపు వస్తోందని బ్రిటన్‌కు చెందిన ఒక సైనిక అధికారి చెప్పారు. విమానాశ్రయం లోపల ఉన్నప్పటికీ బయట నుంచి కాల్పుల మోతలు, అఫ్గాన్ల నిస్సహాయమైన ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని దీంతో కంటి మీద కునుకు కూడా రావడం లేదని ఆ అధికారి తెలిపారు. తమ దేశ సిబ్బందిని, పౌరుల్ని తరలించడానికి గత కొద్ది రోజులుగా బ్రిటన్, అమెరికా సైనికులు కాబూల్ విమానాశ్రయంలోనే మకాం వేశారు. ‘‘కొందరు మహిళలు తమ పిల్లల్ని కంచెల మీదుగా విసిరేస్తున్నారు. విమానాశ్రయం లోపల ఉన్న అధికారులకు వారిని తీసుకువెళ్లాల్సిందిగా చెబుతున్నారు. ఇంతకంటే బాధాకరమైన విషయం ఏముంటుంది’’ అని ఆయన అన్నారు. అఫ్గాన్‌ను ఆక్రమించుకోగానే తాలిబన్లు తమ నిజస్వరూపం బయట పెట్టడంతో పాటు దేశం విడిచి వెళ్లాలనుకునే వారిని దారుణంగా చితక్కొడుతున్నారు. నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎటు వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళనతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనుకునే కుటుంబాలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. -
Afghanistan: ఎమర్జెన్సీ వీసాలు జారీ చేసిన కేంద్రం!
తాలిబాన్లు అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడంతో అక్కడ ఉన్న ప్రజల్లో ఆందోళన మొదలైంది. అఫ్గనిస్తాన్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితిల వల్ల భారతదేశంలోకి ప్రవేశించాలని అనుకుంటున్న ఆఫ్ఘన్ జాతీయుల దరఖాస్తులను వేగంగా ట్రాక్ చేయడానికి భారతదేశం కొత్త కేటగిరీ ఈ-వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసాలు కేవలం ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాత మాత్రమే వీసాలు మంజూరు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీసా దరఖాస్తులను వేగంగా ట్రాక్ చేసే లక్ష్యంతో భారతదేశం"ఈ-ఎమర్జెన్సీ ఎక్స్-మిస్క్ వీసా" అనే కొత్త కేటగిరీ ఎలక్ట్రానిక్ వీసాను ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రానిక్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలో క్రింద తెలుసుకోండి. ఈ-వీసా దరఖాస్తు విధానం indianvisaonline.gov.in/evisa/Registration మీద క్లిక్ చేయండి ఇప్పుడు Apply here for e-visa క్లిక్ చేసిన తర్వాత, తప్పకుండా నేషనాలిటీ అఫ్గనిస్తాన్ ఎంచుకోండి. ఆ తర్వాత Passport Type, Port Of Arrival, Date of Birth, Email ID, Expected Date of Arrival వివరాలు సమర్పించండి. ఇప్పుడు వీసా కేటగిరీలో "ఎమర్జెన్సీ ఎక్స్-మిస్క్ వీసా" ఎంచుకోండి. ఆ తర్వాత క్యాప్చా నమోదు చేసి రిఫరెన్స్ కొరకు స్క్రీన్ షాట్ తీసుకోని continue మీద క్లిక్ చేయండి. ప్రాథమిక వివరాలను పూర్తి చేసిన తర్వాత పేజీలో దరఖాస్తుదారుల వివరాల కొరకు ఫారం ఉంటుంది. ప్రతి అప్లికేషన్ కోసం భారతదేశంలో ఉన్న రిఫరెన్స్ వ్యక్తి పేరు, ఫోన్ నెంబరు, చిరునామా మరియు అఫ్గనిస్తాన్‌లో ఉన్న ఒక రిఫరెన్స్ వ్యక్తి అవసరం అవుతుంది. ఈ వీసాకు దరఖాస్తు ఫీజు లేదు. #India has just started an e-visa for #Afghanistan. URL: https://t.co/L15UzDIsjC Visa category is "Emergency X-Misc Visa" Upon selecting "Afghanistan" in the drop down, the "e-Emergency X-Misc Visa" category checkbox automatically shows pic.twitter.com/NbhvpwAAPl — Rajeshwari (@rajeshwarie) August 17, 2021 ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న వారి కోసం ఎంఈఏ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసింది. ఇతర అభ్యర్థనల కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఆఫ్ఘనిస్తాన్ సెల్ ఏర్పాటు చేసి౦ది. ఎంఈఏ ప్రతినిధి అరిందమ్ బాగ్చి హెల్ప్ లైన్ నంబర్-919717785379, ఈ-మెయిల్- MEAHelpdeskIndia@gmail.com ట్విట్టర్ లో ప్రకటించారు. #MEA has set up a Special Afghanistan Cell to coordinate repatriation and other requests from Afghanistan. Pls contact : Phone number: +919717785379 Email: MEAHelpdeskIndia@gmail.com@IndianEmbKabul — Arindam Bagchi (@MEAIndia) August 16, 2021 -
వణుకుతున్న అఫ్గాన్ మహిళా లోకం
రెండు దశాబ్దాల తర్వాత మరోమారు పాలనా పగ్గాలు చేపట్టిన తాలిబన్లకు భయపడుతున్న ప్రజలు మాత్రం కట్టుబట్టలతో దేశం విడిచి పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ భవితవ్యం ఎలా ఉంటుంది? ముఖ్యంగా మహిళల పరిస్థితేంటి? అనే ప్రశ్నలకు తాలిబన్ల నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు. అసలు వారికైనా ఈ విషయాలపై స్పష్టత ఉందో, లేదో తెలియదు. గత పాలన సందర్భంగా తాలిబన్లు స్త్రీలను ఎలా చూశారో అందరికీ తెలుసు. స్త్రీలకు విద్య నిషేధించడం, బురఖా తప్పనిసరి చేయడం, హక్కులను కాలరాయడం, లైంగికబానిసలుగా మార్చడం వంటివి తలుచుకొనే ప్రస్తుతం అఫ్గాన్ మహిళా సమాజం ఉలిక్కిపడుతోంది. ముఖ్యంగా 2001 తర్వాత జన్మించిన యువతకు వీరి ఆగడాలపై అవగాహన లేదు. ప్రస్తుతం తాము మారిపోయామని, మహిళా విద్యను కొనసాగిస్తామని తాలిబన్లు ప్రకటించుకుంటున్నా మహిళల భయం తీరడం లేదు. ఇప్పటిౖMðతే మహిళల పట్ల తాలిబన్లు ఎలాంటి విధాన నిర్ణయాలు ప్రకటించలేదు. కానీ జూలైలో బందక్షాన్, తఖార్ ప్రావిన్సులను ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలు గుర్తుకొచ్చి ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న 15ఏళ్లు దాటిన బాలికలు, 45 ఏళ్లలోపు వితంతువుల జాబితాను తమకివ్వాలని జూలైలో తాలిబన్లు స్థానిక నాయకులను ఆదేశించారు. తాలిబన్ ఫైటర్లను పెళ్లి చేసుకోవడానికి వీరు అవసరమని ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆదేశాలు అమలయ్యాయా? అయితే అక్కడి ఆడవారి పరిస్థితి ఏంటి? అనే విషయాలపై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. పేరుకు పెళ్లిళ్లు కానీ, ఇవన్నీ యువకులను తమలోకి ఆకర్షించేందుకు తాలిబన్లు చేసే యత్నాలన్నది అందరికీ తెలిసిన సంగతే! ఇలా పెళ్లైనవారు భార్య హోదా పొందకపోగా లైంగిక బానిసలుగా మారడం కద్దు. ఈ ఆదేశాలకు భయపడి చాలా ప్రాంతాల్లో ప్రజలు పారిపోయారు. కేవలం మూడు నెలల్లో దాదాపు 9 లక్షలమంది స్వస్థలాలను విడిచిపోయారంటే తాలిబన్ టెర్రర్ అర్థమవుతుంది. ఇదే తరహాను కొనసాగిస్తే ఇరవైఏళ్లపాటు అఫ్గాన్ మహిళాలోకం సాధించిన విజయాలన్నీ మట్టికొట్టుకుపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించేలా తాలిబన్లపై ఒత్తిడి తీసుకురావాలని, మహిళా హక్కుల పరిరక్షణకు ఐరాస, ప్రపంచ దేశాలు నడుం బిగించాలని, ఆంక్షలు తొలగించాలంటే స్త్రీస్వేచ్ఛకు లింకు పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) –నేషనల్ డెస్క్, సాక్షి -
afghanistan Crisis: తాలిబన్లు ఎలా గెలిచారంటే!
ఇరవైఏళ్ల పాటు ఆధునిక పాశ్చాత్య బలగా ల శిక్షణ, అమెరికా, నాటో సేనలు అందించిన ఆయుధాలు, 3.5 లక్షలకు పైగా బలగం.. ఇన్ని ఉన్నా కనీస ప్రతిఘటన లేకుండా అఫ్గాన్ సేన తాలిబన్లకు తలొగ్గింది. తమ బలగాలు ఖాళీ చేసిన నెల రోజుల్లో దేశాన్ని తాలిబన్లు వశం చేసుకోవచ్చన్న అగ్రరాజ్యం అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం 10 రోజుల్లో అఫ్గాన్ సైన్యం లొంగిపోయిన తీరు అందరినీ నివ్వెర పరుస్తోంది. ఎందుకిలా జరిగిందనే ప్రశ్నకు ముందుగా వినిపిస్తోన్న సమాధానం.. అవినీతి! ఇరవైఏళ్లుగా అఫ్గాన్ సైన్యంలో అవినీతి తారాపథానికి చేరింది. సామాన్య సైనికుడి నుంచి అత్యున్నత అధికారి వరకు అంతా లంచాలు మరిగారు. ప్రపంచ దేశాలు ఇచ్చిన నిధులన్నీ అధికారులు దిగమింగి కూర్చున్నారు. దీంతో కీలక సమయంలో సైన్యమంతా చేతులెత్తేసింది. రెండు దశాబ్దాలు అఫ్గాన్‌లో ఉన్న పాశ్చాత్య సేనలు అఫ్గాన్‌లో అవినీతి చూసి విస్తుపోయారంటే అతిశయోక్తి కాదు. స్వయంగా ఆదేశ ఇనస్పెక్టర్ జనరలే తమ దేశ బలగాలకు లంచమనే కేన్సర్ రోగం పట్టిందని చెప్పినట్లు యూఎస్ కాంగ్రెస్ నివేదిక చెబుతోంది. అఫ్గాన్ సెక్యూరిటీకి దాదాపు 880 కోట్ల డాలర్లను యూఎస్, నాటో దళాలు వెచ్చించాయి. కానీ చివరకు ఇదంతా బూడిదలో పోసిన పన్నీరైంది. కీలక సమయంలో సాయం చేస్తుందనుకున్న అఫ్గాన్ ఎయిర్‌ఫోర్స్ కూడా చేతులెత్తింది. అఫ్గాన్ వైమానిక దళంలో దాదాపు 211 విమానాలున్నాయి. కానీ వీటిని నడిపేందుకు అవసర సిబ్బంది, వీరిని ప్రేరేపించే నాయకులు లేకుండా పోయారు. అందువల్ల కాబూల్‌లోకి తాలిబన్లు వస్తున్నా ఒక్క యుద్దవిమానం కూడా ఎదిరించలేదు. అవినీతితో పాటు అఫ్గాన్ సేనల్లో పిరికితనం పాలు ఎక్కువైందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా తాలిబన్లతో జరిపిన పోరాటాల్లో చాలామంది గాయపడడం, వీరి స్థానంలో సరిపడ కొత్త సైన్యం భర్తీ కాకపోవడం కూడా ఓటమికి మరో కారణంగా చెప్పారు. బయటి మద్దతు కేవలం అఫ్గాన్ సేనల్లో అవినీతి మాత్రమే తాలిబన్ల విజయానికి కారణం కాదన్నది నిపుణుల మాట. ఒకప్పుడు తాలిబన్లను గట్టిగా వ్యతిరేకించిన స్థానిక తెగల నాయకులు, ప్రజలు ఈ దఫా తాలిబన్లకు సహకారం అందించారు. 2 దశాబ్దాలు అమెరికా ఆధ్వర్యంలో పాలన జరగడం చాలా తెగలకు నచ్చలేదు. దీంతో వీరిని తాలిబన్లు తమవైపునకు తిప్పుకున్నారు. అందుకే చాలా ప్రాంతాల్లో తాలిబన్లు గట్టిగా పోరాడకముందే విజయం లభించింది. తాలిబన్లకు పాక్ మద్దతుంది.. వీటికి యూఏఈ, ఖతార్, సౌదీ నుంచి వచ్చిన విరాళాలు, రష్యా, చైనాల పరోక్ష సహకారం, ఓపియం పంటతో ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరగడం తదితర కారణాలు తాలిబన్లకు గెలుపునందించాయి. పాకిస్తాన్ గతంలోలా పీఓకే గుండా ఉగ్రతండాలను తాలిబన్ సహకారంతో భారత్‌లోకి పంపిస్తుందన్న ఆందోళనలు పెరిగాయి. –నేషనల్ డెస్క్, సాక్షి -
అఫ్గాన్ గగనతలం మీదుగా విమాన రాకపోకలు రద్దు
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ‘అఫ్గాన్ గగనతలం అనియంత్రితం’ అంటూ కాబూల్ విమానాశ్రయం అధికారులు ప్రకటించారు. అఫ్గాన్ గగనతలం ఆర్మీకి బదిలీ అయిందనీ, ఇతర ఏ విమానాలు ప్రయాణించినా దానిని అనియంత్రితంగానే పరిగణిస్తామంటూ కాబూల్ ఎయిర్‌పోర్టు అధికారులు నోటమ్ (పైలట్లకు హెచ్చరిక నోటీస్) విడుదల చేశారు. తదుపరి ప్రకటన చేసే వరకు ప్రజా ప్రయాణాలకు కాబూల్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో అనేక దేశాలు ఆ దేశానికి విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ఎయిర్ ఇండియా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఇతర సంస్థలు పాశ్చాత్య దేశాలకు తమ విమానాలను ఇతర మార్గాల ద్వారా నడిపాయి. ఎయిర్ ఇండియా తన ఏకైక ఢిల్లీ–కాబూల్–ఢిల్లీ సర్వీసును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. -
డబ్బు సంచులతో ఘనీ పరారీ
మాస్కో: సంక్షోభ అఫ్గాన్ నుంచి సంచులకొద్దీ సొమ్ముతో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పారిపోయారని తెలుస్తోంది. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్.. నగదుతో నిండిపోయిందని రష్యా అధికార వార్తా వెల్లడించింది. అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో ఉన్న రష్యా రాయబార కార్యాలయం అందించిన వివరాలను రష్యా అధికారిక వార్త సంస్థ టాస్ (టీఏఎస్ఎస్) సోమవారం బయటపెట్టింది. ఘనీ కోసం భారీస్థాయిలో డబ్బుల కట్టలను కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. మొత్తం నగదుతో నింపిన నాలుగు కార్లను ఎయిర్‌పోర్టు రన్‌వే మీదకు తెచ్చారు. కార్లలో ఉన్న నగదుతోపాటు విడిగా మరో క్యాష్ బ్యాగ్‌ను అక్కడికి తీసుకొచ్చారు. వీలైనంత ఎక్కువ నగదు కట్టలను హెలికాప్టర్లోకి ఎక్కించారు. సరిపడా ఖాళీ లేకపోవడంతో, చేసేదేమీలేక కొంత నగదును రన్‌వే మీదనే వదిలేసి అధ్యక్షుడు ఘనీ అఫ్గాన్‌ను వదిలి విదేశం వెళ్లిపోయారని ‘టాస్’ వెల్లడించింది. ఘనీతోపాటు చాలా నగదు దేశం దాటి పోయిందని రష్యా దౌత్య మిషన్ అధికార ప్రతినిధి నికిత ఇషెంకో చెప్పారు. -
రక్తపాతం నివారించేందుకే వెళ్లిపోయా: ఘనీ
భారీ రక్తపాతంతో అఫ్గాన్ గడ్డ తడవకుండా ఉండేందుకే తాను దేశం విడిచి వెళ్లానని ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తెలిపారు. దేశం వదిలిపోయిన తర్వాత తొలిసారి ఘనీ తన అభిప్రాయాలను వెల్లడించారు. అధ్యక్ష భవనంలోకి వస్తున్న సాయుధ తాలిబన్లకు అడ్డుగా నిలబడడం, 20 ఏళ్లుగా రక్షించుకుంటున్న దేశాన్ని కాపాడేందుందుకు శాంతియుతంగా వెళ్లిపోవడం అనే రెండు మార్గాలు తనకు ఎదురయ్యాయని చెప్పారు. తాలిబన్లు ఆయుధాలతో విజయం సాధించారని, దేశ ప్రజల అస్థిత్వాన్ని, గౌరవాన్ని, సంపదను కాపాడాల్సిన బాధ్యత ఇక వారిదేనని చెప్పారు. ‘ భయాందోళనలతో ఉన్న ప్రజల హృదయాలను వారు చట్టబద్ధంగా గెలవాల్సిఉంది. ప్రజలకు భరోసా ఇవ్వడంకోసం వాళ్లు ఒక ప్రణాళికను రూపొందించాలి’ అని ఘనీ పేర్కొన్నారు. -
తాలిబన్ల ఆధీనంలో అప్గన్ పార్లమెంట్, వీడియో వైరల్
కాబూల్: అఫ్ఘనిస్తాన్ మళ్లీ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాలిబన్ల రాక్షస రాజ్యంలో ఎన్ని చిత్రహింసలు అనుభవించాలో తలుచుకుని వణికిపోతున్నారు. కాగా తాలిబన్లు ఆదివారం అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌ను ఆక్రమించిన సంగతి తెలిసిందే. ఇక పూర్తి అధికారాన్ని దక్కించుకొనే దిశగా అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో అప్గనిస్తాన్ అధ్యక్ష భవనాన్ని తాలిబన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కాబూల్‌లోని పార్లమెంటు భవనంలోకి ప్రవేశించి సంబరాలు చేసుకున్నాయి. పార్లమెంట్ లోపల తాలిబన్లు ఆయుధాలు ధరించి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్పీకర్ చైర్లో ఒక తాలిబన్ కూర్చొని టేబుల్‌పై తుపాకీని ఉంచగా.. అధ్యక్షుడితోపాటు ఇతర ప్రముఖులు కూర్చునే స్థానాల్లో మరి కొందరు సాయుధ తాలిబన్లు కూర్చున్నారు. సరిగ్గా రెండు వారాల క్రితం అప్గన్ అధ్యక్షుడు అర్షఫ్ ఘనీ సంయుక్త సమావేశాన్ని నిర్వహించినప్పుడు నాయకులు కూర్చున్న కుర్చీలపైనే తాలిబన్లు కూర్చున్నారు. పార్లమెంట్ లోపల ఉన్న అప్గనిస్తాన్ జాతీయ జెండాను తొలగించారు. అఫ్గానిస్తాన్ పేరును మార్చాలని తాలిబన్లు నిర్ణయించారు. ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌గా పిలవాలని ఆదేశించారు. అధ్యక్ష భవన నుంచే ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. అమెరికా సైన్యం రాకముందు తాలిబన్ల పాలన కొనసాగుతున్నప్పుడు అఫ్గాన్‌కు ఇదే పేరు ఉండేది. Taliban have entered the Parliament of Afghanistan. This building was built by India.#Kabul #Taliban #Afghanistan #KabulHasFallen pic.twitter.com/BEYowxdstA — Wajahat Kazmi (@KazmiWajahat) August 16, 2021 -
నరకయాతన: విమానం నుంచి కిందపడిన ఇద్దరు అఫ్గన్లు
Shocking Videos from Kabul Airport:: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో అఫ్గనిస్తాన్ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారం తాలిబన్ల వశం కావడంతో అఫ్గన్ నుంచి బయట పడేందుకు నానాతంటాలు పడుతున్నారు. అఫ్గన్ మీదుగా విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. రన్‌వేపై కదులుతున్న విమానం ఎక్కేందుకు వందలాది మంది ప్రయత్నించారు. విమానం డోర్ క్లోజ్ చేసినా వేలాడుతూ ప్రయాణించేందుకు సాహసించారు. ఈ క్రమంలో టేకాఫ్ అయిన విమానం నుంచి ఇద్దరు అప్గన్లు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. దీనికి సంబంధించిన భయానక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం కావడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు మొత్తం అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించడం గమనార్హం. ఇక పూర్తి అధికారాన్ని దక్కించుకొనే దిశగా అడుగులేస్తున్నారు. అందరూ ఊహించనట్లుగానే తాలిబన్లు ఆదివారం అఫ్గన్ రాజధాని కాబూల్‌లోకి దర్జాగా ప్రవేశించారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఈ చారిత్రక నగరంలో పాగా వేశారు. తాము ఎవరిపైనా దాడులు చేయబోమని, ప్రభుత్వం బేషరతుగా లొంగిపోవాలని తాలిబన్లు నిర్దేశించారు. దీంతో అఫ్గన్ కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. శాంతియుతంగా అధికార మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు. అఫ్గన్ తాలిబన్ల వశం కావడంతో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసి, తన బృందంతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. తజకిస్తాన్‌కు వెళ్లి తలదాచుకుంటున్నారు. -
కాబూల్ నుంచి భారతీయులు వెనక్కి!
న్యూఢిల్లీ/కాబూల్/వాషింగ్టన్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో భారత్ అప్రమత్తమయ్యింది. ప్రస్తుతం కాబూల్‌లో వందలాది మంది భారతీయులు ఉన్నారు. వారందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఆదివారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించా యి. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేసే సిబ్బందితోపాటు భారతీయుల ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశాయి. ఒకవేళ వారిని అత్యవసరంగా వెనక్కి తీసుకొని రావా ల్సి వస్తే అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అఫ్గాన్‌లోని తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. భారతీయులను స్వదేశానికి రప్పించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సి–17 గ్లోబ్‌మాస్టర్ మిలిటరీ ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రభుత్వం సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది. అలాగే కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి 129 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా విమానం(ఏఐ–244) ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది. రాత్రి 7.40 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. మిగిలింది విమాన మార్గమే కాబూల్ సరిహద్దులన్నీ మూసుకుపోయాయి. కాబూల్ సమీపంలోని జలాలాబా ద్‌ను సైతం తాలిబన్లు ఆక్రమించడంతో నగరం మొత్తం దిగ్భంధనంలో చిక్కుకున్నట్లయ్యింది. దీంతో కాబూల్ నుంచి బయటకు వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కేవలం విమాన మార్గమే మిగిలింది. స్వదేశానికి తిరిగి వెళ్లేవారితో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కిక్కిరిసిపోతోంది. చాలామంది తమ సామానుతో సహా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. అఫ్గానిస్తాన్‌ను బాహ్య ప్రపంచంతో అనుసంధానించడానికి కాబూల్ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు యథాతథంగా కొనసాగేలా సహకారం అందిస్తున్నట్లు ‘నాటో’ ప్రకటించింది. -
Afghanistan: అఫ్గాన్‌లో తాలిబన్ రాజ్యం
కాబూల్: అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణం ఒక విఫల ప్రయోగంగానే మిగిలిపోయింది. అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ తాలిబన్లకు అందివచ్చిన అవకాశం మారింది. దేశాన్ని మళ్లీ స్వాధీనం చేసుకున్నారు. ఇక పూర్తి అధికారాన్ని దక్కించుకొనే దిశగా అడుగులేస్తున్నారు. అందరూ ఊహించనట్లుగానే తాలిబన్లు ఆదివారం అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోకి దర్జాగా ప్రవేశించారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఈ చారిత్రక నగరంలో పాగా వేశారు. తాము ఎవరిపైనా దాడులు చేయబోమని, ప్రభుత్వం బేషరతుగా లొంగిపోవాలని తాలిబన్లు నిర్దేశించారు. దీంతో అఫ్గాన్ కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. శాంతియుతంగా అధికార మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు. అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసి, తన బృందంతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. తజకిస్తాన్‌కు వెళ్లి తలదాచుకుంటున్నారు. అఫ్గాన్ సర్కారు నుంచి తాలిబన్లకు అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షించడానికి కో–ఆరి్డనేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ప్రకటించారు. అమ్మో... తాలిబన్ పాలన కేవలం వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు మొత్తం అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించడం గమనార్హం. అఫ్గాన్ భద్రతా దళాలను బలోపేతం చేసేందుకు అమెరికా, నాటో ఇప్పటిదాకా వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టినప్పటికీ అదంతా వృథా ప్రయాసగా మారింది. అఫ్గాన్ సైన్యం తాలిబన్లకు కనీసం ఎదురు నిలువలేకపోయింది. రాజధాని కాబూల్ తాలిబన్ల పరం కావడానికి కనీసం నెల రోజులైనా పడుతుందంటూ అమెరికా సైన్యం వేసిన అంచనాలు తారుమారయ్యాయి. తాలిబన్ల అరాచక పాలనలో బతకలేమంటూ అఫ్గాన్లు, విదేశీయులు అఫ్గానిస్తాన్ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ దాచుకున్న సొమ్మును వెనక్కి తీసుకొనేందుకు జనం ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరారు. కొందరు పేదలు తమ ఇళ్లను వదిలేసి పార్కులు, బహిరంగ ప్రదేశాలకు చేరుకుంటున్నారు. తమ పౌరులను అఫ్గాన్ నుంచి వెనక్కి రప్పించేందుకు అమెరికాతో సహా చాలా దేశాలు ఆత్రుత పడుతున్నాయి. ఆదివారం కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని అమెరికా సైన్యం హెలికాప్టర్లలో కాబూల్ ఎయిర్‌పోర్టులోని ఔట్‌పోస్టుకు తరలించింది. కో–ఆరి్డనేషన్ కౌన్సిల్ తాలిబన్లతో చర్చలు జరపడానికి, దేశంలో అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షించడానికి కో–ఆర్డినేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ కౌన్సిల్లో గుల్బుదీన్ హెక్మాత్యార్, అబ్దుల్లా అబ్దుల్లాతోపాటు తాను కూడా సభ్యులుగా ఉంటామని తెలిపారు. కాబూల్ వీధుల్లో అలజడి, అశాంతిని నియంత్రించాలని తాలిబన్లకు, అఫ్గాన్ సైనికులకు హామీద్ కర్జాయ్ సూచించారు. అఫ్గాన్‌లో శాంతిని స్థాపించేందుకు, అధికార బదిలీ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అందరూ చొరవ తీసుకోవాలని కోరారు. మరోవైపు తాలిబన్ల ముందు తాను ఎప్పటికీ తల వంచబోనని అఫ్గాన్ మొదటి ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తేల్చిచెప్పారు. ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ అఫ్గానిస్తాన్ పేరును మార్చాలని తాలిబన్లు నిర్ణయించారు. ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌గా పిలవాలని ఆదేశించారు. అధ్యక్ష భవన నుంచే ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. అమెరికా సైన్యం రాకముందు తాలిబన్ల పాలన కొనసాగుతున్నప్పుడు అఫ్గాన్‌కు ఇదే పేరు ఉండేది. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు! కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఆదివారం రాత్రి తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు జరిగినట్లుగా సమాచారం అందుతోందని, అందువల్ల అమెరికన్లు ఎక్కడివారక్కడే సురక్షితంగా తలదాచుకోవాలని సూచించింది. ‘కాబూల్‌లో పరిస్థితి క్షీణిస్తోంది. విమానాశ్రయంలో భద్రత ప్రమాదంలో పడింది. వేగంగా పరిస్థితి దిగజారుతోంది. విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడివారక్కడ సురక్షితంగా ఉండండి. రాయబార కార్యాలయంలో అధికారిక విధులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. ఈ సమయంలో ఎవరూ ఎంబసీకి, విమానాశ్రయానికి రావొద్దు’ అని కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. జెండాను కూడా తీసుకెళ్లిన అమెరికా అఫ్గానిస్తాన్‌లో అమెరికా రాయబారి రాస్ విల్సన్ కాబూల్‌లోని దౌత్య కార్యాలయాన్ని వదిలేసి ఆదివారం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఎంబసీపై ఎగురుతున్న అమెరికా జాతీయ జెండాను తొలిగించి మరీ వెంట తీసుకుపోయారు. కాగా రాయబార కార్యాలయంలోని ముఖ్యమైన ఫైళ్లను అమెరికా సిబ్బంది దగ్ధం చేశారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు విషమిస్తుండడంతో అమెరికా ప్రభుత్వం మరో 1,000 మంది సైనికులను ఆదివారం కాబూల్‌కు తరలించింది. ఇప్పటికే అక్కడ ఉన్న తమ 4,000 మంది సైనికులకు సహకరించేందుకు వీరిని కువైట్ నుంచి తరలించినట్లు తెలిపింది. అధ్యక్ష భవనం స్వాధీనం అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రాజీనామా చేయడంతో అఫ్గాన్ అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కాబూల్‌లో అల్లర్లు, లూటీలు జరగకుండా నివారించడానికే తాలిబన్లు నగరంలో కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిదీన్ ప్రకటించారు. సైనిక దళాలు ఖాళీ చేసిన ఔట్‌పోస్టులను తాము స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందాలి్సన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆదివారం కాబూల్ శివార్లలో జరిగిన ఘర్షణల్లో 40 మంది గాయపడినట్లు తెలిసింది. -
కాబూల్ శివార్లలో తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ తాలిబన్ల వశమయ్యే సమయం దగ్గర పడుతోంది. కాబూల్ శివార్ల దాకా తాలిబన్లు చొచ్చుకొని వచ్చి సరిగ్గా 11 కి.మీ. దూరంలో తిష్టవేసుకొని కూర్చున్నారు. దేశ రాజధాని కాబూల్‌ని ముట్టడించే పని ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అఫ్గాన్ మొత్తం తాలిబన్ల వశమైతే మరోసారి దేశం అంతర్యుద్ధంతో తల్లడిల్లిపోతుందనే ఆందోళనలు చెలరేగుతున్నాయి. కాబూల్‌కి దక్షిణంగా కేవలం 11 కి.మీ. దూరంలో ఉన్న చార్ అస్యాబ్ జిల్లా వరకు తాలిబన్లు వచ్చేశారని లోగర్ ప్రావిన్స్ చట్ట సభల ప్రతినిధి హోడా అహ్మది చెప్పారు. అఫ్గాన్ నుంచి అమెరికా ఈ నెల 31న చివరి విడత బలగాలను ఉపసంహరించాల్సి ఉండగా, దానికి రెండు వారాల ముందే తాలిబన్లు కాబూల్‌లో తమ జెండాని ఎగురవేయడానికి సిద్ధమవుతున్నారు. శనివారం ఒక్కరోజే మరో ఐదు ప్రావిన్స్‌లను ఆక్రమించుకున్నారు. లోగర్ ప్రావిన్స్ స్వాధీనం చేసుకునే సమయంలో తాలిబన్లు, అఫ్గాన్ సైన్యానికి మధ్య భీకర పోరు జరిగింది. అయినప్పటికీ తాలిబన్ల ధాటికి అఫ్గాన్ దళాలు నిలవలేకపోయాయి. పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్న పక్తికా ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నట్టు ఆ ప్రావిన్స్ ప్రజాప్రతినిధి ఖలీద్ అసాద్ వెల్లడించారు. ఆ ప్రావిన్స్‌లోని ప్రధాన నగరమైన సహరానా తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకుంది. దేశంలోని దాదాపుగా ముప్పావు వంతు ప్రాంతాలు ఇప్పటికే తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కీలక నగరాలైన హెరాత్, కాందహార్లు (దేశంలోని రెండో, మూడో అతిపెద్ద నగరాలు) ఇప్పటికే తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. ఉత్తర, పశ్చిమ, దక్షిణాది ప్రాంతాలను కొల్లగొట్టేసి తమ సంస్థకు చెందిన తెల్ల జెండాను ప్రభుత్వ కార్యాలయాల మీద ఎగురవేస్తున్నారు. ఒక పథకం ప్రకారం ముందుకు వెళుతున్న తాలిబన్లు మజార్ ఏ షరీఫ్(బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని)ను ఆక్రమించుకోవడానికి ముప్పేట దాడి చేశారు. భీకరపోరు తర్వాత శనివారం రాత్రి మజార్ ఏ షరీఫ్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్నారు. ఫర్యాబ్, కునార్ ప్రావిన్స్‌లు కూడా తాలిబన్ల వశమయ్యాయి. అఫ్గానిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో(రాష్ట్రాలు) 22 తాలిబన్ల అధీనంలోకి వచ్చేశాయి. ఉలిక్కిపడిన అమెరికా, కాబూల్‌కు 3 వేల బలగాలు తాలిబన్లు చెలరేగిపోతూ వాయువేగంతో ఒక్కో ప్రాంతాన్ని చుట్టేస్తూ ఉండడంతో అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాబూల్‌లోని తమ దౌత్య సిబ్బందిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి 3 వేల మంది భద్రతా బలగాలను పంపింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం కాస్త ఆలస్యం కావడంతో ఆగస్టు 31 నాటికి పూర్తిగా బలగాలను వెనక్కి తీసుకురావాలన్న తమ లక్ష్యాలను ప్రభుత్వం అందుకోగలదా లేదా అన్న సందేహాలైతే ఉన్నాయి. మూడువేల బలగాల్లో కొంతమంది శుక్రవారం కాబూల్‌కు చేరుకోగా... మిగతా వారు ఆదివారం నాటికి రానున్నారు. ఈ బలగాలు కాబూల్ చేరుకొని దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకువస్తాయి. తాలిబన్లు కాబూల్ చేరే లోపు అమెరికా చేసే ఈ ఆపరేషన్ ఎంతవరకు సాగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం అమెరికాకి చెందిన సైనికులు వెయ్యి మంది మాత్రమే ఉండడంతో తమ సిబ్బందిని తరలించడం కష్టమవుతుందనే అంచనాతోఅప్పటికప్పుడు 3 వేల మంది సైనికుల్ని పంపింది. క్షణక్షణం బతుకు భయం అఫ్గాన్‌పై తాలిబన్లు పట్టు బిగుస్తూ ఉండడంతో ప్రజల్లో రోజు రోజుకీ ఆందోళన తీవ్రతరమవుతోంది. ఇక ముందు తమ బతుకులు ఎలా ఉంటాయోనని తలచుకుంటే వారికి వెన్నులో వణుకు పుడుతోంది. మజర్–ఏ–షరీఫ్ చుట్టూ తాలిబన్లు మోహరించి ఉండడంతో క్షణక్షణం భయంతో బతుకుతున్నారు. పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని నగరవాసి మొహిబుల్లా ఖాన్ చెప్పారు. సుస్థిరతకే కృషి: అధ్యక్షుడు ఘనీ అఫ్గాన్‌లో సుస్థిరత ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని, దేశంలో చెలరేగే హింసాత్మక పరిస్థితుల్ని అడ్డుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సాయుధ బలగాలను తిరిగి సమాయత్తపరచడానికే తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ కాబూల్ శివార్లకి చేరుకున్న నేపథ్యంలో ఘనీ రాజీనామా చేసి, దేశాన్ని విడిచి వెళ్లిపోతారని విస్తృతంగా ఊహాగానాలు చెలరేగాయి. అంతర్జాతీయ మీడియా ఇక ఘనీ పని అయిపోయినట్టుగా కథనాలు రాసింది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం నాడు టెలివిజన్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. గత 20 ఏళ్లుగా సాధించిన లక్ష్యాలను వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని అన్నారు. అఫ్గాన్లపై యుద్ధాన్ని ప్రకటించి, ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకోనని, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. అయితే తన రాజీనామా విషయంపై వస్తున్న వార్తల గురించి ఆయన ప్రస్తావించలేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడుకోవడానికి, యుద్ధ ప్రమాదం నుంచి ప్రజల్ని రక్షించడానికి అంతర్జాతీయ సమాజంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. దేశంలో శాంతి, సుస్థిరత ఏర్పాటు చేయడానికి రాజకీయ పక్ష నాయకులు, ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అంతర్జాతీయ భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెప్పారు. శాంతి, సుస్థిర స్థాపనకు పరిష్కార మార్గాన్ని కనుగొంటామని ఘనీ స్పష్టం చేశారు. ► 22: అఫ్గాన్‌లో మొత్తం 34 ప్రావిన్స్‌లలో 22 ఇప్పటికే తాలిబన్ల అధీనంలోకి వెళ్లిపోయాయి ► 5: శనివారం తాలిబన్ల వశమైన ప్రావిన్స్‌లు ► 3000: కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయ సిబ్బంది, పౌరులను తరలించేందుకు అమెరికా అత్యవసరంగా 3వేల మంది సైనికులను పంపుతోంది -
కాబుల్ వైపు దూసుకొస్తున్న తాలిబన్ సైన్యం.. 15 కిలో మీటర్ల దూరంలో
కాబుల్: అఫ్ఘనిస్తాన్‌లో పలు ప్రాంతాలను తాలిబన్లు తమ ఆధీనంలోని తెచ్చుకుంటున్నాయి. అందులో భాగంగా తాలిబన్ సైన్యం దేశ రాజధాని కాబుల్ వైపు దూసుకువెళ్తోంది. కాబుల్‌కు దక్షిణాన ఉన్న నగరాన్ని తాలిబన్ల స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆమెరికా బలగాలు రాయబార కార్యాలయాన్ని, ఇతర పౌరులను ఖాళీ చేయటంలో సహాయ పడుతున్నాయి. కాబుల్‌కు సమీపంలోని మైదాన్ వార్దక్ ప్రావిన్స్ రాజధాని మైదాన్ షార్ పట్టనాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవటంతో రాజధాని వైపు దూసుకోస్తున్నారు. ప్రస్తుతం కాబుల్‌కు 15 కీలో మీటర్ల దూరంలో తాలిబన్ బలగాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా తుది విడత బలగాలను ఉపసంహరించడానికి వారంముందే దేశంలో 66% భూభాగం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ను ఆక్రమించుకున్నారు. దక్షిణాది ఆర్థిక హబ్‌గా పేరున్న కాందహార్‌లో గురువారం రాత్రి తాలిబన్లు, అఫ్ఘనిస్తాన్ సైన్యానికి మధ్య భీకర ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి దాటాక తాలిబన్లు కాందహార్‌ని స్వాధీన పరచుకొని ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ జెండాలు ఎగురవేసినట్టు అధికారులు పేర్కొన్నారు. #Taliban are less than 15 kilometers away from #Kabul after they captured the town of Maidan Shar, capital of Maidan Wardak Province,#Afganistan pic.twitter.com/KZyLn02lAQ — Muhammad Waqas Khan (@AllahuAkbarr313) August 14, 2021 -
తాలిబన్ల గుప్పిట్లో కాందహార్
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల దురాక్రమణ జోరందుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముఖ్య నగరాలను శరవేగంతో స్వాధీనం చేసుకుంటున్నారు. దేశంలో రెండో అతి పెద్ద నగరమైన కాందహార్‌ను ఆక్రమించుకున్నారు. దక్షిణాది ఆర్థిక హబ్‌గా పేరున్న కాందహార్‌లో గురువారం రాత్రి తాలిబన్లు, అఫ్గాన్ సైన్యానికి మధ్య భీకర ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి దాటాక తాలిబన్లు కాందహార్‌ని స్వాధీన పరచుకొని ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ జెండాలు ఎగురవేసినట్టు అధికారులు చెప్పారు. మరో వారంలో రాజధాని కాబూల్ సహా మొత్తం దేశం తమ వశమవుతుందని తాలిబన్ల ప్రతినిధి ఒకరు చెప్పారు. తాము విదేశీ సంస్థలపై దాడులకు దిగబోమని, ఈ సంక్షోభం సమయంలో అన్ని దేశాలు తమకు సహకరించాలని ఆ ప్రతినిధి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అఫ్గాన్ దక్షిణ భాగమంతా తాలిబన్ల పెత్తనం కిందకు వచ్చేసింది. కాబూల్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెల్మాండ్ నగరాన్ని ఆక్రమించుకోవడంతో ఇక దేశం యావత్తూ వారి చేతుల్లోకి వెళ్లిపోవడం ఎంతో దూరం లేదనే ఆందోళన పెరుగుతోంది. ఘాజ్నీ, హెరత్, లోగర్, ఫెరోజ్ కోహ్ వంటి కీలక నగరాల్లోనూ తాలిబన్లు పాగా వేశారు. ఆయా నగరాల్లోని స్థానిక నేతలు తాలిబన్ల ఎదుట లొంగిపోయారు. అమెరికా తుది విడత బలగాలను ఉపసంహరించడానికి వారం ముందే దేశంలో 66% భూభాగం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. దేశంలో 34 ప్రావిన్షియల్ రాజధానులు ఉండగా, సగం రాజధానులను ఇప్పటికే ఆక్రమించారు. కాబూల్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని లోగర్ ప్రావిన్స్‌లో ఇరుపక్షాల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. అమెరికా, యూకే సిబ్బంది వెనక్కి తాలిబన్లు రెచ్చిపోతుండగా పశ్చిమ దేశాలు తమ దౌత్య కార్యాలయాలను మూసేస్తూ, సిబ్బంది వెనక్కి తీసుకువస్తున్నారు. అమెరికా, బ్రిటన్, కెనడా అవే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఐరాస ఆందోళన అఫ్గానిస్తాన్‌లో రోజురోజుకూ మారుతున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య దోహాలో జరిగే చర్చలతో సంక్షోభం పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అధికారాన్ని కలిసి పంచుకుందామని అధ్యక్షుడు ఘనీ తాలిబన్లకు ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. మహిళలపై వేధింపులు షురూ అఫ్గానిస్తాన్‌పై పట్టు బిగిస్తున్న తాలిబన్ల అరాచకాలు మళ్లీ మొదలయ్యాయి. బందీలుగా చిక్కిన అఫ్గాన్ సైనికుల్ని ఉరి తీయడం, తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని పెళ్లి కాని అమ్మాయిల్ని ఉగ్రవాదులకు కట్టబెట్టాలని చూడడం వంటి పనులు చేస్తున్నట్టుగా మానవ హక్కుల సంఘాలు చెప్పినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. తమ వల్ల ఎవరికీ ఎలాంటి హానీ ఉండదని పదే పదే ప్రకటిస్తున్న తాలిబన్లు విరుద్ధంగా ప్రవరిస్తున్నారు.