![Left Afghanistan to avoid bloodshed, 'big human disaster - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/17/FILE.jpg.webp?itok=-nJ-elZQ)
భారీ రక్తపాతంతో అఫ్గాన్ గడ్డ తడవకుండా ఉండేందుకే తాను దేశం విడిచి వెళ్లానని ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తెలిపారు. దేశం వదిలిపోయిన తర్వాత తొలిసారి ఘనీ తన అభిప్రాయాలను వెల్లడించారు. అధ్యక్ష భవనంలోకి వస్తున్న సాయుధ తాలిబన్లకు అడ్డుగా నిలబడడం, 20 ఏళ్లుగా రక్షించుకుంటున్న దేశాన్ని కాపాడేందుందుకు శాంతియుతంగా వెళ్లిపోవడం అనే రెండు మార్గాలు తనకు ఎదురయ్యాయని చెప్పారు. తాలిబన్లు ఆయుధాలతో విజయం సాధించారని, దేశ ప్రజల అస్థిత్వాన్ని, గౌరవాన్ని, సంపదను కాపాడాల్సిన బాధ్యత ఇక వారిదేనని చెప్పారు. ‘ భయాందోళనలతో ఉన్న ప్రజల హృదయాలను వారు చట్టబద్ధంగా గెలవాల్సిఉంది. ప్రజలకు భరోసా ఇవ్వడంకోసం వాళ్లు ఒక ప్రణాళికను రూపొందించాలి’ అని ఘనీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment