అఫ్గానిస్తాన్ భద్రతా బలగాలు
కాబూల్: అఫ్గానిస్తాన్ భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతపై దృష్టిసారించాయి. దీంతో కేవలం 24 గంటల వ్యవధిలో 63 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు అఫ్గాన్ అధికారులు చెబుతున్నారు. ఇందులో ఐసిస్‌కు చెందిన 14 మంది ఉగ్రవాదులు ఉన్నట్లుగా భద్రతా విభాగం భావిస్తోంది.
ఫరా, కాందహర్, పాక్తియా, ఉరుజ్గన్, నంగర్‌హర్ ప్రావిన్సులలో తమ భద్రతా సిబ్బంది ఆపరేషన్ చేపట్టారని అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదులను మట్టుపెట్టిన తమ సిబ్బంది వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆ శాఖ అధికార ప్రతినిధులలో ఒకరైన మహ్మద్ రద్మానిష్ వెల్లడించారు. భద్రతా బలగాల ఆపరేషన్‌పై ఏ ఉగ్రసంస్థ కూడా స్పందించలేదని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment