అనంతపురం అర్బన్:‘రుణమాఫీ అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టినప్పుడల్లా ఏదో ఓ తప్పుడు ప్రకటన చే సి జనం దృష్టి మరల్చడం చంద్రబాబుకు అలవాటే. ఇలా గిమ్మిక్కులు చేసి గద్దెనెక్కిన బాబు.. ఇకపై కూడా జనాల్ని మోసగించాలని చూస్తే కుదరదు. ఆయన గిమ్మిక్కులను ఇప్పుడెవరూ నమ్మే స్థితిలో లేర’ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కార్యలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అబద్దాల చంద్రబాబును నిలదీయడానికి ఎప్పుడు ధర్నాలు చేపట్టినా, ఒక రోజు ముందు ఏదో ఒక ప్రకటన చేసి గండం నుంచి గట్టెక్కాలని చూస్తున్నారన్నారు. నవంబర్ 5న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు ముందు రోజు కూడా ఇలాంటి ప్రకటన చేశాడని గుర్తు చేశారు.
నేడు చేపట్టబోయే మహాధర్నాకు డ్వాక్రా మహిళలు, రైతులు, చేనేతలు, విద్యార్థులు, అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా తరలివస్తున్న నేపథ్యంలో భయం పుట్టుకున్న చంద్రబాబు.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి గురువారం రుణమాఫీపై మరో మోస పూరితమైన ప్రకటన గుప్పించారన్నారు. చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న మహాధర్నాను నిర్వీర్యం చేయడానికి బాబు కుట్ర పన్నారన్నారు.
ఇలాంటి ప్రభుత్వంపై నిత్యం పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడడానికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్ధమయ్యూడని తెలిపారు. నేడు కలెక్టరేట్ కార్యాలయం ముందు చేపడుతున్న మహాధర్నాకి పార్టీ రాష్ట్ర పరిశీలకులు విజయసాయిరెడ్డి, ఐటీ విభాగం నాయకులు చల్లా మధుసూదన్‌మోహన్‌రెడ్డి తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. సలామ్ బాబు, పార్టీ నేతలు హరీష్ యాదవ్, పెన్నోబలేసు, చింతకుంట మధు, మల్లికార్జున, సాకే ఆదినారాయణ పాల్గొన్నారు.
మాయ చేయడం బాబు నైజం
Published Fri, Dec 5 2014 3:15 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement