విజయనగరం: మున్సిపల్ కార్మికులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మున్సిపల్ కార్మికులు గత కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం వారు కలెక్టరేట్ ముట్టడి చేశారు.
వీరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టరేట్ ముట్టడిలో ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు కూడా కలిసి రావడంతో భారీ సంఖ్యలో నిరసన కారులు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడికి పోలీసులు కూడా చేరుకోవడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది.
కలెక్టరేట్ ముట్టడి.. ఉద్రిక్తత
Published Fri, Jul 24 2015 11:15 AM | Last Updated on Mon, Feb 17 2020 5:16 PM
Advertisement
Advertisement