గాంధీ ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికుల ధర్నా
Published Thu, Apr 6 2017 10:35 AM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 220 మంది ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు గురువారం ఉదయం ఆందోళనకు చేపట్టారు. తమకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ విధులు బహిష్కరించి ఆస్పత్రి ప్రాంగణం ముందుకు ధర్నాకు దిగారు. ఔ
వేతనాలు చెల్లించి తమను క్రమబద్ధీకరించేంత వరకు విధులకు హాజరు కాబోమంటూ నినాదాలు చేశారు.
పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనకు ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు. కార్మికుల ఆందోళన కారణంగా ఆస్పత్రిలోని పలు వార్డుల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వచ్చి రోగులు, వారి సహాయకులు ఇబ్బంది పడుతున్నారు.
Advertisement