జెరూసలెం: దక్షిణ లెబనాన్‌లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో అయిదుగురు మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని లెబనాన్ అధికారిక వార్తాసంస్థ వెల్లడించింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. వీరిలో తల్లిదండ్రులు సహా ఇద్దరు పిల్లలున్నారు. మరణించిన వారిలో మహిళ ప్రస్తుతం గర్భవతి.
ఇజ్రాయెల్ దాడిలో ఇళ్లంతా ధ్వంసమైంది. పేలుడు ధాటికి చుట్టుపక్కల నివసించేవారు తొమ్మిది మంది గాయాల పాలయ్యారు. గత వారంలోనూ దక్షిణ లెబనాన్‌లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఓ జంటతో పాటు వారి కుమారుడు మృతి చెందాడు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపు దాడులు చేసి వందల మందిని చంపిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి అటు గాజాలో హమాస్ ఇటు లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 30,960 మంది మరణించగా లెబనాన్‌లో 312 మంది హెజ్బొల్లా ఫైటర్లు, 56 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. వీలు దొరికినపుడల్లా హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు పలువురు ఇజజ్రాయెల్ సైనికులు సహా సాధారణ పౌరులు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment