
బీరుట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రమయ్యాయి. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడుల్లో ఖనా నగర మేయర్ అహ్మద్ కహిల్ మరణించినట్లుగా నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ వెల్లడించారు.ఈ దాడుల్లో ఖనా మేయర్‌తో సహా 15మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
పౌరుల ఇళ్ల మధ్య ఉన్న హెజ్‌బొల్లా తీవ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ మంగళవారం అర్ధరాత్రి భీకర దాడులు చేసింది.ఈ దాడుల్లో మేయర్ సహా పలువురు మృతి చెందారు.దాడిలో ధ్వంసమైన భవనాల శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీశామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌పై 50 రాకెట్లతో హెజ్బొల్లా దాడి
Comments
Please login to add a commentAdd a comment