సూర్యాపేట : సర్పంచ్ అందుబాటులో ఉండడం లేదని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామస్తులు సోమవారం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని బహిష్కరించారు. గ్రామజ్యోతి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సోమవారం ఉదయం అధికారులు గ్రామానికి వెళ్లారు. కాగా వార్డు సభ్యులు, ప్రజలందరూ సంతకాలు చేసి తాము గ్రామజ్యోతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. తమ సర్పంచ్ రవినాయక్ గ్రామంలో ఉండటం లేదని, ఫలితంగా గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడంలేదని, గ్రామ సమస్యలు పరిష్కారం కావడంలేదని వారు పేర్కొన్నారు.
ఇమాంపేటలో గ్రామజ్యోతి బహిష్కరణ
Published Mon, Aug 17 2015 12:22 PM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM
Advertisement