
రేపు సీపీఐ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: మిర్చి, కందులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మార్కెట్ యార్డుల ఎదుట ధర్నాలు చేపట్టాలని సీపీఐ నిర్ణయించింది. రాష్ట్రంలో మంచినీటి ఎద్దడి మొద లైన నేపథ్యంలో ఉపాధి కూలీలకు ప్రభు త్వం తాగునీరు సరఫరా చేయాలని, పని కల్పించాలని, ఎండలు ముదిరిన పుడు ఉచితంగా బియ్యం, పప్పులు అం దించాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి ఈ నెల 15 వరకు నిరసనలు చేపట్టనున్నట్టు ప్రకటించింది.
ఇబ్బందు ల్లో ఉన్న రైతాంగానికి అండగా నిలబడేలా ఈ నిరసనలు చేస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. మిర్చి పంటకు మద్దతు ధర ప్రకటించకపోవడం కేంద్రం నిర్లక్ష్యానికి అద్దంపడుతోందన్నారు. నిధుల కొరత తో మిర్చి, కందుల కొనుగోలు చేయలేక పోతున్నామని, సాయం అందించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి చేతులు దులుపుకుందన్నారు.