
హెజ్‌బొల్లా తాత్కాలిక చీఫ్ ప్రకటన
బీరుట్: ఇజ్రాయెల్‌తో తమ పోరాటం కొన సాగుతుందని హెజ్ బొల్లా తాత్కాలిక చీఫ్ నయీం కస్సెమ్ స్పష్టం చేశారు. చీఫ్ హస్సన్ నస్రల్లాతో పాటు ఇతర టాప్ కమాండర్లను పోగొట్టుకున్నా సరే తాము వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. లెబనాన్‌లో భూతల దాడులు జరపాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకున్న పక్షంలో అందుకు తమ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు.
పోగొట్టుకున్న కమాండర్ల స్థానాలను భర్తీ చేశామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటన టీవీల్లో ప్రసారమైంది. ‘మా పోరాట సామర్థ్యాన్ని దెబ్బతీయడం ఇజ్రాయెల్ వల్లకాదు. డిప్యూటీ కమాండర్లు సిద్ధంగా ఉన్నారు. కమాండర్ ఎవరైనా గాయపడితే వారితో భర్తీ చేస్తాం. 2006లో ఇజ్రాయెల్‌తో నెలపాటు పోరాడాం. ఈసారి అంతకంటే ఎక్కువ కాలమే పోరు సాగుతుందని అనుకుంటున్నాం’అని నయీం కస్సెమ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment