హిజ్బుల్లాకు భారీ షాక్‌ : ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ ఖతం | IDF says it killed Hezbollah intelligence chief in overnight strike | Sakshi
Sakshi News home page

హిజ్బుల్లాకు భారీ షాక్‌ : ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ ఖతం

Mar 2 2026 7:03 PM | Updated on Mar 3 2026 11:55 AM

IDF says it killed Hezbollah intelligence chief in overnight strike

లెబనాన్ రాజధాని బీరుట్‌ లక్ష్యంగా చేసుకున్న వైమానిక దాడిలో హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ (Intelligence)చీఫ్ హుస్సేన్ మక్లెడ్‌ మరణించాడు. హిజ్బుల్లా దాడులకు ప్రతీకారంగా జరిపిన రాత్రంతా తాము జరిపిన భీకర దాడుల్లో హుస్సేన్ మక్లెడ్ (Hussein Makled) మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) అధికారికంగా ధృవీకరించింది.

ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ హత్య, ఉత్తర భాగంలో తీవ్రమవుతున్న పోరాటం నేపథ్యంలో రక్షణ దళాలు హిజ్బుల్లా సీనియర్ కమాండ్‌ను మట్టుబెట్టం కీలంగా మారింది. ప్రకటించాయి. బీరూట్‌లోని హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. హిజ్బుల్లాతో సంబంధం ఉన్న సైనిక మౌలిక సదుపాయాలపై రాబోయే దాడులకు ముందు టైర్, మష్ఘరా, డీర్ కానౌన్ అల్-నహర్‌లోని నివాసితులను లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాల నుండి కనీసం 300 మీటర్ల దూరం ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలు హెచ్చరించాయి.

ఇదీ చదవండి:  భీకర దాడుల వేళ, దుబాయ్‌ సంచలన నిర్ణయం

రాత్రిపూట ఇజ్రాయెల్‌పై దాడి చేసినందుకు హిజ్బుల్లా  భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని DF ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగానే బీరుట్‌లో సహా లెబనాన్‌లోని డజన్ల కొద్దీ హిజ్బుల్లా లక్ష్యాలను IDF ధ్వంసం చేసింది. గత కొంతకాలంగా ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో హుస్సేన్ మరణం హిజ్బుల్లాకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. హుస్సేన్ మక్లెడ్ హిజ్బుల్లా నిఘా విభాగానికి కీలక బాధ్యత వహిస్తూ, ఆ సంస్థ  గూఢచారి వ్యవస్థను నడిపించేవాడు.

ఇదీ చదవండి: న్యూక్లియర్‌ వాచ్‌ డాగ్‌ వార్నింగ్‌, స్పందించని ఇరాన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement