జెరూసలెం: లెబనాన్ రాజధాని బీరుట్‌తో పాటు దాని చుట్టుపక్కలప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను వదిలివెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) హెచ్చరించింది.ఈమేరకు ఐడీఎఫ్ ఎక్స్(ట్విటర్)లో ఓ వీడియోని పోస్టు చేసింది.
తమ యుద్ధం హెజ్‌బొల్లాతోనే కానీ లెబనాన్ ప్రజలతో కాదని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ పౌరులు లక్ష్యంగా హెజ్‌బొల్లా దాదాపు లక్షా 50వేల రాకెట్లు లెబనాన్‌లో ఉంచిందని తెలిపింది.వాటిల్లో కొన్నింటిని వ్యూహాత్మకంగా పౌరులు నివసించే ప్రాంతాల్లో ఉంచిందని, వాటిని తాము నిర్వీర్యం చేయనున్నామని వెల్లడించింది. ఇందులో భాగంగా దాడులు జరిగే అవకాశమున్నందున ప్రజలు ఆ ప్రాంతాలను విడిచి వెళ్లాలని ఐడీఎఫ్ కోరింది.
ఉత్తర ఇజ్రాయెల్‌లోని పౌరులను హెజ్‌బొల్లా లక్ష్యంగా చేసుకున్నట్లు ఐడీఎఫ్ చీఫ్ తెలిపారు.లెబనాన్ నుంచి వచ్చిన రాకెట్‌తో ఆ ప్రాంతం మొత్తం దెబ్బతిన్నట్లు వెల్లడించారు.తమ పౌరులను లక్ష్యంగా చేసుకున్న హెజ్‌బొల్లా నుంచి తమ దేశ ప్రజలతో పాటు వనరులను రక్షించుకుంటామని చెప్పారు.
ఇదీచదవండి: హూ ఈజ్ నస్రల్లా..ఇజ్రాయెల్ మోస్ట్‌వాంటెడ్ ఇతడే
Comments
Please login to add a commentAdd a comment