ఇజ్రాయెల్‌కు షాక్‌ ఇవ్వనున్న హెజ్‌బొల్లా! | Hezbollah Targets Mossad Headquarters Military Base | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌కు షాక్‌ ఇవ్వనున్న హెజ్‌బొల్లా!

Published Tue, Oct 1 2024 8:23 PM | Last Updated on Wed, Oct 2 2024 9:31 AM

Hezbollah Targets Mossad Headquarters Military Base

హెజ్‌బొల్లాను నిర్వీర్యం చేసే లక్ష్యంతో లెబనాన్‌లో ఆ గ్రూప్‌పై ఇజ్రాయెల్‌ వరుస దాడులతో విరుచుకుపడుతోంది. భూతల దాడులు చేపట్టేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ సేనలు ఆ దేశంలోకి ప్రవేశించాయి. ఈ తరుణంలో సరిహద్దు ప్రాంతాల్లోని లెబనాన్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. 

అయితే మరోవైపు.. మంగళవారం ఇజ్రాయెల్‌ టెల్ అవీవ్ సమీపంలోని గ్లిలాట్ మిలిటరీ ఇంటెలిజెన్స్ స్థావరం, మొసాద్‌ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా దాడి చేసినట్లు లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హెజ్‌బొల్లా ఓ ప్రకటనలో పేర్కొంది. మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ 8200కు చెందిన గ్లిలాట్ బేస్, టెల్ అవీవ్ శివార్లలో ఉన్న మొసాద్ ప్రధాన కార్యాలయం వద్ద ఫాడి 4 రాకెట్లను​ ప్రయోగించినట్లు పేర్కొంది.

శుక్రవారం బీరుట్ శివార్లలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో తమ చీఫ్‌ హసన్ నస్రల్లాను ఇజజ్రాయెల్‌ అంతం చేసిన తర్వాత ‘‘ మీ సేవలో నస్రల్లా’’ అనే పేరుతో ఈ ఆపరేషన్‌ను చేపట్టినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్‌  ప్రధాన మిలిటరీ ఇంటెలిజెన్స్ గ్లిలోట్ బేస్ లక్ష్యంగా తమ బృందం ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడి చేసిందని ఆగస్టు చివరిలో నస్రల్లా పేర్కొన్నారు. అయితే.. ఆ సమయంలో తమ స్థావరాలపై దాడి చేయడంలో హెజ్‌బొల్లా విఫలమైందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇక.. హెజ్‌బొల్లా  ప్రకటనపై  ఇజ్రాయెల్ స్పందించకపోవటం గమనార్హం​.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement