
ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న గోలన్ హైట్స్ ప్రాంతంలో హిజ్బుల్లా మిలిటెంట్లు చేసిన రాకెట్ దాడిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందిచారు. దాడులు తెగపడినందకు భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని హిజ్బుల్లా మిలిటెంట్లను హెచ్చరించారు. శనివారం హిజ్బుల్లా చేసిన రాకెట్ దాడిలో 11 మంది యువకులను మృతి చెందారు.
‘‘ హిజ్బుల్లా చేసిన ఈ దాడిని ఇజ్రాయెల్ తగిన సమాధానం ఇవ్వకుండా ఉండదు. హిజ్బుల్లా కచ్చితంగా భారీ మూల్యం చెల్లిచుకోక తప్పదు’’ అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. అదేవిధంగా ఇజ్రాయెల్ సైన్యం ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలని ప్రధాని నెతన్యాహు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
‘‘ శనివారం సాయంత్రం జరిగిన దాడితో హిజ్బుల్లా అసలు రూపం బయటపడింది. హిజ్బుల్లా ఫుడ్‌బాల్ ఆడుతున్న పిల్లలను టార్గెట్ చేసి దారుణంగా దాడి చేశారు’’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్( ఐడీఎఫ్) అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి అన్నారు. ‘‘ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పోటీ పడుతుండగా.. హిజ్బుల్లా మాత్రం ఇజ్రాయెల్ భవిష్యత్తు తరాల అథ్లెట్లపై దాడులు చేస్తోంది. గోలన్ హైట్స్‌లోని డ్రూజ్ గ్రామంలోని మజ్దాల్ షామ్స్‌లోని మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతున్న యువకులపై హిజ్బుల్లా రాకెట్ దాడి చేసింది’ అని ఐడీఎఫ్ ‘ఎక్స్’లో ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment