హమాస్ మిలిటెంట్ల అంతమే లక్ష్యంగా గాజాలో దాడులు చేస్తున్న ఇజ్రయెల్‌కు హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌పై ఊహించని చర్యలు తీసుకుంటామని ఇరాన్ మద్దతు గల హెజ్జుల్లా సంస్థ జనరల్ సెక్రటరీ హసన్ నస్రల్లా వార్నింగ్ ఇచ్చారు. 24వ రెసిస్టెన్స్ అండ్ లిబరేషన్ డే (లెబనాన్) కార్యక్రమంలో భాగంగా హసన్ నస్రల్లా టీవీలో శుక్రవారం ప్రసంగించారు.
‘‘ మా ప్రతిఘటన నుంచి ఇజ్రాయెల్ ఊహించని ఆశ్చర్యాలు ఎదుర్కొటుంది. ఇజ్రాయెల్ తన ఊహాత్మక లక్ష్యాలను సాధించటంలో దారుణం విఫలమైంది( ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ త్జాచి హనెగ్బి ఉద్దేశించి). ఇజ్రాయెల్ ఏం సాధించలేదని, దాని లక్ష్యాలు సాధ్యం కాదు. దానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇది ఇజ్రాయెల్‌కు తీవ్రమైన ఎదురుదెబ్బ’’ అని హసన్ నస్రల్లా తెలిపారు.
అంతర్జాతీయంగా పాలస్తీనా ప్రత్యేక దేశంగా గుర్తింస్తు పలు దేశాల మద్దతు పెరుగుతోందన్నారు. ఇజ్రాయెల్ అంతర్జాతీయ తీర్మానాలను ఉల్లంఘిస్తోందని, సైనిక చర్యలను నిలిపివేయాలని అంతర్జాతీయ స్థానం ఆదేశించినప్పటికీ రఫాలో హింసాత్మక కార్యకలాపాలను కొనసాగిస్తోందని ఆరోపించారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను హెజ్జుల్లా మిలిటెంట్ సంస్థ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment