millitant
-
ఊహించని చర్యలు.. ఇజ్రాయెల్‌కు హెజ్బుల్లా హెచ్చరిక
హమాస్ మిలిటెంట్ల అంతమే లక్ష్యంగా గాజాలో దాడులు చేస్తున్న ఇజ్రయెల్‌కు హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌పై ఊహించని చర్యలు తీసుకుంటామని ఇరాన్ మద్దతు గల హెజ్జుల్లా సంస్థ జనరల్ సెక్రటరీ హసన్ నస్రల్లా వార్నింగ్ ఇచ్చారు. 24వ రెసిస్టెన్స్ అండ్ లిబరేషన్ డే (లెబనాన్) కార్యక్రమంలో భాగంగా హసన్ నస్రల్లా టీవీలో శుక్రవారం ప్రసంగించారు.‘‘ మా ప్రతిఘటన నుంచి ఇజ్రాయెల్ ఊహించని ఆశ్చర్యాలు ఎదుర్కొటుంది. ఇజ్రాయెల్ తన ఊహాత్మక లక్ష్యాలను సాధించటంలో దారుణం విఫలమైంది( ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ త్జాచి హనెగ్బి ఉద్దేశించి). ఇజ్రాయెల్ ఏం సాధించలేదని, దాని లక్ష్యాలు సాధ్యం కాదు. దానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇది ఇజ్రాయెల్‌కు తీవ్రమైన ఎదురుదెబ్బ’’ అని హసన్ నస్రల్లా తెలిపారు.అంతర్జాతీయంగా పాలస్తీనా ప్రత్యేక దేశంగా గుర్తింస్తు పలు దేశాల మద్దతు పెరుగుతోందన్నారు. ఇజ్రాయెల్ అంతర్జాతీయ తీర్మానాలను ఉల్లంఘిస్తోందని, సైనిక చర్యలను నిలిపివేయాలని అంతర్జాతీయ స్థానం ఆదేశించినప్పటికీ రఫాలో హింసాత్మక కార్యకలాపాలను కొనసాగిస్తోందని ఆరోపించారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను హెజ్జుల్లా మిలిటెంట్ సంస్థ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేస్తున్న విషయం తెలిసిందే. -
ఉత్తర కొరియాపై సైనిక చర్యకు సిద్ధం: ట్రంప్
వాషింగ్టన్: అణ్వస్త్ర పరీక్షలతో దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తర కొరియాపై సైనిక చర్యకు తాము సిద్ధంగా ఉన్నామనీ, అయితే ఆ మార్గాన్ని తాము ఇంకా ఎంచుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఉ.కొరియాను అణు నిరాయుధీకరించడంలో ఇతర దేశాలు కూడా తమతో కలవాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ‘సైనిక చర్యకు మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం. కానీ దానిని ఇంకా మేం ఎంచుకోలేదు. మేం సైనిక చర్య చేపడితే మాత్రం అది విధ్వంసకరంగా ఉంటుంది. ఉ.కొరియా తీరు మార్చుకోకపోతే, మేం ఆ పనే చేయాల్సి ఉంటుంది’ అని ట్రంప్ స్పెయిన్ ప్రధాని మరియానో రజోయ్‌తో కలసి పాల్గొన్న విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. -
బైక్‌పై వస్తున్న ఉగ్రవాది కాల్చివేత
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ అనుమానిత ఉగ్రవాదిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని అధికారులు వెల్లడించారు. నగరంలోని కిల్‌గావ్ ప్రాంతంలో ఉన్న ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్(ఆర్ఏబీ) యూనిట్ వద్దకు శనివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి మోటార్ సైకిల్‌పై దూసుకొచ్చాడు. చెక్‌పోస్ట్ వద్ద సిబ్బంది ఆదేశాలను లెక్కచేయకుండా దూసుకొచ్చిన అతడిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఉన్నటువంటి బ్యాగులో పేలుడు పదార్ధాలు గుర్తించామని ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్(డీఎమ్పీ) అధికారులు వెల్లడించారు. బాంబు డిస్పోజల్ యూనిట్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. శుక్రవారం ఢాకాలోని ఓ ఆర్ఏబీ స్థావరం వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడుల నేపథ్యంలో భద్రతను కట్టదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు.