
ఇజ్రాయెల్‌లో ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బుల్లా దాడులకు తెగబడింది. రాకెట్ల దాడులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ, తీవ్ర ఆస్తి నష్టం జరిగింది.
అయితే, హెజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్ తలెబ్ సమీ అబ్ధుల్లా హత్యకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్‌పై దాడులు చేసినట్టు హెజ్బుల్లా ప్రకటించింది. దాదాపు 170 రాకెట్లతో హెజ్బుల్లా.. ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య ఘర్షణ ప్రారంభమైన తర్వాత జరిగిన ఇదే అతిపెద్ద దాడి అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఓ ప్రకటనలో తెలిపింది. ఇక, ఇప్పటి వరకు లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 400 మంది హెజ్బుల్లా సభ్యులు మరణించినట్టు సమాచారం.
#Hezbollah fires dozens of suicide drone 🚀 to attack #zionist Military division headquarters in Nahariya . All the drones Destroyed their designated target and the military headquarters are burning 🔥 now . #Lebanon #israel war #FreePalestine https://t.co/4rRHLtIQ4v
— Hasib Holy (@HasibHoly) June 13, 2024
మరోవైపు.. హెజ్బుల్లా దాడుల నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్ సైతం దాడులను తీవ్ర తరం చేసింది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికాతో సహా అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న వేళ హెజ్బుల్లా ఈ దాడికి పాల్పడటంతో చర్చనీయాంశంగా మారింది.
Israeli soldiers attack Hezbollah forces using ancient Roman war weapons "Catapult" on the Israel-Lebanon border. pic.twitter.com/HzgQsnFEV4
— James Wuttichai (@Military9News) June 13, 2024