
ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా లెబనాన్‌లో హిజ్బుల్లాకు చెందిన వందలాది పేజర్లు ఒకేసారి పేలడంతో తీవ్ర కలకలం సృష్టించింది. ఇక, ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని హిజ్బుల్లా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ను హిజ్బుల్లా హెచ్చరించింది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
కాగా, ఇజ్రాయెల్‌తో యుద్ధానికి కాలుదువ్వుతున్న హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మిలిటెంట్ సంస్థకు చెందిన వందలాది పేజర్లు ఏకకాలంలో పేలడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పేజర్లను వాడితే ఇజ్రాయెల్‌కు దొరక్కుండా ఉండొచ్చని హిజ్బుల్లా వ్యూహకర్తల ప్లాన్. ఎప్పటి నుంచో కీలక సందేశాలను పంపడానికి వీటినే వాడుతోంది. ఇటీవల తైవాన్ సంస్థ గోల్డ్ అపోలోకు చెందిన కొత్త బ్యాచ్‌లో దాదాపు 3,000 పేజర్లను లెబనాన్‌కు దిగుమతి చేసుకుంది. వాటిలో అత్యధికంగా ఆ కంపెనీకి చెందిన ‘పీ924’మోడల్‌వే ఉన్నాయి. దీంతోపాటు మరో మూడు మోడల్స్ కూడా హిజ్బుల్లా వద్దకు చేరాయి.
The Zionist terrorist didn’t target Hezbollah members. They targeted everyone with a pager including doctors and nurses, killing a child. This is a nation wide terrorist attack. pic.twitter.com/9ojtlDMuHg
— Syrian Girl 🇸🇾 (@Partisangirl) September 17, 2024
అయితే, హిజ్బుల్లాకు చేరిన పేజ్లరలో మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాన్ని బ్యాటరీ పక్కనే అమర్చినట్టు యూరోపోల్‌కు సైబర్ అడ్వైజర్ మిక్కో హైపోనూన్ వెల్లడించారు. తయారీ ప్రదేశంలో లేదా.. సరఫరా వ్యవస్థలో ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చొరబడి వీటిని అమర్చి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా, ఈ మొత్తం ఆపరేషన్‌లో కచ్చితంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ సభ్యులు నేరుగా పాల్గొని ఉంటారని హిజ్బుల్లా అనుమానిస్తోంది. పేజర్ల దాడిలో దాదాపు మూడు వేల మంది గాయపడగా.. తొమ్మిది మంది మరణించారు. గాయపడిన వారిలో 200 మంది పరిస్థితి విషమంగా ఉంది.
ప్రతీకారం తప్పదు: హెజ్బొల్లా
పేజర్ల పేలుడు ఘటన నేపథ్యంలో ప్రతీకారం తప్పదంటూ హిజ్బుల్లా ప్రకటన విడుదల చేసింది. మిలిటెంట్లు వాడుతున్న పేజర్లనే ఇజ్రాయెల్ వారిపైకి ఆయుధాలుగా మార్చి ప్రయోగించిందని అభిప్రాయపడింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో అవి ఏకకాలంలో పేలేలా చేసిందని అనుమానం వ్యక్తం చేసింది. ఇక, హిజ్బుల్లా హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది.
ఇది కూడా చదవండి: ట్రంప్ ఎన్నికల స్టంట్.. రంగంలోకి మోదీ!
Comments
Please login to add a commentAdd a comment