బీరుట్: లెబనాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఇజ్రాయెల్ ఆదివారం(మార్చ్ 24) తెల్లవారుజామున వైమానిక దాడులు జరిపింది. మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లాకు గట్టిపట్టున్న ప్రాంతమైన బల్బీక్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు గాయపడ్డట్లు బల్బీక్ మేయర్ తెలిపారు.
ఇజ్రాయెల్ మిసైల్ రక్షణ వ్యవస్థ అయిన ఐరన్ డోమ్‌పై డ్రోన్‌లతో దాడులు జరిపినట్లు హెజ్బొల్లా ప్రకటించిన గంటల్లోనే ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులకు దిగింది. లెబనాన్ నుంచి 50 రాకెట్లు తమవైపు వచ్చినందునే దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ రాకెట్‌లలో కొన్నింటిని కూల్చివేశామని, మరికొన్ని మనుషులు లేని చోట పడిపోయాయని వెల్లడించింది.
కాగా, మార్చ్ 12న బల్బీక్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు మృతి చెందగా 20 మంది దాకా గాయపడ్డారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు పెరిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment