వాషింగ్టన్: కాల్పుల విరమణ అంశాన్ని ప్రస్తావించడం హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపు వెనుకంజను తెలియజేస్తోందని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. మంగళవారం(అక్టోబర్8) వాషింగ్టన్‌లో ఆయన మీడియాతో మట్లాడారు. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా చితికిపోయిందన్నారు.
‘సంవత్సరం నుంచి హెజ్బొల్లాను ప్రపంచం మొత్తం కాల్పుల విరమణ చేయాలని అడుగుతోంది. దీనిని హెజ్బొల్లా తిరస్కరిస్తూ వస్తోంది. ఇప్పుడేమో హెజ్బొల్లానే కాల్పుల విరమణ అడుగుతోంది. ఈ యుద్ధానికి దౌత్య పరమైన పరిష్కారమే అంతిమంగా మేం కోరుకుంటున్నాం’అని చెప్పారు.
కాగా, హెజ్బొల్లా డిప్యూటీ లీడర్ కాసిమ్ మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ కాల్పుల విరమణ కోసం లెబనాన్ పార్లమెంట్ స్పీకర్ బెర్రీ చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతుంటుందన్నారు. ఇజ్రాయెల్ తమపై భీకర దాడులు చేస్తున్నప్పటికీ ఆ దేశానికి ధీటైన జవాబిస్తున్నామని కాసిమ్ తెలిపారు.
ఇదీ చదవండి: వేల మంది ఇజ్రాయెల్ పౌరులు నిరాశ్రయులవుతారు
Comments
Please login to add a commentAdd a comment