
జెరూసలెం:లెబనాన్ తీవ్రవాద సంస్థ హెజ్‌బొల్లాకు వరుసగా రెండో ఎదురుదెబ్బ తగిలింది.ఇజ్రాయెల్ ఆదివారం(సెప్టెంబర్29) జరిపిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా మరో ముఖ్యనేత నబిల్‌కౌక్ మరణించాడు.తమ రాకెట్ దాడుల్లో హెజ్‌బొల్లా డిప్యూటీ హెడ్ నబిల్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
ఇజ్రాయెల్ సైన్యం ప్రకటనపై హెజ్‌బొల్లా ఇప్పటివరకు స్పందించలేదు.తాజాగా శుక్రవారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా (64) మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ దాడి నుంచి కోలుకోకముందే హెజ్బొల్లా మరో కీలక నేతను కోల్పోయింది.నబిల్ 1995 నుంచి 2010 వరకు సౌత్ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు.నబిల్‌పై 2020లో అమెరికా ఆంక్షలు విధించింది.
ఇదీచదవండి: బంకర్‌బాంబు దాడిలో నస్రల్లా మృతి
Comments
Please login to add a commentAdd a comment