![182 Killed, Over 700 Injured In Israeli Strikes in Lebanon](/styles/webp/s3/article_images/2024/09/23/Israeli.jpg.webp?itok=DRnPjY1C)
హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. సోమవారం ఒక్కరోజే 300 లకుపైగా లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ వైమానిక దాడుల్లో 182 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 700 మందికి గాయాలైనట్లు పేర్కొంది.
ఈ రోజు ఉదయం నుండి దక్షిణ పట్టణాలు, గ్రామాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో 182 మంది మరణించారు. వారిలో పిల్లలు, మహిళలు,మెడికల్ సిబ్బంది ఎక్కువ మంది ఉన్నట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ ప్రతినిధులు ప్రకటించారు.
ఈ దాడులపై ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి స్పందించారు. లెబనాన్‌లోని సామాన్య ప్రజలు హిజ్బుల్లాకు అనుసంధానంగా ఉన్న ప్రదేశాల నుంచి దూరంగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించారు. అంతేకాదు తమ సైన్యం లెబనాన్ అంతటా విస్తరించిన హిజ్బుల్లా ఖచ్చితమైన స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుందని హగారి స్పష్టం చేశారు. లెబనాన్ పౌరులు భద్రత దృష్ట్యా వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
చదవండి : పడవలో కుళ్లిన 10 మృతదేహాలు
Comments
Please login to add a commentAdd a comment