ఇజ్రాయెల్ పౌరులు మరింత మంది నిరాశ్రయులవుతారని హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్ నైమ్ ఖాసీం అన్నారు. ఇజ్రాయెల్‌లో తమ రాకెట్ దాడులను మరింత విస్తరించినట్లు తెలిపారు. ఆయన మంగళవారం టెలివిజన్ ప్రసంగంలో మాట్లారు. అక్టోబరు 7 దాడుల మొదటి సంవత్సరం వార్షికోత్సవం తర్వాత తొలిరోజు చేసిన ఆయన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది.
‘‘ఇజ్రాయెల్‌పలో మా రాకెట్ దాడులు విస్తరించాం. మేము చేసే దాడుల్లో మరింత మంది ఇజ్రాయెల్ పౌరులు నిరాశ్రయులవుతారు. హెజ్‌బొల్లా సామర్థ్యాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇటీవలి దాడుల్లో మృతిచెందిన కమాండర్‌ల స్థానాలను కొత్తవారితో భర్తీ చేశాం.
Hizbullah Genel Sekreter Yardımcısı Naim Kasım şu anda canlı yayında bir açıklama yapıyor. Lübnan başkanlık sarayındaki basın mensupları pür dikkat dinliyor. pic.twitter.com/bNV64IwsH9
— Faruk Hanedar (@farukhanedar) October 8, 2024
ప్రతిఘటన కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశాం. వందలాది రాకెట్లు, డజన్ల కొద్ది డ్రోన్లను పేల్చుతున్నాం. ఇజ్రాయెల్ నుంచి నిరాశ్రయులుగా వెళ్లిపోయిన వారిని తిరిగి తీసుకువస్తామని చెబుతోంది. కానీ మేము వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులను నిరాశ్రయులను చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మనల్ని బలహీనపరుస్తుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. కానీ, ప్రతిఘటించడం, పట్టుదలతో ఉండటమే మా వద్ద ఉన్న ఏకైక పరిష్కారం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment