హెజ్బొల్లా తీవ్రవాదులే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ తాజా దాడుల్లో ఏకంగా ఆరు వందల మంది దాకా మరణించారు. ఆ దేశంపై ఇజ్రాయెల్ ఇంతటి తీవ్ర దాడులకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అయితే హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కొత్తేమీ కాదు. ఇది నాలుగు దశాబ్దాల రక్తచరిత్ర...
1982: ఇజ్రాయిల్ ఆక్రమణ
–హెజ్‌జ్బొల్లా్ల పుట్టుక
హెజ్‌జ్బొల్లా, ఇజ్రాయెల్ సంఘర్షణకు 1982లో బీజం పడింది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌ఓ) దాడులకు ప్రతిస్పందనగా లెబనాన్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించింది. బీరుట్ నడిజ్బొడ్డులో పీఎల్‌ఓను ముట్టడించింది. ఈ మారణకాండలో 2,000 మంది పాలస్తీనా శరణార్థులు, 3,500 మంది లెబనాన్ పౌరులు మరణించారు. దీనికి ప్రతిస్పందనగా పుట్టుకొచి్చందే హెజ్బొల్లా. ఇరాన్ మద్దతుతో షియా ముస్లిం నేతలు దీన్ని ఏర్పాటు చేశారు. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలు, బెకా లోయలో అసంతృప్త యువతను భారీగా చేర్చుకుంటూ చూస్తుండగానే శక్తివంతమైన మిలీషియాగా ఎదిగింది.
1983–1985: రక్తపాతం–ప్రతిఘటన
హెజ్‌జ్బొల్లా, దాని గ్రూపులు లెబనాన్‌లోని విదేశీ దళాలపై 1982–1986 మధ్య పలు దాడులు చేశాయి. 1983లో బీరుట్‌లోని ఫ్రెంచ్, అమెరికా సైనిక శిబిరాలపై బాంబు దాడిలో 300 మందికి పైగా శాంతి పరిరక్షకులు మరణించారు. ఇది తమ పనేనని ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ప్రకటించినా, దాడి వెనుక హెజ్‌జ్బొల్లా హస్తముందని ప్రచారం జరిగింది. 1985 నాటికి దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనుదిరిగేంతగా హెజ్బొల్లా బలపడింది.
1992–1996: రాజకీయ ఎదుగుదల
1992లో లెబనాన్ అంతర్యుద్ధం అనంతరం హెజ్‌జ్బొల్లా రాజకీయ శక్తిగా ఎదిగింది. 128 మంది సభ్యులున్న పార్లమెంటులో 8 సీట్లు గెలుచుకుంది. షియా ప్రాబల్య ప్రాంతాల్లో సామాజిక సేవలతో రాజకీయంగా, సైనికంగా ప్రభావం పెంచుకుంది. ఇజ్రాయెల్ దళాలపై ప్రతిఘటననూ కొనసాగించింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ అకౌంటబిలిటీ’లో 118 మంది లెబనాన్ పౌరులు మరణించారు. 1996లో హెజ్‌జ్బొల్లాపై ఇజ్రాయిల్ ప్రారంభించిన ‘ఆపరేషన్ గ్రేప్స్ ఆఫ్ రాత్’తో హింస పరాకాష్టకు చేరింది.
2000–2006: ఇజ్రాయెల్ వెనుకంజ–జూలై యుద్ధం
రెండు దశాబ్దాల ఆక్రమణ తరువాత 2000 మేలో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ ఏకపక్షంగా వైదొలిగింది. హెజ్‌జ్బొల్లా ప్రతిఘటనే దీనికి కారణమంటారు. ఈ విజయం ఆ సంస్థను లెబనాన్‌లో ప్రబల రాజకీయ శక్తిగా, ఇజ్రాయెల్‌పై అరబ్ ప్రతిఘటనకు కేంద్రంగా మార్చింది. 2006లో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను హెజ్‌జ్బొల్లా బందించడంతో తీవ్ర ఉద్రిక్తతలకు, చివరికి యుద్ధానికి దారితీసింది. 34 రోజుల పాటు సాగిన ఈ ‘జూలై’ఘర్షణలో 1,200 మంది లెబనాన్ పౌరులు, 158
మంది ఇజ్రాయెలీలు మరణించారు.
2009–2024: ప్రాంతీయ సంఘర్షణ
2009 నాటికి హెజ్బొల్లా లెబనాన్‌లో పూర్తిస్థాయి సైనిక, రాజకీయ శక్తిగా మారింది. సిరియా అంతర్యుద్ధం సందర్భంగా ఇది కొట్టొచి్చనట్టు కని్పంచింది. 2012లో అసద్ ప్రభుత్వం తరఫున హెజ్‌జ్బొల్లా జోక్యం చేసుకోవడంతో అరబ్బుల మద్దతును కోల్పోవాల్సి వచి్చంది. కానీ అనంతరం ఇరాన్ మద్దతు హెజ్‌జ్బొల్లాకు కొత్త శక్తినిచి్చంది. 2023లో గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆ దేశంతో మరోసారి హెజ్‌జ్బొల్లా ప్రత్యక్ష ఘర్షణకు కారణమయ్యాయి. దాంతో ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
1982 to 2024: ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్‌జ్బొల్లా రక్తచరిత్ర
Published Thu, Sep 26 2024 6:28 AM | Last Updated on Thu, Sep 26 2024 9:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment