decades
-
42 ఏళ్ల రక్తచరిత్ర
హెజ్బొల్లా తీవ్రవాదులే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ తాజా దాడుల్లో ఏకంగా ఆరు వందల మంది దాకా మరణించారు. ఆ దేశంపై ఇజ్రాయెల్ ఇంతటి తీవ్ర దాడులకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అయితే హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కొత్తేమీ కాదు. ఇది నాలుగు దశాబ్దాల రక్తచరిత్ర... 1982: ఇజ్రాయిల్ ఆక్రమణ–హెజ్జ్బొల్లా్ల పుట్టుక హెజ్జ్బొల్లా, ఇజ్రాయెల్ సంఘర్షణకు 1982లో బీజం పడింది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ) దాడులకు ప్రతిస్పందనగా లెబనాన్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించింది. బీరుట్ నడిజ్బొడ్డులో పీఎల్‌ఓను ముట్టడించింది. ఈ మారణకాండలో 2,000 మంది పాలస్తీనా శరణార్థులు, 3,500 మంది లెబనాన్ పౌరులు మరణించారు. దీనికి ప్రతిస్పందనగా పుట్టుకొచి్చందే హెజ్బొల్లా. ఇరాన్ మద్దతుతో షియా ముస్లిం నేతలు దీన్ని ఏర్పాటు చేశారు. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలు, బెకా లోయలో అసంతృప్త యువతను భారీగా చేర్చుకుంటూ చూస్తుండగానే శక్తివంతమైన మిలీషియాగా ఎదిగింది.1983–1985: రక్తపాతం–ప్రతిఘటన హెజ్జ్బొల్లా, దాని గ్రూపులు లెబనాన్‌లోని విదేశీ దళాలపై 1982–1986 మధ్య పలు దాడులు చేశాయి. 1983లో బీరుట్‌లోని ఫ్రెంచ్, అమెరికా సైనిక శిబిరాలపై బాంబు దాడిలో 300 మందికి పైగా శాంతి పరిరక్షకులు మరణించారు. ఇది తమ పనేనని ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ప్రకటించినా, దాడి వెనుక హెజ్జ్బొల్లా హస్తముందని ప్రచారం జరిగింది. 1985 నాటికి దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనుదిరిగేంతగా హెజ్బొల్లా బలపడింది. 1992–1996: రాజకీయ ఎదుగుదల 1992లో లెబనాన్ అంతర్యుద్ధం అనంతరం హెజ్జ్బొల్లా రాజకీయ శక్తిగా ఎదిగింది. 128 మంది సభ్యులున్న పార్లమెంటులో 8 సీట్లు గెలుచుకుంది. షియా ప్రాబల్య ప్రాంతాల్లో సామాజిక సేవలతో రాజకీయంగా, సైనికంగా ప్రభావం పెంచుకుంది. ఇజ్రాయెల్ దళాలపై ప్రతిఘటననూ కొనసాగించింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ అకౌంటబిలిటీ’లో 118 మంది లెబనాన్ పౌరులు మరణించారు. 1996లో హెజ్జ్బొల్లాపై ఇజ్రాయిల్ ప్రారంభించిన ‘ఆపరేషన్ గ్రేప్స్ ఆఫ్ రాత్’తో హింస పరాకాష్టకు చేరింది. 2000–2006: ఇజ్రాయెల్ వెనుకంజ–జూలై యుద్ధం రెండు దశాబ్దాల ఆక్రమణ తరువాత 2000 మేలో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ ఏకపక్షంగా వైదొలిగింది. హెజ్జ్బొల్లా ప్రతిఘటనే దీనికి కారణమంటారు. ఈ విజయం ఆ సంస్థను లెబనాన్‌లో ప్రబల రాజకీయ శక్తిగా, ఇజ్రాయెల్‌పై అరబ్ ప్రతిఘటనకు కేంద్రంగా మార్చింది. 2006లో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను హెజ్జ్బొల్లా బందించడంతో తీవ్ర ఉద్రిక్తతలకు, చివరికి యుద్ధానికి దారితీసింది. 34 రోజుల పాటు సాగిన ఈ ‘జూలై’ఘర్షణలో 1,200 మంది లెబనాన్ పౌరులు, 158 మంది ఇజ్రాయెలీలు మరణించారు. 2009–2024: ప్రాంతీయ సంఘర్షణ 2009 నాటికి హెజ్బొల్లా లెబనాన్‌లో పూర్తిస్థాయి సైనిక, రాజకీయ శక్తిగా మారింది. సిరియా అంతర్యుద్ధం సందర్భంగా ఇది కొట్టొచి్చనట్టు కని్పంచింది. 2012లో అసద్ ప్రభుత్వం తరఫున హెజ్జ్బొల్లా జోక్యం చేసుకోవడంతో అరబ్బుల మద్దతును కోల్పోవాల్సి వచి్చంది. కానీ అనంతరం ఇరాన్ మద్దతు హెజ్జ్బొల్లాకు కొత్త శక్తినిచి్చంది. 2023లో గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆ దేశంతో మరోసారి హెజ్జ్బొల్లా ప్రత్యక్ష ఘర్షణకు కారణమయ్యాయి. దాంతో ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కళ‘నైనా’ కనని, కాలం చెల్లని : సహనం నుంచి సంకల్పబలం వరకు!
కొన్ని దశాబ్దాల క్రితం...నైనా దలాల్ వేసిన చిత్రాలు ఆనాటి కళాభిమానులకు షాకింగ్‌గా అనిపించాయి. ఆమె చిత్రాలు కాలం కంటే చా...లా ముందు ఉండడమే దీనికి కారణం.లండన్‌లో వెస్ట్రన్ ఆర్ట్‌ను అధ్యయనం చేసిన తొలి భారతీయ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన తొంభై సంవత్సరాల నైనా దలాల్ సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ న్యూ దిల్లీలోని ట్రావెన్ కోర్ హౌస్‌లో జరుగుతోంది. సాధారణ ప్రజల కథలను చెప్పడమే లక్ష్యంగా నైనా దలాల్ కుంచె సామాన్యుల జీవితాల్లోకి వెళ్లింది. ఆమె చిత్రాలలో నాస్టాల్జీయా తొంగి చూస్తుంది. View this post on Instagram A post shared by Galleriesplash (@galleriesplash) ‘నైనా దలాల్ ఆర్ట్ వర్క్‌ను చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు’ అంటారు కొద్దిమంది విశ్లేషకులు. కామన్వెల్త్ స్కాలర్షిప్ అందుకొని లండన్‌కు వెళ్లింది దలాల్. లండన్‌లో వెస్ట్రన్ ఆర్ట్‌ను అధ్యయనం చేసిన మొదటి భారతీయ ఆర్టిస్ట్‌గా తన ప్రత్యేకత చాటుకుంది. నైనా దలాల్ ప్రింట్ మేకింగ్ కోర్సులో చేరినప్పుడు చాలామంది ఆశ్చర్య΄ోయారు. ఎందుకంటే ప్రింట్ మేకింగ్ అనేది పురుషాధిక్య మాధ్యమంగా గుర్తింపు పొందింది. భారీ యంత్రాలతో పనిచేయాల్సి వచ్చేది. అయితే నైనా దలాల్ అసాధారణ ప్రతిభ ముందు అపోహలు నిలబడలేక పోయాయి. ఫెమినిజంకు సంబం«ధించి ఫస్ట్ వేవ్ బలాన్ని సంతరించుకుంటున్న కాలంలో, మన దేశంలోని మహిళా కళాకారులు ఫెమినిస్ట్ భావాలతో స్ఫూర్తి ΄÷ందుతున్న కాలంలో ఆమె తన కుంచెను బలమైన మాధ్యమంగా ఉపయోగించింది. మాతృత్వం నుంచి ఒంటరితనం వరకు తన చిత్రరచనకు నైనా ఎన్నో ఇతివృత్తాలు ఎంచుకుంది.బెంచీలు, బూట్లు, రాళ్లు, గోడలు, కొండలలాంటి నిర్జీవమైన వాటి నుంచి జంతువులు, పక్షుల వరకు ఆ చిత్రాలలో కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ వాటితో తమ జ్ఞాపకాలను పంచుకునేలా చేస్తాయి. ఆ జ్ఞాపకాలు ఒక వ్యక్తికి మరో వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. నైనా దలాల్‌ను ఇతర ప్రముఖ భారతీయ మహిళా కళాకారుల నుండి వేరు చేసిన అంశం ప్రింట్ మేకింగ్‌తో చేసిన లిథోగ్రాఫ్, కొలాగ్రాఫ్లు. 1960లో నైనా దలాల్ లండన్‌కు మకాం మార్చింది. ఇండియాలో ఉన్నప్పుడు స్పాన్సర్ షోల కంటే సొంత ఆర్ట్ షోలే ఎక్కువ చేసింది. ‘నైనా దలాల్ వివిధ మాధ్యమాల్లో వందలాది చిత్రాలను సృష్టించింది. ఈ ప్రదర్శన ఒక మినీ–రెట్రోస్పెక్టివ్ లాంటిది’ అంటున్నారునైనా దలాల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు.మహిళల గురించిన నా ఆలోచనలు కాలంతోపాటు మారుతూ వచ్చాయి. అవి నా చిత్రాల్లో ప్రతిఫలిస్తాయి. మహిళల్లో ఉండే సహనం నుంచి సంకల్పబలం వరకు ఎన్నో వెలుగులు నా చిత్రాల్లో కనిపిస్తాయి. నా కళలో కాల్పనిక విషయాలు కనిపించవు. నా చుట్టూ కనిపించే సాధారణ ప్రజల జీవితాలే కనిపిస్తాయి. శ్రామిక జీవుల గురించి చదివినప్పుడు, విన్నప్పుడు వారికి సంబంధించిన ఆలోచనలు నా మనసులో సుడులు తిరుగుతుంటాయి. ఆ అలజడిని నా చిత్రాల్లోకి తీసుకువస్తుంటాను. నా కళ వారికి గొంతు ఇస్తుందని అనుకుంటున్నాను.– నైనా దలాల్ -
అది ‘బీజేపీ గ్రామం’.. మరో పార్టీ కన్నేయదట!
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి నెలకొంది. అన్ని ప్రాంతాల్లోనూ వివిధ పార్టీలు తమ ప్రచారాలను కొనసాగిస్తున్నాయి. ప్రతీ పార్టీ వీలైనన్ని ఓట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. అయితే దేశంలోని ఆ గ్రామంలో కొనసాగే రాజకీయాల గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? ప్రత్యేకత ఏమిటి? మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని ఒక గ్రామంలోని జనం దశాబ్ధాల తరబడి బీజేపీకి మాత్రమే ఓటు వేస్తున్నారు. ఈ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతానికి కాంగ్రెస్ లేదా ఇతర ఏ పార్టీ కూడా ప్రచారానికి రాదు. గ్రామంలో కొన్ని దశాబ్ధాలుగా ఇదే జరుగుతోంది. గ్రామంలోనివారంతా బీజేపీకి ఏకగ్రీవంగా మద్దతు పలుకుతున్నారు. చంద్రపూర్‌లోని బల్లార్పూర్ అసెంబ్లీ పరిధిలోకి వచ్చే ఉథల్పేత్ బీజేపీకి కంచుకోటగా ఉంది. ఈ గ్రామంలో 653 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 96 శాతం ఓటింగ్ జరిగింది. ఈ ఓట్లన్నీ బీజేపీకే దక్కడం విశేషం. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ గ్రామంలోని ఓటర్లంతా బీజేపీకే తమ ఓటు వేశారు. ఆ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కాంగ్రెస్ లీడ్‌లోకి రాగా, ఉథల్పేత్లోని ఓట్లన్నీ బీజేపీకే పడటం విశేషం. ఈ గ్రామం ఆదర్శగ్రామంగానూ పేరొందింది. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ తామంతా బీజేపీకే పట్టం కడతామని గ్రామస్తులు చెబుతున్నారు. బిల్లార్పూర్ ఎమ్మెల్యే, బీజేపీ నేత సుధీర్ మున్గాంటీవర్ తమ గ్రామాన్ని అభివృద్ధిపథాన నడిపించి, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారని తెలిపారు. దీంతో గ్రామంలోని వారంతా స్వచ్ఛందంగా బీజేపీకి ప్రచారం చేస్తున్నారు. గ్రామంలోని పంచాయితీ కూడా బీజేపీ పాలకవర్గం చేతిలోనే ఉండటం విశేషం. -
బుందేల్‌ఖండ్‌లో బందిపోటు రాజకీయాలు!
ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఒకప్పుడు బందిపోటు దొంగల కనుసన్నల్లోనే రాజకీయాలన్నీ నడిచేవి. దశాబ్దాల తరబడి రాజకీయాలపై వారి ఆధిపత్యం కొనసాగింది. ఈ బందిపోటు దొంగలు ఎవరికి మద్దతిస్తే వారే ఎన్నికల్లో గెలిచేవారు. ఓట్ల కోసం ఆ బందిపోటు దొంగలు ఓటర్లను బెదిరించేవారు. ఎన్నికల రాజకీయాలను వారు తమ గుప్పిట్లో పెట్టుకునేవారు. 80వ దశకంలో యూపీలో భాగమైన బుందేల్‌ఖండ్‌లోని ఏడు జిల్లాలలోని ఆరింటిలో బందిపోట్లు తమ ఆధిపత్యం చెలాయించారు. ఝాన్సీ, జలౌన్, బందా, మహోబా, హమీర్పూర్, చిత్రకూట్‌లో వారి ఆటలు సాగేవి. దాదువా, నిర్భయ్ సింగ్ గుర్జార్, థోకియా తదిర బందిపోట్లు తాము ఈ ప్రాంతానికి రాజులుగా ప్రకటించుకున్నారు. తరువాతి కాలంలో వీరు రాజకీయ నేతలుగా, రాజకీయాలను శాసించేవారుగా మారారు. నేతలుగా మారిన దోపిడీ దొంగల జాబితాలో ముందుగా దాదువా పేరు వినిపిస్తుంది. దాదువా తన కుమారుడు వీర్ సింగ్‌ను జిల్లా పంచాయతీ అధ్యక్షునిగా చేయడంలో విజయం సాధించాడు. దాదువా 2007లో ఎన్కౌంటర్లో మృతిచెందాడు. అయితే అప్పటికే అతని కుటుంబ సభ్యులు రాజకీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీర్ సింగ్ చిత్రకూట్ నుంచి ఎస్పీ టికెట్ పై ఎమ్మెల్యేగా, అతని సోదరుడు బాల్ కుమార్ పటేల్ మీర్జాపూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మేనల్లుడు రామ్ సింగ్ కూడా ఎస్పీ టిక్కెట్‌పై ప్రతాప్‌గఢ్‌లోని పట్టి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందాడు. దాదువా మాదిరిగానే అంబికా పటేల్ అలియాస్ థోకియా కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో తమ హవా చాటుకున్నారు. 2005లో థోకియా అత్త సరిత బందాలోని కార్వీ బ్లాక్‌కు అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో అత్త సవిత జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2007లో తల్లి పిపారియా దేవి రాష్ట్రీయ లోక్‌దళ్ టిక్కెట్‌పై బందాలోని నారైని అసెంబ్లీ నుండి ఎన్నికలలో పోటీ చేశారు. ఆమె థోకియా పేరుతో 27 వేల ఓట్లను పొందగలిగారు. నిర్భయ్ సింగ్ గుర్జార్ కూడా ఎన్నికల్లో కాలు మోపారు. ఝాన్సీలోని గరౌత, జలౌన్, భోగానిపూర్‌లలోని రాజకీయాలన్నీ అతని కనుసన్నల్లో నడిచాయి. నిర్భయ్ సింగ్ గుర్జార్ అండతో నేతలు ఎన్నికల రేసులో దూసుకెళ్లేవారు. ఫూలన్ దేవి ఝాన్సీ డివిజన్లోని జలౌన్ జిల్లాలోని గోర్హా అనే చిన్న గ్రామానికి చెందిన బందిపోటు రాణిగా పేరొందింది. 1981 ఫిబ్రవరి 14న బెహ్మాయి ఊచకోత ఘటనతో ఫూలన్ దేవి దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. జైలు నుంచి విడుదలైన రెండేళ్ల తర్వాత 1996లో సమాజ్‌వాదీ పార్టీ ఆమెకు లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. ఫూలన్ తన తొలి ఎన్నికల్లోనే మీర్జాపూర్ ఎంపీగా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఆమె హత్యకు గురయ్యింది. -
రుతుపవనాల రాక.. ఈ ఏడాది ఓ విశేషముంది.. 60 ఏళ్లలో ఇలా..
ఢిల్లీ: రుతుపవనాల రాకతో దేశంలో పలు నగరాల్లో వర్షాలు మొదలయ్యాయి. అయితే.. రావడం కాస్త లేటయినా రుతుపవనాలు ఈ ఏడాది ఓ విశేషాన్ని తీసుకొచ్చాయి. ఈ సారి ఢిల్లీ, ముంబయిల్లోనూ ఒకేసారి కుండపోత వర్షాలు కురిశాయి. దేశ రాజధానిని, పశ్చిమ తీరంలో ఉన్న ముంబయిని ఒకే సారి రుతుపవనాలు తాకడం గత అరవై ఏళ్లలో ఇదే ప్రథమం. ఈ ఏడాది రుతుపవనాలు అంచనా వేసిన గడువుకు రెండు వారాల తర్వాత ముంబయిని తాకాయని భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డీ) తెలిపింది. కానీ దేశ రాజధాని ఢిల్లీని మాత్రం రెండ్రోజుల ముందే చేరాయని వెల్లడించింది. 1961 జూన్ 21న మొదటిసారి ముంబయి, ఢిల్లీని రుతుపవనాలు ఒకేసారి తాకాయి.. ఇన్నాళ్లకు మళ్లీ పునరావృతం అయినట్లు ఐఎమ్‌డీ తెలిపింది. ఈశాన్య రుతుపవనాలు మహారాష్ట్ర మొత్తం వ్యాపించాయి. అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యాణాలో కొంత భాగం, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్ముని చేరాయని ఐఎమ్‌డీ వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో దేశమంతటా వ్యాపిస్తాయని పేర్కొంది. ముంబయి, ఢిల్లీలో శనివారం రాత్రి కుండపోత వర్షం సంభవించింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇదీ చదవండి: సూపర్ పోలీస్.. రాకాసి అలల్లో పిల్లలను కాపాడి.. వీడియో వైరల్... -
30 ఏళ్ల క్రితం చేసిన మర్డర్.. తాజాగా తాగి వాగేసి.. దొరికేశాడు
ముంబై: లోనావాలాకు చెందిన అవినాష్ పవార్ 1993లో ఒక వృద్ధ జంటను హత్యచేసి వారింట్లో దొంగతనం చేశాడు. తర్వాత ఔరంగాబాద్ కు మకాం మార్చాడు. పరారీలో ఉండి 30 ఏళ్ళు రాజాలా బ్రతికాడు. చివరికి ఒక ఫంక్షన్లో బాగా తాగి ఆ మర్డర్ గురించి వాగి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. లోనావాలాలో చిన్న వ్యాపారం చేసుకునే అవినాష్ పవార్ అనే ఆసామి ఇద్దరు సహచరులతో కలిసి సమీపంలోని ఒక ఇంట్లోకి చొరబడి వృద్ధ జంటను హత్య చేసి వారింట్లో దొంగతనం చేశారు. తర్వాత పోలీసు విచారణలో మిగతా ఇద్దరు పట్టుబడగా అవినాష్ మాత్రం తన తల్లిని అక్కడే విడిచిపెట్టి ఢిల్లీ పారిపోయాడు. అప్పటికి అవినాష్ వయసు 19 ఏళ్ళు మాత్రమే. తర్వాత ఔరంగాబాద్ చేరుకుని అక్కడ అమిత్ పవార్ గా పేరు మార్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ కూడా సంపాదించాడు. అక్కడ నుండి పింప్రి-చించ్వాడ్, అహ్మద్ నగర్ అటునుంచి చివరికి ముంబై చేరుకొని అక్కడే సెటిల్ అయ్యాడు. ఆధార్ కార్డులో కూడా పేరు మార్చుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. తన భార్య రాజకీయంగా ఎదగడానికి కూడా తడ్పడ్డాడు. ప్రస్తుతం పవార్ వయసు 49 ఏళ్ళు. ఈ ముప్పై ఏళ్లలో అతను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు మురుగు కాలవలో పడి చనిపోయినట్టు మందు మైకంలో అప్పుడు చేసిన మర్డర్ గురించి ఓ పార్టీలో ఒక అజ్ఞాతవ్యక్తి దగ్గర వాగి దొరికిపోయాడు. ఆ వ్యక్తి నుండి సమాచారం అందుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ స్వయంగా రంగంలోకి దిగి పవార్ ను విక్రోలిలో అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ పవార్ అలియాస్ అమిత్ పవార్ కోసం గాలిస్తూనే ఉన్నాము. అతడి ఇద్దరు సహచరులు పట్టుబడినా ఇతను మాత్రం తప్పించుకున్నాడు. ఇన్నాళ్లుగా పవార్ తన తల్లిని గాని తన భార్య తల్లిదండ్రులను గాని చూడటానికి రాలేదు. చివరకు ఇలా విక్రోలీలో పట్టుబడ్డాడని తెలిపారు. -
రిలయన్స్‌ను పరుగులు పెట్టించిన అంబానీ.. 20 ఏళ్లలోనే..
న్యూఢిల్లీ: తండ్రి ధీరుభాయ్ అంబానీ ఆకస్మిక మరణంతో వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) పగ్గాలను ఆయన కుమారుడు ముకేశ్ అంబానీ (65) చేపట్టి రెండు దశాబ్దాలయ్యింది. ఈ ఇరవై ఏళ్లలో రిలయన్స్‌ను ముకేశ్ వృద్ధి బాటలో పరుగులు పెట్టించారు. టెలికమ్యూనికేషన్స్, రిటైల్, కొత్త ఇంధనం తదితర విభాగాల్లోకి సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆయన సారథ్యంలో రిలయన్స్ ఆదాయం 17 రెట్లు, లాభాలు 20 రెట్లు ఎగిశాయి. కంపెనీ అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటిగా ఆవిర్భవించింది. 2002లో ధీరుభాయ్ మరణం అనంతరం ముకేశ్, ఆయన చిన్న సోదరుడు అనిల్ అంబానీ.. రిలయన్స్ పగ్గాలు చేపట్టారు. ముకేశ్ సీఎండీగాను, అనిల్ వైస్ చైర్మన్, జాయింట్ ఎండీగాను బాధ్యతలు స్వీకరించారు. అయితే, సోదరులిద్దరి మధ్య ఆధిపత్య పోరు తలెత్తడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండుగా చీలింది. విభజనతో ముకేశ్ వంతుకు గ్యాస్, ఆయిల్, పెట్రోకెమికల్స్ విభాగాలు రాగా అనిల్ చేతికి టెలికం, విద్యుదుత్పత్తి, ఆర్థిక సేవల విభాగాలు వచ్చాయి. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ డ్రాపౌట్ అయిన ముకేశ్ సారథ్యంలో రిలయన్స్ మహా సామ్రాజ్యంగా ఎదిగింది. ఆ వివరాలు.. ►2002 మార్చిలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ. 41,989 కోట్లు కాగా 20% వార్షిక వృద్ధితో 2022 మార్చికల్లా రూ. 17,81,841 కోట్లకు చేరింది. ►ఆదాయాలు రూ. 45,411 కోట్ల నుంచి రూ. 7,92,756 కోట్లకు, లాభాలు రూ. 3,280 కోట్ల నుంచి రూ. 67,845 కోట్లకు ఎగిశాయి. ►ఎగుమతులు రూ. 11,200 కోట్ల నుంచి రూ. 2,54,970 కోట్లకు చేరాయి. ►మొత్తం అసెట్స్ వార్షిక ప్రాతిపదికన 19 శాతం వృద్ధితో రూ.48,987 కోట్ల నుంచి రూ. 14,99,665 కోట్లకు ఎగిశాయి. నికర విలువ 2002లో రూ. 27,977 కోట్లుగా ఉండగా.. 2022 మార్చి నాటికి రూ. 6,45,127 కోట్లకు పెరిగింది. ►రెండు దశాబ్దాల్లో ఇన్వెస్టర్ల సంపదకు ఏటా సగటున రూ. 87,000 కోట్లు చొప్పున, రిలయన్స్ రూ. 17.4 లక్షల కోట్లు జత చేసింది. ►మోతీలాల్ ఓస్వాల్ 26వ వార్షిక సంపద సృష్టి అధ్యయనం ప్రకారం 2016–21 మధ్యలో రూ. 10 లక్షల కోట్ల సంపద సృష్టితో రిలయన్స్ టాప్‌లో నిల్చింది. తన గత రికార్డును తానే తిరగరాసింది. ►ఈ క్రమంలో 2007లో ముకేశ్ అంబానీ దేశీయంగా తొలి ట్రిలియనీర్‌గా (రూపాయి మారకంలో లక్ష కోట్ల అధిపతి) ఎదిగారు. విస్తరణ.. రెండు దశాబ్దాల్లో రిలయన్స్ పలు కొత్త వ్యాపారాల్లోకి విస్తరించింది. 2006లో రిటైల్‌లోకి, 2021లో న్యూ ఎనర్జీ విభాగంలోకి ప్రవేశించింది. 2016లో జియో ద్వారా టెలికంలో సంచలనం సృష్టించింది. రిలయన్స్‌కు 2002లో జామ్‌నగర్‌లో ఒక్క ఆయిల్ రిఫైనరీ ఉండేది. అది ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ లొకేషన్ రిఫైనింగ్ కాంప్లెక్స్‌గా ఎదిగింది. ఈ వ్యవధిలో రిలయన్స్ చమురు శుద్ధి సామర్థ్యాలను రెట్టింపు చేసుకుంది. 2009లో చమురు, గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించింది. అటు పైన బ్రిటిష్ పెట్రోలియం దిగ్గజం బీపీని భాగస్వామిగా చేసుకుని పెట్రోల్ రిటైల్ అవుట్‌లెట్స్ నడిపిస్తోంది. పర్యావరణ అనుకూల ఇంధనాలపై దృష్టి పెట్టిన రిలయన్స్ వచ్చే మూడేళ్లలో కొత్త ఇంధన వ్యాపారంపై రూ.75,000 కోట్లు వెచ్చించనుంది. నిధుల సమీకరణ... 2021 ఆర్థిక సంవత్సరంలో రైట్స్ ఇష్యూ వంటి మార్గాల్లో రిలయన్స్ రికార్డు స్థాయిలో రూ. 2.5 లక్షల కోట్లు సమీకరించింది. జియో ప్లాట్‌ఫామ్స్.. రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో మైనారిటీ వాటాలు విక్రయించింది. ఫేస్బుక్, గూగుల్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. -
అయ్యవారికి అరటి గెల.. తెలుసుకోవాలంటే 170 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే..
టెక్కలి(శ్రీకాకుళం జిల్లా): భీష్మ ఏకాదశి పర్వదినం.. చెట్లతాండ్ర అనే గ్రామంలో లక్ష్మీనృసింహ స్వామి ఆలయ ప్రాంగణమంతా అరటి సువాసన. యువకులు గెలలు లెక్క పెడుతున్నారు. వంద దాటాయి.. వెయ్యి దాటాయి.. సమయం గడుస్తోంది గానీ లెక్క తేలడం లేదు. గెలలన్నీ పూర్తయ్యే సరికి వచ్చిన లెక్క ఎనిమిది వేలు. చదవండి: ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’.. బిందెలన్నీ అక్కడ తయారైనవే! ఎనభై ఏళ్ల కిందట ఊరిలో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు సరిహద్దులు చెరిపేస్తూ ఇతర రాష్ట్రాలకూ పాకింది. ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి ఇక్కడ అరటి గెలలు కడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున గెలలు కట్టినా ఎన్నడూ లెక్కలో పొరపాటు రాలేదు. అసలు ఈ అరుదైన సంప్రదాయం ఎలా మొదలైంది.? ఆలయ నిర్మాణం వెనుక విశేషాలేంటో తెలుసుకోవాలంటే 170 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. సంతబొమ్మాళి మండలంలోని చెట్లతాండ్ర. పెద్ద ప్రత్యేకతలు ఏమీ లేవు. అన్ని పల్లెల్లాగానే సా దాసీదా గ్రామం. కానీ ఇక్కడ ప్రతి ఇంటిలో నిర్వహించే శుభ కార్యానికి ముందు పరావస్తు అయ్యవారికి మొదట పూజలు నిర్వహించి ఆ తర్వా తే పనులు మొదలుపెడతారు. 170 ఏళ్ల కిందట ఈ ఊరికి వచ్చిన స్వామీజీ పేరే పరావస్తు అయ్యవారు. అరటి గెలల సంప్రదాయానికి మూల కారణం ఆయనే. అయ్యవారు జీవ సమాధిగా మారిన స్థలానికి ఆనుకుని నిర్మాణం చేసిన లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఇప్పటికి 170 ఏళ్ల కిందట.. ప్రస్తుతం నౌపడ ఆర్ఎస్.. అప్పట్లో రాళ్లపేట రైల్వే స్టేషన్లో చెట్లతాండ్ర గ్రామానికి చెందిన కుమ్మరి వృత్తిదారులు కుండలు అమ్మడానికి వెళ్లారు. పరావస్తు అయ్యవారు అనే స్వామి వారి వద్దకు వెళ్లి తనను చెట్లతాండ్ర గ్రామానికి తీసుకెళ్లాలని కోరారు. దీంతో కుమ్మరి వృత్తిదారులు స్వామిని గ్రామానికి తీసుకువచ్చారు. అప్పట్లో ఉన్న పాఠశాల వద్ద గ్రామానికి చెందిన పంగ అప్పలనాయుడుకు చెందిన స్థలంలో పర్ణశాల ఏర్పాటు చేసి అయ్యవారికి ఆతిథ్యం ఇచ్చారు. ఆయన నిత్యం లక్ష్మీనృసింహ స్వామిని ఆరాధించేవారు. గ్రామం చుట్టుపక్కల సత్సంగాలు నిర్వహించే వారు. ఈతి బాధలు ఉన్న వారికి స్వామి వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకుని సాంత్వన పొందేవారు. ఇలా 45 ఏళ్ల పాటు ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇన్నేళ్లూ ఆయన వద్ద ఉన్న అక్షయ పాత్ర ద్వారా ప్రసాదాలు ఇచ్చే వారని భక్తులు చెప్పుకునేవారు. పరావస్తు అయ్యవారు జీవసమాధిగా మారిన స్థలంలో పుట్టిన మర్రిచెట్టు 45 ఏళ్ల కైంకర్యాల తర్వాత ఆయన అక్కడే జీవ సమాధి పొందారు. ఆయన జీవ సమాధిగా మారిన ప్రదేశంలో కొద్ది రోజులకే మర్రి చెట్టు పుట్టింది. దీంతో ఆ మర్రిచెట్టు అయ్యవారికి ప్రతిరూపంగా భావించారు. ఆ తర్వాత గ్రామం మధ్యలో సుమారు ఎకరా స్థలాన్ని కేటాయించి లక్ష్మీ నృసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మొదట్లో వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించేవారు. రోజు రోజుకూ భక్తులు ఆరాధన పెరుగుతుండడంతో 80 ఏళ్ల కిందట అరటి గెలలను కట్టడం ప్రారంభించారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. మొదట్లో గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తులు మాత్ర మే అరటి గెలలు కట్టేవారు. ఆ తర్వాత జిల్లాలు, రాష్ట్రాలు దాటి భక్తులు ఇక్కడకు చేరుకుని అరటి గెలలు కట్టడం ప్రారంభించారు. అరటి గెలల సంఖ్య పదుల నుంచి వేలకు చేరింది. ఈ ఏడాది నిర్వహించిన భీష్మ ఏకాదశి ఉత్సవాలకు ఏకంగా 8 వేలకుపై చిలుకు అరటి గెలలు కట్టారు. ఒక్కటీ మిస్ కాదు చెట్లతాండ్ర గ్రామంలో గల పరావస్తు అయ్యవారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఆవరణలో భక్తులు వేల సంఖ్యలో అరటి గెలలు కడుతుంటారు. అయితే తిరిగి అరటి గెలలు తీసుకునే క్రమంలో ఏ ఒక్క అరటి గెల కూడా మిస్ కాదు. గ్రామంలో యువకులంతా ఎంతో బాధ్యతగా చూసుకుంటారు. మూడు రోజుల తర్వాత కొంత మంది భక్తులు అరటి గెలలను ఇంటికి తీసుకువెళ్తారు. మరి కొంత మంది స్వామి వద్దనే ఉంచేస్తారు. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఏ రోజూ అరటి గెలలు పోయాయి అనే మాట రాలేదని ఉత్సవాల కమిటీ సభ్యులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. మా ఊరిలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయ్యవారి సన్నిధిలో అరటి గెలల మహోత్సవాన్ని చూస్తున్నాను. ఏటా భక్తులు పెరుగుతున్నారు. -పి.జగ్గయ్య, చెట్లతాండ్ర, సంతబొమ్మాళి మండలం. బాధ్యతగా ఉంటాం మా గ్రామంలో ఏటా భీష్మ ఏకాదశి నుంచి మూడు రోజుల పాటు పరావస్తు అయ్యవారు లక్ష్మీ నృసింహాస్వామి ఆలయంలో ఎంతో బాధ్యతగా ఉత్సవాలు నిర్వహిస్తాం. వేలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యువకులంతా సమష్టిగా పనిచేస్తారు. భక్తులకు అన్నదానం నిర్వహిస్తాం. ఆంధ్రా, ఒడిశా, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. -పి.అసిరినాయుడు, సర్పంచ్, చెట్లతాండ్ర -
కులవృత్తులే ఆధారం
ఆదరణ లేకున్నా వీడని మమకారం వృత్తిని నమ్ముకునే దశాబ్దాలుగా జీవనం బతుకుబండిని లాగుతున్న వైనం సర్కార్ చేయూతనివ్వాలని వేడుకోలు జోగిపేట: ‘విద్యలెన్ని ఉన్నా.. కుల విద్యకు సాటిరావు’ అంటూ వృత్తి గొప్పతనాన్ని వర్ణించాడో కవి. కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తేనే వృత్తిని ఆస్వాదించవచ్చు. తృప్తి పొందొచ్చు. గతాన్ని.. ప్రస్తుతాన్ని పరిశీలిస్తే కులవృత్తులపై ఆధారపడి జీవించే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. పారిశ్రామికీకరణ, ఆధునిక పోకడలు మార్కెట్లో ప్రవేశించడంతో వృత్తికి ఆదరణ లేకుండాపోయింది. అయినా జోగిపేట, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ లాంటి పట్టణాల్లో పలువురు దశాబ్దాల తరబడి కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. వృత్తినే దైవంగా భావిస్తున్నారు. కష్టపడి కుటుంబాలను పోషిస్తున్నారు. కొన్ని కుటుంబాలైతే పిల్లలతో పాటు అందరూ కూడా వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నారు. పిల్లలను ఉన్నతంగా చదివిస్తున్నారు. కులవృత్తితో బతుకుబండిని లాగిస్తున్న కొందరిపై అభిప్రాయాలను ‘సాక్షి’ సేకరించింది. నాలుగు దశాబ్దాలుగా... నాలుగు దశాబ్దాలుగా.. వడ్రంగి పనిచేసుకుంటూ బతుకుతున్నా. కులవృత్తినే దైవంగా భావిస్తున్నారు. ఇప్పటోళ్లు కుల వృత్తి చేసేందుకు ముందుకు వస్తలేరు. మా కాలంలో చేసినం. కానీ అప్పుడు ఇప్పుడు కష్టమే. ఈ పని చేసుకుంటనే పిల్లలను సదివిస్తున్నా. కూతురును ఎంబీఏ చదివిస్తున్న మిగతా వారిని ఇక్కడే చదివిస్తున్నాను. సర్కారు పట్టించుకుంటేనే ముందు..ముందు కుల వృత్తులు బతుకుతాయి. - పండరి, వడ్రంగి ఇస్త్రీతోనే బతుకు... బట్టలు ఉతుకుతూ, ఇస్త్రీ చేస్తూ బతుకు ఎల్లదీస్తున్నా. పదేళ్లుగా ఇదే పని చేసుకుంటున్నా. ఇది తప్ప మరొకటి తెల్వది. నాకు ఇద్దరు పిల్లలు. ఇస్త్రీ చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నా. కులవృత్తి తప్ప వేరే పని చేసే పరిస్థితులు లేవు. కుల వృత్తిమీదనే ఆధారపడి జీవనం సాగించుకుంటూ బట్ట, పొట్ట పూర్తికి సంపాదించుకుంటున్నా. ప్రభుత్వం మాలాంటి వృత్తి చేసుకునేటోళ్లకు సాయం చేస్తే మా బతుకులు బాగుపడతాయి. సర్కారు సబ్సిడీ రుణాలు, అందరికి పెన్షన్లు ఇప్పియ్యాలి. - మురళీ, రజకుడు దర్జా లేకున్నా... కుల వృత్తిపై ప్రేమతోనే కాలం వెళ్లదీస్తున్నాను. ప్రస్తుతం ఉన్న ఖర్చులకు, చదువులకు కులవృత్తులపై ఆధారపడటం చాలా కష్టంగా ఉంది. బతుకు భారంగా తయారవుతుంది. అయినా నా కొడుకును హైదరాబాద్‌లో ఎంఏ చదివిస్తున్నాను. ఇప్పుడు రెడీమేడ్ ప్రపంచం నడుస్తుండడంతో దర్జీలకు గిరాకీ తగ్గింది. ఏదో గిన్ని రోజుల నుంచి కులవృత్తి మీదే ఆధారపడి బట్టపొట్ట మందం బతికినం. ప్రభుత్వం సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి. అర్హులకు ఫించన్లు ఇయ్యాలే. మా బతుకులకు భరోసా ఇయ్యాలె. అట్లయితేనే మా బతుకులు బాగుపడుతయ్. - విశ్వేశ్వరరావు, దర్జీ బంగారం పట్టినా.. స్వర్ణకారుడిగా బంగారు, వెండి ఆభరణాలను తయారు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. 30 ఏళ్లుగా కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాను. వృత్తిని నమ్ముకొని ధైర్యంగా పనిచేసుకుంటున్నాను. మా కుటుంబం అంతా కుల వృత్తిపై ఆధారం. సీజన్ బట్టి ఈ వృత్తి ద్వారా ఆదాయం వస్తుంది. ఆషాఢమాసాల్లో అంతంతే ఉంటుంది. వస్తువులు రెడీమేడ్‌గా దొరకడం వల్ల స్వర్ణకారులకు కాస్త గిరాకీ తగ్గింది. బ్యాంకులు స్వర్ణకారులకు లోన్లు ఇవ్వాలి. కులవృత్తులు అంతంకాకుండా చూడాలె. - రెడ్డిపల్లి చంద్రయ్య, గోల్డ్ స్మిత్ బట్ట, పొట్ట మందమే... పదేళ్లుగా క్షవర వృత్తి చేసుకుంటూనే కుటుంబాన్ని పోషిస్తున్నా. వృత్తిపై మమకారంతో కులవృత్తినే నమ్ముకున్నాను. కులవృత్తి చేస్తే బట్టపొట్ట మందమే కానీ ఆస్తులు సంపాదించే పరిస్థితిలేదు. పైసా కూడబెట్టిందైతే లేదు. కులవృత్తి చేసి బతికే వారికి సహకార సబ్సిడీ రుణాలు ఇప్పిస్తే కొంత వరకు బాగుపడతాం. వృత్తి అభివృద్ధి చేసుకొని జీవిస్తాం. పింఛన్ల సౌకర్యం కల్పించాలి. - మధుకిరణ్, నాయీబ్రాహ్మణుడు చేయూతలేని చేనేత చేనేత వృత్తిలో 25 సంవత్సరాల జీవితం గడిచిపోయింది. చేసే వృత్తితోనే బట్టాపొట్టా గడుస్తది. దీనిపైనే ఆధారపడి ఇళ్ళు మొత్తం బతకాలే. పిల్లల చదువులు సాగుతున్నాయి. పిల్లలను చదివిద్దామంటూ చాలా ఇబ్బందిగా ఉంది. పెరుగుతున్న ఖర్చులకు..ఈ సదువులు...ఫీజులుసూత్తేనే భయమైతుంది. అయినా ఎలాగో సంసారం నెట్టుకొస్తున్నాం. సర్కారు సాయం చేస్తే మా బతుకులు బాగు పడుతాయ్. సర్కారు బడుల్లోనే మా పిల్లలను చదివించినం. గిట్లనే ఉంటే రాను రానూ నేత మగ్గాలు కనిపించకుండా పోతయ్. చేనేత కార్మికులు నేసిన బట్టలకు పైసలు పెంచాలి. - సంగయ్య, నేత కార్మికుడు కుటుంబానికి అన్నం పెడుతుంది మా కుటుంబం అంతా మోచి వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. 40 ఏళ్లుగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. మా ముగ్గురు పిల్లలను డిగ్రీలు చదివించాను. మా భార్యకి క్యాన్సర్ ఆపరేషన్ అయి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కులవృత్తిపై నమ్మకంతో అప్పులు చేసి తీరుస్తున్నా కులవృత్తే మా కుటుంబ సభ్యులందరికి అన్నం పెడుతుంది. ప్రభుత్వం రుణాలను, పెన్షన్లు ఇప్పించి ఆదుకోవాలి. కుటుంబం అంతా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ప్రభుత్వం మాలాంటి వారిని ఆదుకోవాలి. - దుర్గారాజ్, మోచీ మాంసం అమ్ముకుంటేనే.. మాంసం అమ్ముకుంటూ మా కుటుంబాన్ని పోషిస్తున్నాను. మా తల్లిదండ్రులు పెద్దగా చదివించకపోవడంతో ఈ వృత్తిపైనే ఆధారడి బతుకుతున్నాం. నా ఇద్దరు పిల్లలను మాత్రం చదివిస్తున్నాను. సీజన్, అన్‌సీజన్ ఉన్నా తట్టుకొని ఈ వృత్తిలో కొనసాగుతున్నాం. జీవాల హెచ్చుతగ్గులు కావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. - కటికె లక్ష్మణ్, మాంసం విక్రయదారుడు -
పసి వయసులోనే వృద్ధాప్యం!
చిన్న పిల్లలకు సోకే అత్యంత అరుదైన చర్మవ్యాధి బెంజమిన్ బటన్. పసివయసులోనే వృద్ధాప్యం వచ్చినట్లుగా మారిపోవడం ఈ వ్యాధి లక్షణం. ఈ చర్మవ్యాధి సోకిన చిన్నారులు వయసు పైబడినవారిలా కనిపిస్తారు. ఏడేళ్ల అంజలి కుమారి, 18 నెలల కేశవ్ కుమార్ లాంటి చాలా మంది ఇప్పుడు అదే సమస్యతో బాధపడుతున్నారు. అతి చిన్న వయసులోనే చర్మమంతా ముడతలు పడిపోయి, వయసు మీద పడినట్లు కనిపిస్తున్నారు. జన్యుపరంగా వచ్చే ఆ అరుదైన రుగ్మతతో అక్కాతమ్ముళ్లు బాధపడుతున్నారు. జార్ఖండ్ రాంచికి చెందిన అంజలి, కేశవ్‌లను క్యూటిస్ లాక్సాగా పిలిచే అత్యంత భయంకరమైన రోగం పట్టిపీడిస్తోంది. శత్రుఘ్న రాజక్, రింకీదేవి దంపతులకు అంజలి, కేశవ్ లతో పాటు... 11 ఏళ్ల మరో కుమార్తె శిల్పి కూడా ఉంది. ఆమెలో మాత్రం పుట్టినప్పటి నుంచి ఈ వ్యాధి లక్షణాలు ఎక్కడా కనిపించలేదట. ఇండియాలో డాక్టర్లు కూడా ఈ వ్యాధిని తగ్గించడం కష్టమని చెప్పేశారు. అయితే తమను వీధిలోని వారంతా వింతగా చూస్తున్నారని, చెత్త కామెంట్లు చేస్తున్నారని అంజలి వాపోతోంది. దాది అమ్మా (బామ్మ), బుడియా (ముసలి), బందరియా (కోతి) వంటి పదాలతో పిలుస్తూ స్కూల్లో అంతా గేలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ పిల్లలకు సోకిన ఈ వింతవ్యాధి ఎప్పటికైనా తగ్గుతుందేమోనన్న ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. వైద్యులు మాత్రం దీనికి ఇతర దేశాల్లో తప్ప.. భారత్‌లో మందు లేదని తేల్చిచెప్పేశారు. లాండ్రీ మ్యాన్‌గా పనిచేస్తూ నెలకు రూ. 4,500 మాత్రమే సంపాదించే శత్రుఘ్నకు విదేశాల్లో వైద్యం చేయించే తాహతు లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. ఎప్పటికైనా తమ పిల్లలు సాధారణ స్థితికి వస్తారని ఆ తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తున్నారు. -
నా చెల్లి నన్ను కలిసింది...
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి... సుమారు నలభై సంవత్సరాల తర్వాత ఆ అక్కా చెల్లెళ్ళు... కలిసిన సన్నివేశం అందర్నీ అబ్బుర పరచింది. తొమ్మిదేళ్ళ వయసులో అమెరికాకు చెందిన దంపతులకు దత్తత వెళ్ళిన కొరియాకు చెందిన హోలీ ఓబ్రెయిన్... తన చిన్ననాటి సంఘటన గుర్తుకు రావడంతో ఆవేదనలో మునిగిపోయింది. తనను దత్తత ఇచ్చిన తర్వాత తన చెల్లిని సవతి తల్లి అనాథాశ్రమంలో చేర్చినట్లు ఆమెకు లీలగా గుర్తుకు వచ్చింది. ఆ జ్ఞాపకం మెదడులో కదిలిన క్షణం నుంచీ.... ఓబ్రెయిన్ మనసాగలేదు. చెల్లిని చూడాలని పరితపించి పోయింది. ఎలాగైనా ఆమె జాడ తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. తన సోదరి మేగాన్ హుఘ్స్ ను సవతి తల్లి కొరియాలోని ఓ అనాధాశ్రమంలో చేర్చినట్లుగా ఓబ్రెయిన్ కు అస్పష్టంగా గుర్తుకు వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఓ బ్రెయిన్ ను పెంచుకున్న తండ్రి... వేగంగా వెడుతున్న రైలునుంచి పడి మరణించాడు. ఆమెను చూసినవారు గుర్తించి రక్షించడంతో ఆమె బతికి బయట పడింది. ఆ తర్వాత దక్షిణ కొరియాలోని ఓ అనాధాశ్రమంలో చేరింది. అయితే అప్పటినుంచీ ఆమె సవతి తల్లి తన సోదరిని తన నుంచీ దూరం చేసిన క్షణాలు జ్ఞప్తికి వస్తూనే ఉన్నాయి. ఓ రోజు అర్థరాత్రి నిద్రనుంచీ ఉన్నట్టుండి లేచిన ఓబ్రెయిన్ కు కళ్ళ నీళ్ళు ఆగలేదు. తన గతాన్ని తలచుకొని కన్నీరుమున్నీరైంది. ఎలాగైనా తన చెల్లిని కలుసుకోవాలన్న కోరిక ఆమెలో పెరిగిపోయింది. తనను పెంచిన తల్లిని అడిగింది. ఆమె అనాథాశ్రమంలో వివరాలు సేకరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయినా ఓబ్రెయిన్ కు ఎక్కడో ఆశ... తన చెల్లి ఎక్కడో బతికే ఉంది. తనకెప్పటికైనా కనిపిస్తుందన్న నమ్మకంతో ఆమె జాడకోసం ప్రయత్నాలు కొనసాగించింది. చెల్లిని.. అమ్మను అనాథాశ్రమం దగ్గరే చివర్లో చూశాను. ఎలాగైనా ఆమె వివరాలు తెలుసుకోవాలని వార్తా పత్రికలకు కూడ సమాచారం ఇచ్చింది. దీంతో కొరియాలోని అనాథాశ్రమాల్లో వివరాలు సేకరించిన ప్రతినిధులు.. హుఘ్స్ ను కూడా అనాథాశ్రమం నుంచీ ఓ అమెరికన్ దంపతులు పెంపకానికి తీసుకున్నారని, వారు న్యూయార్క్ లో ఉంటారని తెలిపారు. ఓబ్రెయిన్ ఈ సంవత్సర ప్రారంభంలో బే ఫ్రంట్ హెల్త్ పోర్ట్ ఛాలెట్ అనే వైద్య విభాగంలో ఉద్యోగానికి చేరింది.మరో మూడు నెలల తర్వాత హుఘ్స్ కూడా అక్కడే ఫిజికల్ థెరపీ అసిస్టెంట్ గా చేరింది. సుమారు నలభై ఏళ్ళ క్రితం కొరియాలో విడిపోయిన ఆ ఇద్దరు అనాధలు ఒకే ఆస్పత్రిలో... ఒకే ఫ్లోర్ లో ఉద్యోగానికి చేరారు. ఒకే షిఫ్టులో కూడ పనిచేస్తున్నారు. కానీ ఒకరికి ఒకరు పరిచయం లేదు. అక్కాచెల్లెళ్ళేనని అస్సలు తెలియదు. అయితే ఓ రోజు ..ఓ పేషెంట్ కొరియాకు చెందిన మరో నర్స్ ఇక్కడ పని చేస్తోందని... బహుశా మీరిద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు అయి ఉండొచ్చని చెప్పింది. విషయం తెలిసిన వెంటనే ఓబ్రెయిన్ ఉత్సాహంగా ఆమెను కలిసేందుకు ప్రయత్నించింది. వివరాలు సేకరించింది. తెలిసిన వివరాలను బట్టి అక్కాచెల్లెళ్ళేనని నిర్థారణ అయింది. వారిద్దరూ అక్కాచెల్లెళ్ళేనని డీఎన్ ఏ టెస్టులు కూడా ధృవీకరించాయి. అనుమానం తీర్చుకొనేందుకు మరోసారి ల్యాబ్ టెస్టులను చెక్ చేసుకుంది. ''దేవుడు ఇంతటి అదృష్టాన్నిస్తాడని అనుకోలేదు. నా చెల్లి నన్ను కలిసింది. నాకు జీవితంలో కావాల్సింది ఏముంది? ఇప్పుడు నాకు పిల్లలు లేకపోయినా... నా చెల్లికి ఇద్దరు పిల్లలున్నారు. మేమంతా సెలవుల్లో సంతోషంగా గడుపుతాం..'' అంటూ ఓ బ్రెయిన్ ఆనంద భాష్పాలను తుడుచుకూంటూ... చెల్లి హుఘ్స్ ను గట్టిగా హగ్ చేసుకుంది.