వాషింగ్టన్ : పాకిస్తాన్‌కు రక్షణ సహాయం (సెక్యూరిటీ అసిస్టెన్స్) విషయంలో డొనాల్డ్ ట్రంప్ విధానాన్నే కొనసాగించాలని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. అయితే, భవిష్యత్తులోనూ రక్షణ సాయం రద్దును ఇలాగే కొనసాగిస్తారా? లేక ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. రక్షణ పేరిట పాకిస్తాన్‌కు అమెరికా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని 2018 జనవరిలో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేశారు. ఉగ్రవాదంపై పోరాటం విషయంలో పాకిస్తాన్ పాత్ర, సహకారం పట్ల సంతృప్తి కలగడం లేదని, అందుకే రక్షణ సాయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment