
వాషింగ్టన్ : అమెరికా సైన్యంలో ట్రాన్స్‌జెండర్ల నియామకాలు చేస్తున్నట్లు పెంటగాన్ వర్గాలు ప్రకటించాయి. అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో.. సైన్యంలోకి ట్రాన్స్‌జెండర్లను తీసుకుంటున్నట్లు పెంటగాన్ అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ ప్రక్రియ ఆరంభమవుతుందని పెంటగాన్ అధికార ప్రతినిధి డేవిడ్ ఈస్ట్‌బర్న్ చెప్పారు. సాయుధ దళాలలోకి ట్రాన్స్‌జెండర్లను తక్షణమే తీసుకోవాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు ఫెడరల్ కోర్టు తేల్చిచెప్పింది.
అమెరికా సాయుధ దళాలలోకి ట్రాన్సజెండర్లను తీసుకోవడంపై అధ్యక్షుడు ట్రంప్ ట్విటర్‌లో స్పందించారు. అమెరికా సైన్యంలోకి ట్రాన్స్‌జెండర్లను తీసుకోవడం అమెరికా ఆర్మీ ఉన్నతాధికారులు, రక్షణ రంగ నిపుణులు ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని కోరారు. అందులో.. ట్రాన్స్‌జెండర్లను సైన్యంలోకి తీసుకోవద్దని సూచించాలని ట్రంప్ కోరారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అమెరికా సాయుధ దళాల్లో 250 మంది ట్రాన్స్‌జెండర్లు విధులు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment