హైదరాబాద్ : రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని లండన్‌లో ఉన్న ఎన్నారైలు ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విభజించకూడదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నారైలు రాష్ట్రపతికి ఫ్యాక్స్ ద్వారా వినతిపత్రం పంపించారు. ఈ సందర్భంగా విభజనకు కారణమైన సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి నేతలపై ఎన్నరైలు మండిపడ్డారు.