చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: రాజకీయ పార్టీలు రెండు నాల్కల ధోరణి విడనాడి సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం విధులు బహిష్కరించి, నల్లబ్యాడ్జీలు ధరించి పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్కడి నుంచి సీకే.బాబు నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించారు. అనంతరం గాంధీ విగ్రహం చుట్టూ మానవహారంగా ఏర్పడి సమైక్యాం ధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ర్యాలీగా డీఈవో కార్యాలయానికి వెళ్లారు. విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొనాలని విద్యాశాఖ సిబ్బం దిని కోరారు. జేఏసీ, విద్యాశాఖ సిబ్బంది డీఈవో కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నేతలు మాట్లాడుతూ సమైక్యాంధ్రపై కేంద్రం నుంచి ప్రకటన వచ్చేంత వరకు ఉద్యమం ఆపమన్నారు.
రాజకీయ పార్టీలు రెండు నాల్కల ధోరణి విడనాడి సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ కార్యక్రమాలకు ఎంఈవోల సంఘం జిల్లా అధ్యక్షులు బి.సుధాకర్ మద్దతు ప్రకటించి, మంగళవారం నుంచి జరిగే కార్యక్రమాల్లో ఎంఈవోలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు కృష్ణారెడ్డి, చెంగల్రాయమందడి, రెడ్డిశేఖర్‌రెడ్డి, గంటామోహన్, గిరిప్రసాద్‌రెడ్డి, చంద్రశేఖర్‌నాయుడు, నరేంద్రకుమార్, శేఖర్, వెంకటేశ్వర్లు, నరోత్తమరెడ్డి, రవీంద్రరెడ్డి, విద్యాశాఖ సిబ్బంది మురళి, ప్రభాకర్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలి- టీచర్స్ జేఏసీ డిమాండ్
Published Tue, Aug 6 2013 1:43 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement