భారతదేశం కోసం స్వాతంత్రోద్యం చేస్తే సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం మరో పోరాటం చేయాల్సి వచ్చిందని రెడ్ల సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు ధర్మవరం సుబ్బారెడ్డి, లక్కసాగరం లక్షీ్ష్మరెడ్డి అన్నారు. ఆదివారం డోన్ పట్టణంలో 5వేల మందితో రెడ్డి సమైక్య గళం కార్యాక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు.
డోన్, న్యూస్‌లైన్: భారతదేశం కోసం స్వాతంత్రోద్యం చేస్తే సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం మరో పోరాటం చేయాల్సి వచ్చిందని రెడ్ల సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు ధర్మవరం సుబ్బారెడ్డి, లక్కసాగరం లక్షీ్ష్మరెడ్డి అన్నారు. ఆదివారం డోన్ పట్టణంలో 5వేల మందితో రెడ్డి సమైక్య గళం కార్యాక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలకు సంఘీభావం తెలిపారు. దీక్ష శిబిరంలో వారు మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమంతో కేంద్రపెద్దలు కళ్లు తెరవాలన్నారు.
తమ హక్కులు సాధన కోసం ప్రజలు, యువకులు, సమైక్యవాదులు ఉద్యమ బాట పట్టారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఉద్యమంలో భాగస్వాములై పోరాడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలను పట్టించుకోకుండా తెలంగాణ ఇస్తామంటూ ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు డాక్టర్ పోచా ప్రభాకర్‌రెడ్డి, కోట్ల హరిచంద్రారెడ్డి, శివరాంగారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, విక్రమసేనారెడ్డి, ప్రకాష్‌రెడ్డి ఉన్నారు.