
కూసుమంచి: పాలేరులోని పీవీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రాన్ని ఆదివారం ఆఫ్రికన్ దేశాలకు చెందిన 15 మంది ప్రతినిధులు సందర్శించి..ఇక్కడి చేపల పెంపకం తీరు బాగుందని కొనియాడారు. ఇండో–ఆఫ్రికన్ సమ్మిట్–3 లో భాగంగా వారు కేంద్రప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్, సెంట్రల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆçఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చ ర్ సంయుక్త ఆద్వర్యంలో వారు పర్యటకు వచ్చారు. పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు.
ఇట్టి బృందానికి శాస్త్రవేత్త నాగార్జున్ కుమార్ నాయకత్వం వహించారు. ప్రధాన శాస్త్రవేత్త విద్యాసాగర్‌రెడ్డి, సిబ్బంది ఘన స్వాగతం పలికి..చేపల పెంపకం, యాజమాన్య పద్ధతులు, పరిశోధనలు తదితర అంశాలను ప్రధానశాస్త్రవేత్తలు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం పరిశోధన కేంద్రంలోని చేపలు పెంచే ప్రదేశాలను స్వయంగా పరిశీలించారు.
పాలేరు రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్ యూనిట్‌ను సందర్శించగా..వాటి ఫలితాలను శాస్త్రవేత్తలు వివరించారు. ఈ పద్ధతిలో చేపల పెంపకంపై ప్రతినిధులు ఆసక్తిని కనబరిచారు. ఇక్కడ చేపల పెంపకం చాలా బాగుందని కితాబిచ్చారు. పరిశోధనా కేంద్రంలో మొక్కలను నాటారు. అనంతరం ఇక్కడే భోజనాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపి, పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
వ్యవసాయ సాంకేతికత ఇచ్చిపుచ్చుకునేందుకే...
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ శాస్త్రవేత్త నాగార్జున్ కుమార్ మాట్లాడుతూ.. గత నెల 15 నుంచి ఈ బృందం తెలంగాణాలో పర్యటిస్తుందని అన్నారు. ఇండో–ఆఫ్రికన్ దేశాలు వ్యవసాయ పద్ధతులు, సాంకేతికతను ఇచ్చిపుచ్చుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయని అన్నారు.
దీనిలో భాగంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై అధ్యయనం చేసేందుకు ఆఫ్రికన్ ప్రతినిధుల బృందం ఇక్కడికి వచ్చిందన్నారు. నైజీరియా నుంచి 10 మంది, ఇథియోఫియా నుంచి నలుగురు, మలానీ నుంచి ఒక్కరి చొప్పున ఈ బృందంలో ఉన్నారని వివరించారు. ఉన్నారని అన్నారు. ఈబృందం ఈనెల 7వరకు వివిధ పరిశోదన కేంద్రాలను సందర్శిస్తారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment