మేయర్‌ను కలిసిన ఐఐపీఏ ప్రతినిధులు
సాక్షి, సిటీబ్యూరో: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఐఐపీఏ, న్యూఢిల్లీ) ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ సుజిత్‌కుమార్ ప్రుసేథ్ నేతృత్వంలోని 9 మంది ప్రతినిధుల బృందం బుధవారం మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్‌లను కలిసింది. జీహెచ్‌ఎంసీ అమలు చేస్తున్న రూ. 5కే భోజనం, పేదబస్తీ ప్రజలకు శుద్ధజ లం, ఆస్తిపన్ను, డిజిట ల్ బర్త్ సర్టిఫికెట్లు, జీవవైవిధ్య విభాగం పనులు తదితర అంశాల గురించి వీరు మేయర్, డిప్యూటీ మేయర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమాల గురించి పూర్తి వివరాలందజేయాలని , తాము కూడా ఆయా ప్రాంతాల్లో వీటిని అమలు చేస్తామని ప్రతినిధులు కోరారు. వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రాథమ్యాల కనుగుణంగా పనులను పూర్తిచేయవచ్చునని ప్రతినిధుల బృందం అభిప్రాయపడింది. ఇక్కడి పనితీరు చాలా బాగుందని కితాబిచ్చింది.