
తిరుపతిలో దివ్యాంగుడికి సంక్షేమ పథకాలపై పత్రాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే భూమన
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆప్యాయత దక్కుతోంది. అన్ని జిల్లాల్లో శనివారం ఈ కార్యక్రమం ఉల్లాసంగా..ఉత్సాహంగా సాగింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
మా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి, మీకు మా ఆశీస్సులు ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ఈ సందర్భంగా వారు ప్రజలకు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment