విద్యుత్ ఉద్యోగులకు అండగా ఉంటాం
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
కాకినాడ: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమవంతు తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు బుధవారం కాకినాడలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబును కలిశారు. ఈ నెల 14వ తేదీన రాజమహేంద్రవంలో జరగనున్న సంఘ రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి హాజరుకావాల్సిందిగా కన్నబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు పార్టీ తరుపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల డైరీని కన్నబాబుకు అందజేశారు. వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్‌కాంతరెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి పి.సత్తిబాబు మాట్లాడుతూ విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడంతోపాటు ఈపీఎఫ్, జీపీఎఫ్ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘ ప్రతినిధులు వి.కాంతారావు, సాకా సుబ్రహ్మణ్యం, సాకా శ్రీనివాసశేఖర్ తదితరులు ఉన్నారు.