
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రవాసాంధ్రులు పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తానని నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రత్నాకర్ పేర్కొన్నారు. అదేవిధంగా నార్త్ అమెరికాలో ఉన్న ఎన్నారైల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నార్త్ అమెరికాకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం అయిన తర్వాత ఆయన తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా విజయవాడలోని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రత్నాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డితో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కావటి మనోహర్ నాయుడు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment