గాంధీకి కులాన్ని అంటగట్టడం కుట్రే
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన మహనీయుడు మహాత్మాగాంధీని వైశ్యుడు అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కులాన్ని అంటగడుతూ మాట్లాడటం వెనుక కుట్ర దాగి ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. ఆదివారంనాడిక్కడ ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాగానే గాంధీని చంపిన గాడ్సేకు గుడి కడ్తామని చెప్పిన విధంగానే, ఇప్పుడు గాంధీపై విషాన్ని చిమ్ముతున్నారని విమర్శించారు. అహిం స, సత్యాగ్రహం వంటి గాంధేయ సిద్ధాం తాలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయన్నారు.