సర్దార్ పటేల్ మా మేనమామ | Former Union Minister Jaipal Reddy fire BJP govt | Sakshi
Sakshi News home page

సర్దార్ పటేల్ మా మేనమామ

Published Thu, Nov 10 2016 1:12 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

సర్దార్ పటేల్ మా మేనమామ - Sakshi

సర్దార్ పటేల్ మా మేనమామ

 మహబూబ్‌నగర్ అర్బన్: భారతీయ జనతా పార్టీ.. భారత దేశానికి పెనుముప్పు లాంటిదని, జాతిపిత మహాత్మాగాంధీ ఆలో చనలకు వ్యతిరేకమని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. బుధ వారం మహబూబ్‌నగర్‌లో ఆయన విలే కరులతో మాట్లాడారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను కాంగ్రెస్ నేత కాదన్న భ్రమలు కల్పించడానికి బీజేపీ కుతంత్రాలు చేస్తున్న దని, కానీ పటేల్ మాకు, మా పార్టీకి మేన మామలాంటి వాడని చమత్కరించారు. గాంధీ దేశానికి మహోజ్వల నాయకత్వాన్ని అందించారని, నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్రబోస్‌లతో పాటు దేశ ప్రజలందరిని సమన్వయం చేశారని గుర్తుచేశారు. అంబే డ్కర్ ఓడినా, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిపించిం దని, రాజ్యాంగ రచన బాధ్యతను అప్పగించి అంటరాని తనాన్ని రూపుమాపడానికి నాంది పలికిందన్నారు. కేసీఆర్ ఎప్పటికై నా బీజేపీతో జత కడతాడని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement